
గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతమే లక్ష్యం
చౌడేపల్లె: గ్రామస్థాయి నుంచి వైఎస్సార్‌సీపీని బలోపేతం చేయడమే లక్ష్యమని ఆ మండల అధ్యక్షుడు జి. నాగభూషణరెడ్డి అన్నారు. శనివారం పెద్దకొండామర్రిలో కోటూరుకు చెందిన మైనార్టీ నేతలు, పార్టీ నాయకులతోపాటు బోయకొండ ఆలయ కమిటీ మాజీ చైర్మన్ మిద్దింటి శంకర్ నారాయణ తదితర నేతలు కలిసి నూతనంగా ఎన్నికై న అధ్యక్షుడిని సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించి, ప్రజల్లో చైతన్యం తేవడానికి ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేయాలని కోరారు. కష్టపడి పనిచేసిన వారికి పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందన్నారు. త్వరలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించి కార్యక్రమాలకు స్వీకారం చుడతామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు జాఫర్, ఇంమ్రాన్, ఫయాజ్,రాంబాబు, హస్సేన్, మల్లికార్జున, అజారుధ్దీన్, సలీం, అలీ, మునిగిరిబాబు,శ్రీరాములు, వెంకీ, కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.