వైభవంగా మారెమ్మ ఉత్సవం
సీలేరు: మారెమ్మ అమ్మవారి ఆలయ వార్షికోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి గరగాలంకరణ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మారెమ్మ అమ్మవారి మాలధారులు సుమారు 60 మంది అగ్ని గుండం మీదుగా నడిచి అమ్మవారిని దర్శించు కున్నారు. తమిళ పూజారి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో అమ్మవారికి పంచామృతాభిషేకాలు, ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించారు.అమ్మవారి మాలధారులకు కంకణాలు కట్టారు. అనంతరం సీలేరు నది ఒడ్డుకు చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు.స్థానికులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి అమ్మవారికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో కళ్లు మిరమిట్లు గొలిపేలా బాణ సంచా కాల్చారు. ఉత్సవాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఆర్‌పీఎఫ్ పోలీసులు, ఎస్‌ఐ రవీంద్రనాథ్ తమ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు.
వైభవంగా మారెమ్మ ఉత్సవం


