
దళితులపై ఎందుకీ వివక్ష
శ్రీరంగరాజపురం : దళితులైన తమపై టీడీపీ నాయకులు, ఫీల్డ్ అసిస్టెంట్ వివక్ష చూపుతున్నారని మంగుంట దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, టీడీపీ నేతల దళితులపై వివక్ష చూపుతున్న నేపథ్యంలో గురువారం వారు విలేకరుల ఎదుట తమ గోడు వెల్లబోసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం గ్రామాల్లోని పేద ప్రజల వలసల నివారణకు స్థానికంగానే పనులు కల్పించాలని ఉపాధి హామీ పథకం అమలు చేసి, 100 రోజులు పని కల్పనకు చర్యలు తీసుకుందన్నారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి ఉపాధి కూలీలపై నిర్లక్ష్యం, వివక్ష చూపుతుందని ఆరోపించారు. తమకు పని కల్పించాలని ఫీల్డ్ అసిస్టెంట్ మోహన్‌కు ఎన్నిసార్లు విన్నవించుకున్నా స్పందించక పోగా.. మీకు పని కావాలంటే టీడీపీ నాయకులు జీవన్‌బాబురెడ్డి, చంద్రరెడ్డి చెబితేనే కల్పిస్తాననని, లేకుంటే లేదని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నాయుకులు జీవన్‌బాబురెడ్డి, చంద్రరెడ్డిని అడిగితే మా ఇంటి, పొలం వద్దకు పనిచేయడానికి వస్తేనే మీకు పని కల్పిస్తామని, లేకుంటే లేదని చెబుతున్నారని తెలిపారు. ఈ విషయమై ఎంపీడీఓ మోహన్‌మురళి, ఏపీఓ లలితకూమారికి ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న దాఖాలలు లేవన్నారు.
కానిస్టేబుల్ లక్ష్మికి పోలీసు లాంఛనాలతో వీడ్కోలు
చౌడేపల్లె: కుటుంబ సభ్యుల మనస్పర్థల కారణంగా బుధవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందిన కానిస్టేబుల్ లక్ష్మికి పోలీసు లాంఛనాలతో కన్నీటి వీడ్కోలు పలికారు. గురువారం ఎస్‌ఐ నాగేశ్వరరావు కుటుంబసభ్యుల నుంచి అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. జిల్లా పోలీసు సంఘం అధ్యక్షుడు ఉదయ్‌కుమార్, గుడిపల్లి, సోమల, చౌడేపల్లె, పుంగనూరుతోపాటు పలువురు పోలీసు సిబ్బంది కానిస్టేబుల్ లక్ష్మి మృతదేహాన్ని సందర్శించి, నివాళులర్పించారు. రూ: లక్ష ఆర్థిక సహాయం అందజేశారు. లక్ష్మి మృతితో గోసలకురప్పల్లెలో విషాధ చాయలు అలుముకున్నాయి.
ప్రభుత్వాస్పత్రిలో హత్యలు జరుగుతున్నాయి
– టీడీపీ నాయకుడు షణ్ముగం
చిత్తూరు రూరల్ : ప్రభుత్వాస్పత్రిలో హత్యలు జరుగుతున్నాయని, తన కుమార్తె శ్రీదుర్గ మృతికి ముమ్మాటికి ఆస్పత్రిలోని జూనియర్ డాక్టర్లే కారణమని బీసీ నాయకుడు, టీడీపీ సీనియర్ నాయకుడు పి షణ్ముగం ఆరోపించారు. గురువారం చిత్తూరు నగరంలోని బీసీ సంక్షేమ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన తన కుమార్తె మృతికి చిత్తూరు జిల్లా ప్రభుత్వాస్పత్రిలోని వైద్యులే ప్రధాన కారణమన్నారు. నిర్లక్ష్యంగా వైద్యం చేయడంతోనే చనిపోయిందని కన్నీంటి పర్యంతమయ్యారు. తలలో గాయపడిన విషయాన్ని తెలుసుకోకుండా ప్రథమ చికిత్స చేసి ఇంటికి పంపడంతోనే ఆమె మృతి చెందిందని గోడు వెలబోసుకున్నారు. తన బిడ్డకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వం తక్షణ న్యాయ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. దీనిపై కలెక్టర్ ద్వారా సీఎం పేషీకి ఫిర్యాదు చేసినట్లు ఆయన వెల్లడించారు.

దళితులపై ఎందుకీ వివక్ష

దళితులపై ఎందుకీ వివక్ష