raheja it park
-
హిందూపూర్‌లో 350 ఎకరాల్లో టెక్స్టైల్ మరియు ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ కోసం పారిశ్రామికపార్క్ ఏర్పాటు
-
రియల్టీలో హైదరాబాద్ హవా! ఈ ఏడాది దేశంలోనే రెండో పెద్ద లీజ్ అగ్రిమెంట్
కరోనా కష్టాలు ఇబ్బంది పెడుతున్న రియల్టీలో హైదరాబాద్ దూసుకుపోతుంది. దేశంలో ఉన్న మెట్రో సిటీస్‌లో దూకుడు కనబరుస్తోంది. రెసిడెన్షియల్, ఆఫీస్ స్పేస్, డీల్స్‌లో రికార్డులు సృష్టిస్తోంది. కమర్షియల్ స్పేస్ విభాగానికి సంబంధించి దేశంలోనే పెద్ద డీల్స్‌లో ఒకటి ఇటీవల హైదరాబాద్ నగరంలో జరిగింది. మైండ్‌స్పేస్ దగ్గర నగరంలోని ఆఫీస్ స్పేస్‌కి ఫుల్ డిమాండ్ ఉన్న మైండ్‌స్పేస్ ఐటీపార్క్ దగ్గర 4,50,000 చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ అగ్రిమెంట్ చేసినట్టు స్మార్ట్‌వర్క్ సంస్థ పేర్కొంది. లీజు అగ్రిమెంట్ పదేళ్లు ఉండగా ఇందులో ఐదేళ్ల కాలం లాక్ ఇన్ పీరియడ్‌గా ఉందని ఎకనామిక్టైమ్స్లో కథనం ప్రచురితమైంది. ఈ అగ్రిమెంట్ డీల్‌లో కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ సంస్థ భాగస్వామిగా వ్యవహరించినట్టు సమాచారం. 4,000 మంది ఉద్యోగులు ఆఫీస్ స్పేస్ అగ్రిమెంట్ డీల్ 2021 చివరి క్వార్టర్లో పూర్తవగా ఇక్కడ కార్యకలాపాలు 2022 మొదటి కార్వర్ట్‌లో ప్రారంభం కావచ్చని తెలుస్తోంది. ఈ ఆఫీస్ స్పేస్‌లో ఒకేసారి 4,000ల మంది ఉద్యోగులు సౌకర్యవంతంగా పని చేసుకునే వీలుంది. రెండో స్థానం స్మార్ట్‌వర్క్స్ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం ఈ ఏడాది ఆఫీస్ స్పేస్ సెగ్మెంట్‌కి సంబంధించి అతి పెద్ద లీజ్ అగ్రిమెంట్ పూనేలో చోటు చేసుకుంది. ఆ నగరంలోని బనేర్ లొకాలిటీలో 5,60,00 చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ డీల్ జరిగింది. దాని తర్వాత రెండో అతి పెద్ద డీల్ భాగ్యనగరంలో చోటు చేసుకుంది. ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్ ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్ విభాగంలో స్మార్ట్‌వర్క్స్ సంస్థ దేశంలోని 9 పెద్ద నగరాల్లో 32 లొకేషన్లలో సేవలు అందిస్తోంది. ఫార్చున్ 500 జాబితాలోని 400ల సంస్థలకు స్మార్క్వర్క్ సేవలు అందిస్తోంది. ఈ ఏడాది మెట్రో సిటీల్లో ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్ డిమాండ్ 40 మిలియన్ల చదరపు అడుగులకు చేరినట్టు స్మార్ట్‌వర్క్స్ పేర్కొంది. చదవండి: హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఇళ్ల ధరలు, వరల్డ్ వైడ్‌గా.. -
సొంతింటికి దారేది?
