కరోనా కష్టాలు ఇబ్బంది పెడుతున్న రియల్టీలో హైదరాబాద్ దూసుకుపోతుంది. దేశంలో ఉన్న మెట్రో సిటీస్‌లో దూకుడు కనబరుస్తోంది. రెసిడెన్షియల్, ఆఫీస్ స్పేస్, డీల్స్‌లో రికార్డులు సృష్టిస్తోంది. కమర్షియల్ స్పేస్ విభాగానికి సంబంధించి దేశంలోనే పెద్ద డీల్స్‌లో ఒకటి ఇటీవల హైదరాబాద్ నగరంలో జరిగింది.
మైండ్‌స్పేస్ దగ్గర
నగరంలోని ఆఫీస్ స్పేస్‌కి ఫుల్ డిమాండ్ ఉన్న మైండ్‌స్పేస్ ఐటీపార్క్ దగ్గర 4,50,000 చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ అగ్రిమెంట్ చేసినట్టు స్మార్ట్‌వర్క్ సంస్థ పేర్కొంది. లీజు అగ్రిమెంట్ పదేళ్లు ఉండగా ఇందులో ఐదేళ్ల కాలం లాక్ ఇన్ పీరియడ్‌గా ఉందని ఎకనామిక్‌టైమ్స్‌లో కథనం ప్రచురితమైంది. ఈ అగ్రిమెంట్ డీల్‌లో కుష్‌మన్ అండ్ వేక్‌ఫీల్డ్ సంస్థ భాగస్వామిగా వ్యవహరించినట్టు సమాచారం.
4,000 మంది ఉద్యోగులు
ఆఫీస్ స్పేస్ అగ్రిమెంట్ డీల్ 2021 చివరి క్వార్టర్‌లో పూర్తవగా ఇక్కడ కార్యకలాపాలు 2022 మొదటి కార్వర్ట్‌లో ప్రారంభం కావచ్చని తెలుస్తోంది. ఈ ఆఫీస్ స్పేస్‌లో ఒకేసారి 4,000ల మంది ఉద్యోగులు సౌకర్యవంతంగా పని చేసుకునే వీలుంది.
రెండో స్థానం
స్మార్ట్‌వర్క్స్ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం ఈ ఏడాది ఆఫీస్ స్పేస్ సెగ్మెంట్‌కి సంబంధించి అతి పెద్ద లీజ్ అగ్రిమెంట్ పూనేలో చోటు చేసుకుంది. ఆ నగరంలోని బనేర్ లొకాలిటీలో 5,60,00 చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ డీల్ జరిగింది. దాని తర్వాత రెండో అతి పెద్ద డీల్ భాగ్యనగరంలో చోటు చేసుకుంది.
ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్
ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్ విభాగంలో స్మార్ట్‌వర్క్స్ సంస్థ దేశంలోని 9 పెద్ద నగరాల్లో 32 లొకేషన్లలో సేవలు అందిస్తోంది. ఫార్చున్ 500 జాబితాలోని 400ల సంస్థలకు స్మార్క్‌వర్క్ సేవలు అందిస్తోంది. ఈ ఏడాది మెట్రో సిటీల్లో ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్ డిమాండ్ 40 మిలియన్ల చదరపు అడుగులకు చేరినట్టు స్మార్ట్‌వర్క్స్ పేర్కొంది.
చదవండి: హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఇళ్ల ధరలు, వరల్డ్ వైడ్‌గా..
Comments
Please login to add a commentAdd a comment