హైదరాబాద్‌లో ఏడబ్ల్యూఎఫ్‌ఐఎస్‌ సేవలు ప్రారంభం | Awfis launches co-working space in Hyd | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో ఏడబ్ల్యూఎఫ్‌ఐఎస్‌ సేవలు ప్రారంభం

Published Fri, Mar 10 2017 1:58 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

హైదరాబాద్‌లో ఏడబ్ల్యూఎఫ్‌ఐఎస్‌ సేవలు ప్రారంభం - Sakshi

హైదరాబాద్‌లో ఏడబ్ల్యూఎఫ్‌ఐఎస్‌ సేవలు ప్రారంభం

గంటల వారీగా ఆఫీస్‌ స్థలాన్ని అద్దెకు...
2018 మార్చి నాటికి 20 వేల సీట్ల లక్ష్యం


హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: గంటలు, రోజుల వారీగా ఆఫీసు స్థలాన్ని అద్దెకిచ్చే (కో–వర్కింగ్‌ స్పేస్‌) విభాగంలో ఉన్న ఏడబ్ల్యూఎఫ్‌ఐఎస్‌ హైదరాబాద్‌లో అడుగుపెట్టింది. తాజ్‌ డెక్కన్‌ భాగస్వామ్యంతో 200 సీటింగ్‌ సామర్థ్యం గల ఈ కేంద్రాన్ని ఇక్కడ ప్రారంభించింది. ఇందులో ప్రీమియం క్యాబిన్స్, ఫిక్స్‌డ్‌ డెస్క్‌లు, మీటింగ్‌ రూమ్‌లు, లాంజ్‌లను ఏర్పాటు చేసింది. ధరల శ్రేణి ఫ్లెక్సీ వర్క్‌ స్టేషన్లకు రోజుకు రూ.350, ఫిక్స్‌డ్‌ సీట్లు రూ.750, క్యాబిన్స్‌ నెలకు రూ.13 వేలు, మీటింగ్‌ గదులు గంటకు రూ.600లుగా ఉంటాయని ఏడబ్ల్యూఎఫ్‌ఐఎస్‌ ఫౌండర్‌ అండ్‌ సీఈఓ అమిత్‌ రమణి గురువారమిక్కడ విలేకరులకు తెలిపారు.

ప్రస్తుతం ఏడబ్ల్యూఎఫ్‌ఐఎస్‌ దేశంలోని 18 నగరాల్లో 5 వేల సీట్ల సామర్థ్యాన్ని కలిగి ఉందని.. 2018 మార్చి నాటికి 20 వేల సీట్లు లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. ఇందులో హైదరాబాద్‌లో వచ్చే 6 నెలల్లో  గచ్చిబౌలి, బేగంపేట్‌ల్లో 1,500 సీట్లు రానున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏడబ్ల్యూఎఫ్‌ఐఎస్‌ మార్కెటింగ్‌ హెడ్‌ సుమిత్‌ లఖానీ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement