Experience zones
-
ఏఐలో దూకుడు పెంచిన టీసీఎస్.. ఉద్యోగులకు ‘స్పెషల్ జోన్’
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-రెడీ వర్క్‌ఫోర్స్‌ను సిద్ధం చేసే లక్ష్యంతో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (TCS) తమ వ్యాల్యూ చైన్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాలను బలోపేతం చేస్తోంది. ఉత్పాదక ఏఐ ఫౌండేషనల్ స్కిల్స్‌లో 1.5 లక్షల మంది ఉద్యోగులకు శిక్షణ ఇచ్చిన తర్వాత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జెన్ ఏఐలలో ప్రయోగాత్మక నైపుణ్యాన్ని మెరుగుపరచడానికి ఏఐ ఎక్స్పీరియన్స్ జోన్‌ను ప్రారంభించినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఏఐ ఎక్స్పీరియన్స్ జోన్ ద్వారా టీసీఎస్ ఉద్యోగులు జనరేటివ్ ఏఐ ఆధారిత అప్లికేషన్లపై పనిచేయవచ్చు. ప్రయోగాలు చేయవచ్చు. అమెజాన్ వెబ్ సర్వీసెస్, గూగుల్ మైక్రోసాఫ్ట్ వంటి సంస్థల నుంచి ఓపెన్ సోర్స్ టెక్నాలజీలు, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్‌తో ప్రయోగాలు చేయడానికి ఈ జోన్ సహాయపడుతుందని టీసీఎస్ పేర్కొంది. కంటెంట్ క్రియేషన్, ఇన్ఫర్మేషన్ డిస్కవరీ, టాస్క్ ఆటోమేషన్ వంటి వినియోగ సందర్భాలలో ఉద్యోగులు ఈ సాధనాలను ఉపయోగించడంలో అనుభవాన్ని పొందవచ్చు. ఇందుకు అవసరమైన అన్ని జెన్ ఏఐ కాన్సెప్ట్‌లను కవర్ చేసే ట్యుటోరియల్స్ ఈ జోన్లో ఉంటాయని కంపెనీ వివరించింది. ఇదీ చదవండి: ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో లేఆఫ్‌లు.. 300 మందికి ఉద్వాసన! ఒకే రకమైన ఆసక్తి కలిగి నిర్దిష్ట సమస్యకు పరిష్కారాన్ని రూపొందించడానికి కలిసి పనిచేసే ప్రపంచంలోని వివిధ ప్రాంతాల సహచరులకు ఏఐ ఎక్స్పీరియన్స్ జోన్ సహకారాన్ని అందిస్తుందని టీసీఎస్ ఏఐ క్లౌడ్ యూనిట్ హెడ్ శివ గణేశన్ తెలిపారు. ఉద్యోగుల తమ ఏఐ సామర్థ్యాన్ని పరీక్షించుకునేందుకు వీలుగా ఈ ఏఐ ఎక్స్పీరియన్స్ జోన్ హ్యాకథాన్లు, ఛాలెంజ్‌లు, పోటీలు నిర్వహిస్తుందని పేర్కొన్నారు. -
24 గంటల్లో 16 న్యూ ఇయర్స్
కేవలం 24 గంటల వ్యవధిలో 16 సార్లు కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టడం సాధ్యమేనా? భూమిపై ఉన్న మనకు సాధ్యం కాకపోవచ్చు గానీ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో ఉన్న వ్యోమగాములకు ముమ్మాటికీ సాధ్యమే! వారు ఒక్కరోజులో 16 సార్లు నూతన సంవత్సరంలోకి ప్రవేశిస్తారు. వారు ప్రయాణిస్తున్న అంతరిక్ష కేంద్రం భూమిచుట్టూ గంటకు 28,000 కిలోమీటర్ల వేగంతో కక్ష్యలో తిరుగుతుండడం వల్లే ఇది సాధ్యమవుతోంది. అంటే ప్రతి 90 నిమిషాలకు ఒకసారి భూమిని చుట్టేస్తారు. వేర్వేరు