* మెట్రో, ఓఆర్‌ఆర్‌లతో శివారు ప్రాంతాల అభివృద్ధి * కొంత దూరం వెళితే చాలు సొంతిల్లు కొనొచ్చు * వరంగల్ రహదారిలో అందుబాటులో స్థిరాస్తి ధరలు * సాగర్ రోడ్, రాజీవ్ రహదారిలో కూడా అంతే మరి హైదరాబాద్‌లో దిగువ, మధ్యతరగతి ప్రజలకు సొంతింటి స్వప్నం తీరదా? ఎంతో మందిని వేధిస్తున్న ఈ సందేహం తీర్చడానికి ‘సాక్షి రియల్టీ’ నగరం చుట్టూ పర్యటించింది. నగరం నుంచి కొంత దూరం వెళ్లడానికి సిద్ధపడితే చాలు.. సొంతింటి కలను సాకారం చేసుకోవచ్చని గుర్తించింది. ఏయే ప్రాంతాల్లో తక్కువ ధరలకు ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయో వివరించేదే ఈవారం ‘సాక్షి రియల్టీ’ ప్రత్యేక కథనం.. సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో వరంగల్ రహదారి ఒకటి. మెట్రో రైల్ నిర్మాణం, ఔటర్ రింగ్‌రోడ్డే ఇందుకు కారణం. ఇప్పటికే ఈ ప్రాంతంలో సర్వే ఆఫ్ ఇండియా, ఎన్జీఆర్ఐ, సీసీఎంబీ, ఐఐసీటీ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉండటంతో పాటు సింగపూర్ సిటీ, ఇన్ఫోసిస్, రహేజ ఐటీ పార్కులతో ఇక్కడ స్థిరాస్తి వ్యాపారం జోరందుకుంది. గతంలో ప్లాంటింగ్ వెంచర్లకే పరిమితమైన ఈ ప్రాంతంలో ఇప్పుడు ఫ్లాట్లు, విల్లాల నిర్మాణాలు జోరందుకున్నాయి. ఉప్పల్ రింగ్‌రోడ్డు నుంచి నాలుగైదు కిలో మీటర్ల పరిధిలో ఉన్న ఫీర్జాదిగూడ, పర్వతాపూర్, బోడుప్పల్, మల్లాపూర్, చెంగిచెర్ల గ్రామాలు.. సింగపూర్ సిటీకి దగ్గర్లో ఉన్న చౌదరిగూడ, అన్నోజిగూడ, పోచారం గ్రామాల్లో పెద్ద సంఖ్యలో ఇండిపెండెంట్ హౌస్‌లు, అపార్ట్మెంట్లు నిర్మాణ దశలో ఉన్నాయి. ఫ్లాటైతే రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు, ఇండిపెండెంట్ హౌస్‌కు రూ.18 నుంచి రూ.25 లక్షల వరకు ధరలున్నాయి. జాతీయ రహదారి వెంబడి ఉన్న ప్రాంతం హయత్‌నగర్ మండలం. వనస్థలిపురం, ఆటోనగర్ తదితర ప్రాంతాల్లో రూ.35 లక్షల వరకు పెడితేగానీ సొంతిల్లు దొరకడం లేదు. తొమ్మిదో నంబరు జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న గ్రామాల్లో, ఔటర్ రింగ్‌రోడ్ సమీప గ్రామాల్లో కూడా భారీ నిర్మాణాలు వెలుస్తున్నాయి. కుంట్లూరులో రూ.14 లక్షల నుంచి రూ.18 లక్షల వరకూ ధర ఉంది. పసుమాముల, పెద్ద అంబర్‌పేట, అబ్దుల్లాపూర్ మెట్, అనాజ్‌పూర్, బాటసింగారం గ్రామాల్లో రూ.12 లక్షలలోపే ఇల్లు దొరుకుతుంది. నాగోల్‌కు దగ్గరగా ఉన్న తట్టిఅన్నారం, మత్తుగూడ గ్రామాల పరిధిలో రూ.15 లక్షలకు పైగా ధర ఉంది. చాలామంది దృష్టిపడని ప్రాంతాల్లో సాగర్‌రోడ్డు ఒకటి. బీఎన్‌రెడ్డి నగర్ దాటిన తర్వాత ఎయిర్‌ఫీల్డ్, రహదారి వెంబడి రెండు కిలోమీటర్ల మేరకు అటవీశాఖ భూములు ఉండడంతో వెంటనే నగరాన్ని దాటి వెళ్లిపోతున్న అనుభూతి వస్తుంది. దీనివల్లే ఈ ప్రాంతం చాలామంది దృష్టిలో పడలేదు. బొంగ్లూరు వద్ద ఔటర్ రింగ్‌రోడ్ జంక్షన్‌ను నిర్మిస్తుండటంతో ఇప్పుడు ఈ ప్రాంతానికి మంచి గిరాకీ ఉంది. గుర్రంగూడ, ఇంజాపూర్, తుర్కయాంజాల్, రాగన్నగూడ తదితర గ్రామాల పరిధిలో సొంతిల్లు కావాలంటే రూ.15 లక్షల నుంచి పెట్టాల్సి ఉంటుంది. రహదారికి దగ్గరగా ఉంటే మాత్రం అదనంగా మరో రెండు లక్షలు పెట్టాలి. సరూర్‌నగర్ మండలం పరిధిలోని జిల్లెలగూడ, మీర్పేట్, అల్మాస్గూడ, బడంగ్‌పేట, నాదర్గుల్ గ్రామాల్లో 120 గజాల ఇల్లు రూ.12 లక్షలు, 150 గజాల ఇల్లు కోసం రూ.14 లక్షల నుంచి రూ.18 లక్షల వరకూ ధర ఉంది. కుషాయిగూడ చుట్టుపక్కల అన్నీ అభివృద్ధి చెందిన ప్రాంతాలే. దమ్మాయిగూడ, నాగారం, రాంపల్లి గ్రామాల్లో రూ.17 లక్షల నుంచి రూ.25 లక్షల్లో ఇల్ల్లు దొరుకుతున్నాయి. ఇప్పుడు అందరి దృష్టి రాజీవ్ రహదారిలోని శామీర్‌పేట్, పాత ముంబై మార్గంలోని కొంపల్లి, మేడ్చల్ ప్రాంతాలపైనే ఉంది. ఇక్కడ సొంతిల్లు కావాలంటే రూ.25 లక్షల పైమాటే. అలాగని నిరాశ పడక్కర్లేదు. శామీర్‌పేట వరకు వెళితే రూ.16 నుంచి రూ. 18 లక్షల్లోపే కొనేయొచ్చు. -
నవతరానికి నయా ఫ్లాట్లు
సాక్షి, హైదరాబాద్: ప్రతికూల పరిస్థితుల్లో కూడా హైదరాబాద్‌లో స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగుతున్న ప్రాంతాల్లో ఉప్పల్ ఒకటి. అందుకే ఇక్కడ అందుబాటు ధరల్లో నగరవాసుల సొంతింటి కలను సాకారం చేసేందుకు ‘సాయి సత్య నిలయం’కు శ్రీకారం చుట్టినట్లు వినాయక బిల్డర్స్, ఉప్పల్ బిల్డర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎస్. పద్మా రెడ్డి చెప్పారు. ఇంకాఏమన్నారంటే.. - శంకర్‌నగర్‌లో 2,400 గజాల్లో ‘సాయి సత్య నిలయం’ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం. మొత్తం 50 ఫ్లాట్లొస్తాయి. 2 బీహెచ్‌కే:45, 3 బీహెచ్‌కే:5 ఫ్లాట్లుంటాయి. చ.అ. ధర రూ. 2,450. - ఇప్పటికే ఉప్పల్ ఇన్ఫోసిస్, రహేజా ఐటీ పార్క్‌లతో కిటకిటలాడుతోంది. ఐటీఐఆర్ ప్రాజెక్ట్‌తో మరిన్ని ఐటీ కంపెనీలు ఇక్కడికి రానున్నాయి. దీనికితోడు ఉప్పల్ ప్రాంతంలో త్వరలోనే మెట్రో రైల్ ప్రారంభం కానున్నందున సమీప భవిష్యత్తులో ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. - మొత్తం స్థలంలో 30 శాతం స్థలాన్ని పచ్చదనం, ఇతరత్రా సదుపాయాలకు కేటాయించాం. ఆర్ఓ ప్లాంట్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, మల్టీపర్పస్ హాల్ (ఏసీ), ల్యాడ్‌స్కేప్, 24 గంటలూ సీసీ కెమెరాలతో నిఘా, చుట్టూ సోలార్ ఫెన్సింగ్, అత్యాధునిక జిమ్, వాకింగ్ ట్రాక్ వంటి ఆధునిక వసతులెన్నో కల్పిస్తున్నాం. 2015 చివరినాటికి కొనుగోలుదారుల చేతికి ఇంటి తాళాలందిస్తాం.