
పది పాసైన విద్యార్థులకు సువర్ణావకాశం
తిరుపతి సిటీ: జిల్లా విద్యార్థులకు నేషనల్ యూనివర్సిటీలో ఇంటర్మీడియెట్ చదివే అవకాశాన్ని తిరుపతి జాతీయ సంస్కృత వర్సిటీ కల్పిస్తోంది. పదోతరగతి పాసైన విద్యార్థులు ఇంటర్మీడియెట్ కోర్సులో (పాక్‌శాసీ్త్ర) చేరేందుకు అవకాశం కల్పిస్తూ వచ్చే నెల 3వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు వర్సిటీ అధికారులు తెలిపారు. ఇందులో ఇంగ్లిషు, హిందీ, సంస్కృతం, తెలుగు మాధ్యమాలు ఉంటాయన్నారు. ఇంటర్మీడియెట్ కోర్సుల్లో కంప్యూటర్, గణితం, హిస్టరీ, వ్యాకరణం, సాహిత్యం, జ్యోతిష్యం, పిలాసఫీ, యోగా వంటి సబ్జెక్టుల్లో బోధన ఉంటుందని పేర్కొన్నారు. నూతన విద్యావిధానంలో భాగంగా జాతీయ సంస్కృత వర్సిటీలో పాక్‌శాసీ్త్ర కోర్సులలో అడ్మిషన్లు పొందే విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు హాస్టల్ వసతి కల్పించనున్నట్టు తెలిపారు.
వచ్చేనెల 3 నుంచి దరఖాస్తులు
జాతీయ సంస్కృత వర్సిటీలో ఇంటర్మీడియెట్ కో ర్సులు చేరదలుకున్న విద్యార్థులు వచ్చే నెల 3వ తే దీ నుంచి వర్సిటీ వెబ్‌సైట్ www.nrktu.ac.inలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోలేని విద్యార్థులకు కోసం వర్సిటీలో అకడమిక్ సెక్షన్‌లో ఏర్పాటు చేసిన హెల్ఫ్ డెస్క్‌ను సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
సద్వినియోగం చేసుకోండి
ఇటీవల విడుదలైన ఎస్‌ఎస్‌సీ పరీక్షల ఫలితాలలో ఉత్తీర్ణులై న విద్యార్థులకు జాతీయ సంస్కృత వర్సిటీ ఆహ్వానం పలుకుతోంది. నేషనల్ యూనివర్సిటీలో ఇంటర్మీడియెట్ కో ర్సు పూర్తి చేసే అవకాశం వర్సిటీ కల్పిస్తోంది. పాక్‌శాసీ్త్ర (ఇంటర్మీడియెట్) కోర్సుకు ఆసక్తిగల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కోర్సులో చేరిన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు సైతం అందనున్నాయి.
–ప్రొఫెసర్ జీఎస్‌ఆర్ కృష్ణమూర్తి,
వీసీ, ఎన్‌ఎస్‌యూ
నేషనల్ వర్సిటీలో ఇంటర్ చదివే భాగ్యం
ఇంటర్మీడియెట్ (ప్రాక్‌శాస్త్రి) కోర్సులకు ఆహ్వానం పలుకుతున్న ఎన్‌ఎస్‌యూ
వచ్చే నెల 3 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ప్రారంభం

పది పాసైన విద్యార్థులకు సువర్ణావకాశం