
జేఈఈ మెయిన్స్‌లోగిరిజన విద్యార్థి సత్తా
● దేశవ్యాప్త ఎస్టీ కేటగిరిలో 137 ర్యాంకు
సాక్షి,పాడేరు: మండలకేంద్రం పాడేరు పట్టణంలోని నీలకంఠనగర్‌కు చెందిన గిరిజన విద్యార్థి సమర్ధి నందవర్ధన్ నిహాల్ జేఈఈ మెయిన్స్‌లో సత్తా చాటి, దేశావ్యాప్త ఎస్టీ కేటగిరిలో 137 ర్యాంక్ సాధించాడు. పాడేరుకు చెందిన సమర్ధి రఘు,ఉర్వశి దంపతుల పెద్ద కుమారుడు నందవర్ధన్ నిహాల్ పార్వతీపురం మన్యం జిల్లా జోగంపేటలోని గిరిజన సంక్షేమ గురుకుల కళాశాలలో ఇంటర్మీడియెట్ చదవి, ఇటీవల వచ్చిన ఫలితాల్లో 959 మార్కులు సాధించాడు. జేఈఈ మెయిన్స్‌లో సత్తా చాటిన నందవర్ధన్ నిహాల్‌ను పార్వతీపురంలో గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి శనివారం ఘనంగా సత్కరించి, అభినందించారు.