ఏఐలో దూకుడు పెంచిన టీసీఎస్‌.. ఉద్యోగులకు ‘స్పెషల్‌ జోన్‌’ | TCS Launches AI Experience Zone To Strengthen AI Readiness For Workforce | Sakshi
Sakshi News home page

ఏఐలో దూకుడు పెంచిన టీసీఎస్‌.. ఉద్యోగులకు ‘స్పెషల్‌ జోన్‌’

Published Mon, Jan 15 2024 2:54 PM | Last Updated on Mon, Jan 15 2024 3:22 PM

TCS Launches AI Experience Zone To Strengthen AI Readiness For Workforce - Sakshi

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-రెడీ వర్క్‌ఫోర్స్‌ను సిద్ధం చేసే లక్ష్యంతో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (TCS) తమ వ్యాల్యూ చైన్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాలను బలోపేతం చేస్తోంది. ఉత్పాదక ఏఐ ఫౌండేషనల్‌ స్కిల్స్‌లో 1.5 లక్షల మంది ఉద్యోగులకు శిక్షణ ఇచ్చిన తర్వాత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జెన్‌ ఏఐలలో ప్రయోగాత్మక నైపుణ్యాన్ని మెరుగుపరచడానికి ఏఐ ఎక్స్‌పీరియన్స్ జోన్‌ను ప్రారంభించినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

ఏఐ ఎక్స్‌పీరియన్స్ జోన్ ద్వారా టీసీఎస్‌ ఉద్యోగులు జనరేటివ్‌ ఏఐ ఆధారిత అప్లికేషన్‌లపై పనిచేయవచ్చు. ప్రయోగాలు చేయవచ్చు. అమెజాన్ వెబ్ సర్వీసెస్, గూగుల్ మైక్రోసాఫ్ట్ వంటి సంస్థల నుంచి ఓపెన్ సోర్స్ టెక్నాలజీలు, లార్జ్‌ లాంగ్వేజ్‌ మోడల్స్‌తో ప్రయోగాలు చేయడానికి ఈ జోన్ సహాయపడుతుందని టీసీఎస్‌ పేర్కొంది.

కంటెంట్ క్రియేషన్, ఇన్ఫర్మేషన్ డిస్కవరీ, టాస్క్ ఆటోమేషన్ వంటి వినియోగ సందర్భాలలో ఉద్యోగులు ఈ సాధనాలను ఉపయోగించడంలో అనుభవాన్ని పొందవచ్చు.  ఇందుకు అవసరమైన అన్ని జెన్‌ ఏఐ కాన్సెప్ట్‌లను కవర్ చేసే ట్యుటోరియల్స్‌ ఈ జోన్‌లో ఉంటాయని కంపెనీ వివరించింది.

ఇదీ చదవండి: ఈ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో లేఆఫ్‌లు.. 300 మందికి ఉద్వాసన!

ఒకే రకమైన ఆసక్తి కలిగి నిర్దిష్ట సమస్యకు పరిష్కారాన్ని రూపొందించడానికి కలిసి పనిచేసే  ప్రపంచంలోని వివిధ ప్రాంతాల సహచరులకు ఏఐ ఎక్స్‌పీరియన్స్ జోన్ సహకారాన్ని అందిస్తుందని టీసీఎస్‌ ఏఐ క్లౌడ్ యూనిట్ హెడ్‌ శివ గణేశన్ తెలిపారు. ఉద్యోగుల తమ ఏఐ సామర్థ్యాన్ని పరీక్షించుకునేందుకు వీలుగా ఈ ఏఐ ఎక్స్‌పీరియన్స్ జోన్ హ్యాకథాన్‌లు, ఛాలెంజ్‌లు, పోటీలు నిర్వహిస్తుందని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement