
ఎస్టీ సర్టిఫికెట్లు పొందిన ఒడిశా వాసుల జాబితా ఇవ్వండి
● ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం
అరకులోయటౌన్: ఒడిశా రాష్ట్రం నుంచి అరకులోయకు బతుకు తెరువు కోసం వచ్చి, ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలు పొందిన వారి జాబితాను అందజేయాలని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం పద్మాపుం సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. శనివారం సచివాలయాన్ని ఎమ్మె ల్యే ఆకస్మికంగా సందర్శించారు. ఒడిశా నుంచి వచ్చిన వారంతా పద్మాపురం పంచాయతీ సంతో ష్‌నగర్‌లో ఎస్టీ సర్టిఫికెట్ పొంది, అక్రమంగా ఇళ్లు నిర్మించుకున్నారని, వారి వివరాలు అందజేయాలన్నారు. అనంతరం యండపల్లివలసలోని గురుకుల బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించారు. వంటశాలకు వెళ్లి వంటకాలు పరిశీలించారు. నాణ్యమైన, రుచికరమైన పదార్థాలను వండి వడ్డించాలని నిర్వాహకులకు ఆయన సూచించారు.