
ఇంజినీరింగ్ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరి
రంపచోడవరం: ఇంజినీరింగ్ పనుల్లో నాణ్యతాప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని ఇంజినీరింగ్ అధికారులను ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం ఆదేశించారు. స్థానిక ఐటీడీఏ సమావేశం హాలులో బుధవారం వివిధ శాఖల ఇంజినీరింగ్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో మంజూరు చేసిన పనులను నాణ్యతతో పూర్తి చేయాలని, ఇంజినీరింగ్ పనుల పర్యవేక్షణకు మండలానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించామని చెప్పారు. పనులకు ఇబ్బంది లేకుండా ఇసుకను స్టాక్ పాయింట్లలో నిల్వ ఉంచాలని సూచించారు. బీఎస్‌ఎన్‌ఎల్ సెల్ టవర్ల నిర్మాణం జూన్ నెలాఖరు నాటికి పూర్తి చేసి, అందుబాటులోకి తీసుకురావాలన్నారు. సమా వేశంలో ఈఈలు ఐ.శ్రీనివాసరావు,రవికుమార్, సబ్బయ్య,మల్లికార్జున, ఏపీడీ జి.శ్రీనివాసరావు, డీఈ చైతన్య, వెంకటరమణ, సాయిసతీష్, సుబ్బారావు, శివ పాల్గొన్నారు.