
విద్యుత్ వ్యర్థాలతో ఆరోగ్యానికి హాని
కలెక్టర్ దినేష్‌కుమార్
చింతపల్లి: విద్యుత్ వ్యర్థాలతో ప్రజల ఆరోగ్యానికి హాని కలుగుతుందని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. స్థానిక పాత బస్టాండ్ ఆవరణలో ఏర్పాటుచేసిన వృథా విద్యుత్ పరికరాల సేకరణ కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్, పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అభిషేక్ గౌడతో కలసి ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటిలో ఉన్న విద్యుత్ వ్యర్థ పరికరాలు, ప్టాస్టిక్ వస్తువుల వినియోగంతో అనేక అనర్థాలు ఏర్పడుతున్నాయన్నారు. ఈ వ్యర్థాల వల్ల తాగునీరు, వాతావరణంలో కాలుష్యం పెరిగి ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని చెప్పారు. ప్లాస్టిక్, విద్యుత్ వ్యర్థ పరికరాలతో కేన్సర్ వచ్చే ప్రమాదం ఉందని చెప్పారు. ప్రజలను అప్రమత్తం చేయడానికి ప్రభుత్వ యంత్రాంగంతో పాటు ప్రజా ప్రతినిధులు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం 10వేల జనాభా దాటిన చింతపల్లి, పాడేరు, పెదలబుడు, రంపచోడవరం పంచాయతీ కేంద్రాల్లో ఈ వ్యర్థ విద్యుత్ పరికరాల సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసిన ట్టు చెప్పారు. చింతపల్లి ఎంపీపీ,సర్పంచ్ తన దృష్టికి తీసుకువచ్చిన తాగునీరు, పారిశుధ్య స మస్యల పరిష్కారానికి చర్యలు చేపడతానని కలెక్టర్ హామీ ఇచ్చారు. పాత బస్టాండ్ నుంచి మండల పరిషత్ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఏ ర్పాటు చేసిన పోషణ్ పక్వాడా కార్యక్రమంలో భాగంగా గర్భిణులకు నిర్వహించిన సీమంతం కార్యక్రమం, దివ్యాంగుల గుర్తింపు శిబిరంలో పాల్గొన్నారు. మాజీ ఎమ్మె ల్యే గిడ్డి ఈశ్వరి,డీఎల్‌పీవో కుమార్,ఉపాధి ఏపీడీ లాలం సీతయ్య,ఎంపీపీ కోరాబు అనూషదేవి,సర్పంచ్ దురియా పుష్పలత,ఎంపీడీవో శ్రీనివాసరావు ఎంఈవోలు ప్రసాద్, బోడంనాయుడు, డీటీ చంద్రశేఖర్, కార్యదర్శి శ్రీధర్ పాల్గొన్నారు.