ఆర్డర్ల డెలివరీకి ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌పీరియన్స్ జోన్
న్యూఢిల్లీ : ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తాజాగా దేశవ్యాప్తంగా 20 ఎక్స్‌పీరియన్స్ జోన్స్‌ను ఆవిష్కరించింది. ప్రత్యామ్నాయ డెలివరీ మోడల్ కింద వీటిని ప్రవేశపెడుతున్నట్లు సంస్థ తెలిపింది. కొనుగోలుదారులు తాము ఆర్డరు చేసిన ఉత్పత్తులను, తమకు అనువైన సమయంలో స్వయంగా పికప్ చేసుకునేందుకు ఇవి ఉపయోగపడతాయని పేర్కొంది. కస్టమర్లు డెలివరీ సమయంలో అందుబాటులో లేకపోవడం, కొన్ని భవంతుల్లో పర్సన్స్‌ను అనుమతించకపోవడం తదితర అంశాల వల్ల ఆర్డర్లను అందించడంలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు ఎక్స్‌పీరియన్స్ జోన్స్‌ను తలపెట్టినట్లు ఫ్లిప్‌కార్ట్ వివరించింది. ప్రస్తుతం బెంగళూరు, మైసూరు, కోల్‌కతా, పుణే తదితర నగరాల్లో వీటిని ఏర్పాటు చేసినట్లు 2016 నాటికి ఈ సంఖ్యను 100కి పెంచుకోనున్నట్లు పేర్కొంది.