
బాల్య వివాహాలపై నిఘా పెట్టాలి
కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశాలు
సాక్షి,పాడేరు: పదవ తరగతి తరువాత హాస్టళ్ల నుంచి ఇళ్లకు వెళ్లిపోయిన 18 ఏళ్ల లోపు బాలికలపై ప్రత్యేకంగా దృష్టిసారించి,బాల్య వివా హాలు జరగకుండా నిఘా పెట్టాలని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం కలెక్టర్ అధ్యక్షతన జిల్లా బాల్య వివాహ నియంత్రణ కమిటీ సమావేశం జరిగింది. ఈసమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ బాల్య వివాహాలను గ్రామస్థాయిలోనే గుర్తించాలని, పరిష్కరించలేని సమస్యలను తన దృష్టికి తీసుకురావాలన్నారు. గ్రామ,మండల,డివిజన్ స్థాయి చైల్డ్ మేరేజ్ ప్రొబేషన్ ఆఫీసర్స్ సమర్థంగా పనిచేయాలని చెప్పారు. కిశోరి వికాసంలో సఖీ గ్రూప్స్ సమర్థంగా పనిచేస్తే బాల్య వివాహాలు,టీనేజీ ప్రెగ్నెన్సీ తగ్గుతాయన్నారు.
డ్రాప్ అవుట్ అయిన పిల్లలను ఈ విద్యాసంవత్సరంలో రెగ్యులర్ పాఠశాలల్లో చేర్పించాలని, 18ఏళ్లు నిండిన బాలికలకు స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ ఇప్పించాలని సూచించారు. డీఈవో,గిరిజన సంక్షేమ డీడీ, సీడీపీవోలు, స్కిల్ డెవలప్‌మెంట్ అధికారి సమన్వయంతో శిక్షణ ఏర్పాటు చేయాలని తెలిపారు. టెన్త్ నుంచి ఇంటర్‌కు వెళ్లే వారిని దగ్గరలోని కళాశాలలకు టైఅప్ చేసి ఇంటర్ విద్యపై అవగాహన కల్పించి, భయం పోగొట్టాలని సూచించారు. ఈనెల 21,22,23 తేదీల్లో ఐదేళ్లు నిండిన చిన్నారులను పండగ వాతావరణంలో పాఠశాలల్లో చేర్పించాలని ఆదేశించారు.
డీసీపీవోతో సహా ముగ్గురికి షోకాజ్ నోటీసులు
విఽధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. విద్యాఽశాఖకు నివేదికలు పంపని జిల్లా బాలల రక్షణ అధికారి(డీసీపీవో) టి.సద్దు, ఈ సమావేశానికి గైర్హాజరైన పాడేరు, రంపచోడవరం ప్రొబేషన్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ముగ్గురికీ షోకాజ్ నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయా సంచాలకులతో ఫోన్‌లో మాట్లాడిన కలెక్టర్.. పాడేరు డివిజన్‌కు అనకాపల్లి ప్రొబేషన్ అధికారిని, రంపచోడవరం డివిజన్‌కు రాజమండ్రి ప్రొబేషన్ అధికారిని ఇన్‌చార్జిలుగా నియమించాలని ఆదేశించారు.ఈ సమావేశంలో ఐసీడీఎస్ ఇన్‌చార్జి పీడీ ఎస్తేరురాణి, డీఈవో బ్రహ్మాజీరావు, సర్వశిక్ష ఏపీసీ స్వామినాయుడు, స్కిల్ డెవలప్‌మెంట్ అధికారి డాక్టర్ రోహిణి, కార్మిక శాఖ అధికారి సుజాత,ఎస్‌డీసీ లోకేశ్వరరావు, జీసీడీవో సూర్యకుమారి పాల్గొన్నారు.