
పోలీసు గ్రీవెన్స్‌కు 41 ఫిర్యాదులు
చిత్తూరు అర్బన్: నగరంలో నిర్వహించిన పోలీ సు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో 41 వినతులు అందాయి. చిత్తూరు ఎస్పీ మణికంఠ ఏఆర్ కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీ కరించారు. వీటిలో మోసాలు, వేధింపులు, కు టుంబ తగాదాలు, ఇంటి తగాదాలు, భూ త గాదాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సమస్యలున్నాయి. పలు ఫిర్యాదులపై అప్పటికప్పుడే వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఆయా స్టేషన్ హౌజ్ అధికారులతో మాట్లాడారు. ప్రతి ఫిర్యాదును ఆన్‌లైన్‌లో నమోదు చేయాల న్నారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి సమస్యపై విచారణ జరిపి, ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు.
వేసవి శిక్షణ శిబిరాలు
విద్యార్థులకు ఎంతో ఉపయోగం
చిత్తూరు కార్పొరేషన్: జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాలు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయని సమగ్రశిక్షా శాఖ ఏపీసీ వెంకటరమణ తెలిపారు. ఆయన సోమవారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో వేసవి శిక్షణా శిబిరాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ శిబి రంలో స్పోకెన్ ఇంగ్లీష్, డ్రాయింగ్, క్యారమ్స్, కథలు చెప్పడం, వినడం, క్విజ్, పేపర్ క్రాఫ్ట్‌లలో శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. ఎంపీడీవో శ్రీనివాసులు, ఎంఈవో–2 మోహన్ మాట్లాడుతూ వేసవి సెలవుల్లో విద్యార్థులకు ప్రయోజనం కలిగేలా శిక్షణా శిబిరాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో విజయం విద్యాసంస్థల ఏఓ రాజగోపాల్, జన విజ్ఞాన వేదిక మాజీ కోఆర్డినేటర్ రంగనాథన్, డిప్యూటీ లైబ్రేరియన్ లలిత తదితరులు పాల్గొన్నారు.

పోలీసు గ్రీవెన్స్‌కు 41 ఫిర్యాదులు