టైమ్‌జోన్లలో వేగంగా ప్రయాణిస్తారు. మనకు ఒకరోజులో ఒకటే సూర్యోదయం, ఒకటే సూర్యాస్తమయం ఉంటే వ్యోమగాములు మాత్రం 16 సూర్యోదయాలు, 16 సూర్యాస్తమయాలు చూస్తారు. మనకు 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి ఉంటే, వ్యోమగాములకు 45 నిమిషాలు పగలు, 45 నిమిషాలు రాత్రి ఉంటాయి. ఈ చక్రం నిరంతరాయంగా తిరుగుతూనే ఉంటుంది. మరోమాట.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భూగోళం స్పష్టంగా కనిపిస్తుంది. భూమిపై విద్యుత్ వెలుగులను వ్యోమగాములు వీక్షిస్తుంటారు. న్యూ ఇయర్ సందర్భంగా 24 గంటల్లో 16 సార్లు వారు ఈ వేడుకలను తిలకిస్తారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రాజమండ్రిలో ఎక్స్‌పీరియెన్స్ జోన్ ప్రారంభించిన నికాన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇమేజింగ్ టెక్నాలజీ దిగ్గజం నికాన్ ఇండియా తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో ఎక్స్‌పీరియెన్స్ జోన్‌ను ఏర్పాటు చేసింది. మిర్రర్‌లెస్ సిరీస్, డీఎస్ఎల్ఆర్, హై జూమ్ కూల్‌పిక్స్ కెమెరాలు, లెన్సులు, యాక్సెసరీస్, స్పోర్ట్ ఆప్టిక్స్ శ్రేణి ఇక్కడ కొలువుదీరాయి. ఇదీ చదవండి: రూ. 2000 నోట్ల రద్దు: షాపింగ్ చేసుకోవచ్చా? వినియోగదార్లలో సృజనాత్మకతను వెలికితీసేందుకు, ఆవిష్కరణలు, కల్పనతో ఫోటోగ్రఫీ అభిరుచిని కొనసాగించడానికి వారిని శక్తివంతం చేయడం లక్ష్యంగా ఇటువంటి జోన్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు కంపెనీ తెలిపింది. మరిన్ని ఇంట్రస్టింగ్ వార్తలు, విశేషాలు కోసం చదవండి సాక్షి, బిజినెస్ అన్నీ సాహసాలే: ఆరు నెలలకే వేల కోట్ల బిజినెస్! -
ఆర్డర్ల డెలివరీకి ఫ్లిప్‌కార్ట్ ఎక్స్పీరియన్స్ జోన్
న్యూఢిల్లీ : ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తాజాగా దేశవ్యాప్తంగా 20 ఎక్స్పీరియన్స్ జోన్స్‌ను ఆవిష్కరించింది. ప్రత్యామ్నాయ డెలివరీ మోడల్ కింద వీటిని ప్రవేశపెడుతున్నట్లు సంస్థ తెలిపింది. కొనుగోలుదారులు తాము ఆర్డరు చేసిన ఉత్పత్తులను, తమకు అనువైన సమయంలో స్వయంగా పికప్ చేసుకునేందుకు ఇవి ఉపయోగపడతాయని పేర్కొంది. కస్టమర్లు డెలివరీ సమయంలో అందుబాటులో లేకపోవడం, కొన్ని భవంతుల్లో పర్సన్స్‌ను అనుమతించకపోవడం తదితర అంశాల వల్ల ఆర్డర్లను అందించడంలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు ఎక్స్పీరియన్స్ జోన్స్‌ను తలపెట్టినట్లు ఫ్లిప్‌కార్ట్ వివరించింది. ప్రస్తుతం బెంగళూరు, మైసూరు, కోల్‌కతా, పుణే తదితర నగరాల్లో వీటిని ఏర్పాటు చేసినట్లు 2016 నాటికి ఈ సంఖ్యను 100కి పెంచుకోనున్నట్లు పేర్కొంది.