
సాక్షి, హైదరాబాద్: కో–వర్కింగ్ స్పేస్ కంపెనీ అవ్ఫిస్ ప్రీమియం వర్క్‌స్పేస్ సేవలను ప్రారంభించింది. అవ్ఫిస్ గోల్డ్ పేరిట దేశవ్యాప్తంగా పెద్ద కంపెనీలకు గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్‌లను అందిస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. వచ్చే నాలుగు నెలల్లో హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా నగరాలలో 8 గోల్డ్ సెంటర్లను ప్రారంభించనున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇవి 2 లక్షలకు పైగా చ.అ. విస్తీర్ణంలో 5 వేలకు పైగా సీట్ల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని పేర్కొంది. ప్రస్తుతం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని రాజపుష్ప సమ్మిట్, బెం గళూరులోని శాంతినికేతన్–1 రెండు సెంటర్లు కార్యకలాపాలు సాగిస్తున్నాయని పేర్కొంది. ప్రస్తుతం అవ్ఫిస్‌కు 12 నగరాలలో 90 సెంటర్లు, 51 వేల సీట్లున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment