నవతరానికి నయా ఫ్లాట్లు
సాక్షి, హైదరాబాద్: ప్రతికూల పరిస్థితుల్లో కూడా హైదరాబాద్‌లో స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగుతున్న ప్రాంతాల్లో ఉప్పల్ ఒకటి. అందుకే ఇక్కడ అందుబాటు ధరల్లో నగరవాసుల సొంతింటి కలను సాకారం చేసేందుకు ‘సాయి సత్య నిలయం’కు శ్రీకారం చుట్టినట్లు వినాయక బిల్డర్స్, ఉప్పల్ బిల్డర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎస్. పద్మా రెడ్డి చెప్పారు.
ఇంకాఏమన్నారంటే..
- శంకర్‌నగర్‌లో 2,400 గజాల్లో ‘సాయి సత్య నిలయం’ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం. మొత్తం 50 ఫ్లాట్లొస్తాయి. 2 బీహెచ్‌కే:45, 3 బీహెచ్‌కే:5 ఫ్లాట్లుంటాయి. చ.అ. ధర రూ. 2,450.
- ఇప్పటికే ఉప్పల్ ఇన్ఫోసిస్, రహేజా ఐటీ పార్క్‌లతో కిటకిటలాడుతోంది. ఐటీఐఆర్ ప్రాజెక్ట్‌తో మరిన్ని ఐటీ కంపెనీలు ఇక్కడికి రానున్నాయి. దీనికితోడు ఉప్పల్ ప్రాంతంలో త్వరలోనే మెట్రో రైల్ ప్రారంభం కానున్నందున సమీప భవిష్యత్తులో ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.
- మొత్తం స్థలంలో 30 శాతం స్థలాన్ని పచ్చదనం, ఇతరత్రా సదుపాయాలకు కేటాయించాం. ఆర్‌ఓ ప్లాంట్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, మల్టీపర్పస్ హాల్ (ఏసీ), ల్యాడ్‌స్కేప్, 24 గంటలూ సీసీ కెమెరాలతో నిఘా, చుట్టూ సోలార్ ఫెన్సింగ్, అత్యాధునిక జిమ్, వాకింగ్ ట్రాక్ వంటి ఆధునిక వసతులెన్నో కల్పిస్తున్నాం. 2015 చివరినాటికి కొనుగోలుదారుల చేతికి ఇంటి తాళాలందిస్తాం.