
కార్యకర్తలకు అండగా ఉంటాం
గంగవరం: కార్యకర్తలకు అండగా ఉంటామని, అధికార పార్టీ నాయకులు ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోబోమని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ (బాబు), వైఎస్సార్ సీపీ రంపచోడవరం నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి అన్నారు. స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయ ఆవరణలో పార్టీ మండల కన్వీనర్ అమృత అప్పలరాజు అధ్యక్షతన బుధవారం మండల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్సీ అనంతబాబు, మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి పాల్గొన్నారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ రంపచోడవరం నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీకి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు అందరూ కృషి చేయాలన్నారు. పార్టీ కార్యకర్తలు ఎవరూ అధైర్య పడవద్దని చెప్పారు.గడిచిన ఐదేళ్లలో జగనన్న ప్రభుత్వం పేదప్రజలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమా లను అమలు చేసినా కూటమి బూటకపు హామీలను ప్రజలు నమ్మి అధికారం కట్టబెట్టారని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు కావస్తున్నా సూపర్‌సిక్స్ హామీలను అమలు చేయలేదని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి మాట్లాడుతూ పేదలు, రైతుల సంక్షే మం కోసం మాజీ సీఎం వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి చిత్తశుద్ధితో పనిచేశారని చెప్పారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం హయాంలో ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందాయని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆమె తెలిపారు. ఎంపీపీ పల్లాల కృష్ణారెడ్డి, జెడ్పీటీసీ బేబీ రత్నం, వైస్ ఎంపీపీలు గంగాదేవి, రామతులసి, నియోజ కవర్గం ఎస్సీసెల్ అధ్యక్షుడు తాతపూడి ప్రకాష్, పార్టీ నాయకులు యెజ్జు వెంకటేశ్వరరావు, సిద్ధార్థ దొర, కామరాజు దొర ప్రసంగించారు. ఎంపీటీసీ సభ్యులు కనకలక్ష్మి, వెంకటలక్ష్మి, పద్మావతి, కోఆప్షన్‌సభ్యుడు ప్రభాకర్, పార్టీ జిల్లా కార్యదర్శి ఏడుకొండలు, సర్పంచ్‌లు కామరాజు, లక్ష్మి, రమణమ్మ, శివ, రామలక్ష్మి, మరడిమ్మ, వెంకటేశ్వర్లు, లీలావతి, మండల ఇన్‌చార్జ్ సీహెచ్.రఘునాఽథ పాల్గొన్నారు.
● వైఎస్సార్ సీపీ గంగవరం మండల అధ్యక్షుడిగా డీసీసీబీ మాజీ డైరెక్టర్ యెజ్జు వెంకటేశ్వరరావును ప్రతిపాదిస్తూ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావును ఎమ్మెల్సీ అనంతబాబు, మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి పార్టీ కండువా కప్పి సన్మానించారు.
ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్,మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి

కార్యకర్తలకు అండగా ఉంటాం