
సీలేరు, అడ్డతీగలలో ర్యాలీ నిర్వహిస్తున్న గ్రామస్తులు
అరకులోయ టౌన్/చింతూరు/కొయ్యూరు/పాడేరురూరల్/సీలేరు/అడ్డతీగల: జమ్మూకాశ్మీర్ పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు డాడులు జరిపి వారి ప్రాణాలు తీసుకోవడం హేయమైన చర్యని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. గురువారం ఉగ్రదాడికి నిరసనగా అరకులోయ ప్రధాన కూడలిలో కొవ్వొత్తులతో శాంతి ప్రదర్శన చేశారు. జిల్లా వ్యాప్తంగా కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మత్స్యలింగంతో పాటు జిల్లా వ్యాప్తంగా జరిగిన ర్యాలీల్లో పాల్గొన్న పలువురు మాట్లాడుతూ పర్యాటకులపై కాల్పులు జరిపి వారి మృతికి కారణమైన ముష్కర ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలన్నారు.

సీలేరు, అడ్డతీగలలో ర్యాలీ నిర్వహిస్తున్న గ్రామస్తులు

సీలేరు, అడ్డతీగలలో ర్యాలీ నిర్వహిస్తున్న గ్రామస్తులు