
ఈదురు గాలులు వడగళ్ల వర్షం
పెదబయలు: జిల్లా వ్యాప్తంగా గడిచిన రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ఉరుములు, ఈదురుగాలులు, వడగళ్లతో మంగళవారం భారీ వర్షం కురిసింది. పెదబయలలో ఉదయం 11.30 గంటల నుంచి 12.30 గంటల వరకు గంట పాటు వర్షం కురవడంతో వీధుల్లోకి నీరు చేరింది. స్థానిక గ్రంథాలయం,అంగన్‌వాడీ కేంద్రం–2 వీధి సీసీ రోడ్డుపై వర్షం నీరు నిలిచిపోయింది.కేంద్రానికి వచ్చిన పిల్లల తల్లిదండ్రులు మోకాళ్లలోతు వర్షం నీటిలో దిగి వెళ్లారు. డ్రైనేజీ లేకపోవడంతో వర్షం పడితే నీరు రోడ్డుపై నిలిచిపోతోంది. ఈదురుగాలుల కారణంగా రెండు గంటల పాటు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది.
జి.మాడుగుల: మండలంలోని పలు గ్రామాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు, పిడుగులతో భారీ వర్షం కురిసింది. పాడేరు–జి.మాడుగుల, చింతపల్లి హైవే, కుంబిడిసింగి రోడ్లు జలమయమయ్యాయి. ద్విచక్రవాహనచోదకులు ఇబ్బందులకు గురయ్యారు. జి.మాడుగుల వారపుసంతలో సరుకులు తడిసిపోయాయి. దుకాణదారులు, చిల్లర వర్తకులు ఇక్కట్లకు గురయ్యారు. జి.మాడుగుల పీహెచ్‌సీ సమీపంలో గల షాపు పై కప్పు రేకులు ఎగిరిపోయాయి.
పిడుగుపాటుకు నాలుగు పశువుల మృతి
డుంబ్రిగుడ: మండలంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అరకు, డుంబ్రిగుడ, కురిడి రైల్వే క్రాసింగ్ వద్ద రెండు గంటల పాటు ఈదురు గాలులు, ఉరుములు,మెరుపులతో కుండపోతగా వర్షం కురవరవడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. పోతంగి పంచాయతీ పెదపాడులో పిడుగుపడి ఆ గ్రామానికి చెందిన కొర్రా హరి అనే గిరిజనుడికి చెందిన నాలుగు దుక్కి పశువుల మృతి చెందాయి. సుమారు రూ.లక్ష నష్టం వచ్చిందని, ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని బాధితుడు కోరాడు.
విద్యుత్ సరఫరాకు అంతరాయం
కొయ్యూరు: మండలంలో భారీ వర్షం కురిసింది.రోడ్లపై నుంచి నీరు కాలువలా ప్రవహించింది. కృష్ణదేవిపేట నుంచి వచ్చే విద్యుత్ లైన్ బ్రేక్‌డౌన్ కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.మరోవైపు రాజవొమ్మంగి నుంచి వచ్చే లైన్‌కు సంబంధించి రంపచోడవరం–అడ్డతీగల మధ్యలో సాంకేతిక సమస్య కారణంగా విద్యుత్ సరఫరా రాలేదు.
ముంచంగిపుట్టు: మండలంలో మంగళవారం మధ్యాహ్నం భారీ వర్షం కురుసింది. ముంచంగిపుట్టు నుంచి పెదబయలు,జోలాపుట్టు ప్రధాన మార్గాలు వర్షం నీటితో నిండిపోయాయి. పలుమార్లు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈదురు గాలులకు మామిడి కాయలు నేలరాలాయి.

ఈదురు గాలులు వడగళ్ల వర్షం

ఈదురు గాలులు వడగళ్ల వర్షం

ఈదురు గాలులు వడగళ్ల వర్షం

ఈదురు గాలులు వడగళ్ల వర్షం

ఈదురు గాలులు వడగళ్ల వర్షం