న్యూఢిల్లీ: కార్పొరేట్ నిర్ణయాల జాప్యం వల్ల ఈ ఏడాది తొలి త్రైమాసికంలో హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ డిమాండ్ 37 శాతం తగ్గిందని ప్రాపర్టీ కన్సల్టెంట్ కుష్‌మాన్ అండ్ వాక్‌ఫీల్డ్ (సీ అండ్ డబ్ల్యూ) తెలిపింది. అలాగే ఆఫీస్ స్పేస్ లీజింగ్ డిమాండ్ ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో 57 శాతం, అహ్మదాబాద్‌లో 75 శాతం క్షీణించిందని పేర్కొంది. రానున్న త్రైమాసికాలలో ఆఫీస్ స్పేస్ లీజింగ్ తిరిగి పుంజుకోనుందని తెలిపింది.
జనవరి-మార్చి మధ్య కాలంలో ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ డిమాండ్ 14.61 లక్షల చదరపు అడుగుల నుంచి 6.26 లక్షల చదరపు అడుగులకు తగ్గిందని పేర్కొంది. దేశంలోని టాప్-8 నగరాలలో మొత్తంగా ఆఫీస్ స్పేస్ లీజింగ్ డిమాండ్ 59 లక్షల చదరపు అడుగుల నుంచి 79 లక్షల చదరపు అడుగులకు పెరిగినట్లు తెలిపింది. ఐటీ-ఐటీఈఎస్ కంపెనీల నుంచి ఆఫీస్ స్పేస్ లీజింగ్‌కు మంచి డిమాండ్ ఉందని పేర్కొంది.
బెంగళూరులో ఆఫీస్ స్పేస్ లీజింగ్ డిమాండ్ అత్యధికంగా 6 రె ట్లు పెరిగి, 5.31 లక్షల చదరపు అడుగుల నుంచి 32 లక్షల చదరపు అడుగులకు పెరిగినట్లు తెలిపింది. ఈ ఏడాది ఆఫీస్ స్పేస్ లీజింగ్ వృద్ధి 15 శాతంగా ఉంటుందని సీ అండ్ డబ్ల్యూ దక్షిణాసియా ఎగ్జిక్యూటివ్ మేనేజింగ్ డెరైక్టర్ సంజయ్ దత్ అన్నారు.
హైదరాబాద్‌లో 37 శాతం తగ్గిన ఆఫీస్ స్పేస్ లీజింగ్ డిమాండ్
Published Fri, Apr 17 2015 2:47 AM | Last Updated on Tue, Sep 4 2018 5:16 PM
Advertisement