
అనంతగిరి పీహెచ్‌సీకి జాతీయ స్థాయి గుర్తింపు
అనంతగిరి(అరకులోయటౌన్): అనంతగిరి పీహెచ్‌సీకి జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. జాతీయ నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ వైద్య సేవలు అందిస్తున్నందుకు గాను ఈ గుర్తింపు లభించినట్టు పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ జ్ఞానేశ్వరి తెలిపారు. గత నెల 24న నేషనల్ క్యాలిటీ అస్యూరెన్స్ స్టాండర్ట్స్ బృందం పీహెచ్‌సీని సందర్శించినట్టు ఆమె చెప్పారు.గత ప్రభు త్వ హయాంలో నాడు– నేడు పథకం ద్వారా పీహెచ్‌సీని ఆధునికీకరించగా, ఆస్పత్రి డెవలప్‌మెంట్ ఫండ్‌తోపాటు మండల పరిషత్ నిధులు కేటాయించి ఎన్‌క్యూఏఎస్ ప్రమాణాలకు అనుగుణంగా పీహెచ్‌సీని తీర్చిదిద్దడంతో ఈ గుర్తిపు లభించినట్టు ఆమె తెలిపారు. ప్రజలకు మరింత నాణ్యమైన వైద్యం అందించేందుకు వైద్య సిబ్బంది కృషి చేయాలని, తమ సహకారం ఎప్పుడూ ఉంటుందని ఎంపీపీ శెట్టి నీలవేణి తెలిపారు.