
జాగ్రత్త పనిచేసుకోండి
చిత్తూరు రూరల్ (కాణిపాకం): ఎందుకు మా వరకు ఫిర్యాదులొస్తున్నాయి. మీరెందుకు పనిచేయడం లేదు..జాగ్రత్తగా పనిచేసుకోండని కలెక్టర్ సుమిత్‌కుమార్ సుతిమెత్తగా హెచ్చరించినట్లు తెలిసింది. ఈనెల 19వ తేదీన సాక్షి దినపత్రికలో శ్రీచిన్నపనైనా..చేయి తడపాల్సిందేశ్రీ అనే శీర్షికన కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై కలెక్టర్ స్పందించినట్లు తెలిసింది. అధికారుల ఇచ్చిన సమాచారం మేరకు.. సోమవారం చిత్తూరు అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసే అధికారులు, సిబ్బంది, వీఆర్వోలకు కలెక్టర్ పిలుపునిచ్చారు. ముందుగా ఓ సర్వేయర్‌కు వార్నింగ్ ఇచ్చారు. హిట్‌లిస్టులో ఉన్నవని, మంచిగా పనిచేయాలని హెచ్చరించారు. వీర్వోలు క్షేత్రస్థాయిలో ఏం చేస్తున్నారని, ఫిర్యాదులన్నీ అర్బన్ నుంచి అత్యధికంగా వస్తున్నాయన్నారు. ఎందుకు ఫిర్యాదుదారుల నుంచి వినతులు తీసుకోవడం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. పద్ధతి మార్చుకుని, పనిచేయాలని హుక్కుం జారీ చేశారని సమాచారం. కాగా ఈవిషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా ఓ సర్వేయర్ తప్పిదాలు, నిర్లక్ష్యంను గుర్తించి షోకాజ్ నోటీసులు ఇచ్చేందుకు అధికారులు సిద్ధమైన సమాచారం. షోకాజ్ నోటీసులో తహసీల్దార్ సంతకం పెడితే సోమవారం ఆ సర్వేయర్‌కు నోటీసులు ఇవ్వనున్నట్లు విశ్వసనీయ సమాచారం.