
బాలికలదే హవా
● పదో తరగతి ఫలితాల్లో జిల్లాకు 24వ స్థానం ● సీఎం జిల్లాలో దారుణ ఫలితాలు ● గతేడాది 6వ స్థానం నుంచి 24కు దిగజారిన వైనం ● 67.06 శాతం ఉత్తీర్ణత నమోదు ● 20,796 మందికి 13,946 మంది ఉత్తీర్ణత ● జిల్లా ఫలితాలు విడుదల చేసిన డీఈఓ
పదో తరగతి పరీక్షా ఫలితాలు బుధవారం విడుదల కాగా అందులో జిల్లాకు తీవ్ర నిరాశే ఎదురైంది. సీఎం సొంత జిల్లా రాష్ట్రంలో 24వ స్థానంలో నిలిచి అందరినీ విస్మయానికి గురిచేసింది. 67.06 శాతం ఉత్తీర్ణత సాధించి అటు విద్యాధికారులు, ఇటు తల్లిదండ్రులను తీవ్ర నిరాశ పర్చింది. గతేడాది జిల్లా 6వ స్థానంలో ఉండగా నేడు ఏకంగా 24వ స్థానానికి పడిపోవడంతో మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీఎం ఇలాఖలో పది ఫలితాలు దారుణంగా పడిపోవడంపై తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఊరట చెందాల్సిన అంశం బాలికలు 73.20 శాతం ఉత్త్తీర్ణత సాధించి జిల్లా పరువు నిలబెట్టారు.
జిల్లా ఫలితాలు విడుదల చేస్తున్న డీఈఓ వరలక్ష్మి
చిత్తూరు కలెక్టరేట్ : పదో తరగతి పబ్లిక్ పరీక్షా ఫలితాలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను బుధవారం విజయవాడలో రాష్ట్ర విద్యాశాఖమంత్రి లోకేశ్ విడుదల చేశారు. ఈ ఫలితాల్లో చిత్తూరు జిల్లా రాష్ట్రంలో 26 స్థానాల్లో 24వ స్థానంలో నిలిచింది. సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు 24వ స్థానంలో నిలవడం ఆందోళనకు గురి చేసింది. జిల్లాలో పదో తరగతి విద్యార్థులు సాధించిన ఫలితాలను డీఈఓ వరలక్ష్మి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వరరావు, ఎంఈవోలు, సిబ్బంది మురళి, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఏటా లాగే ఈ ఏడాది సైతం బాలుర కంటే బాలికలే జిల్లాలో ముందంజలో నిలిచారు. ఫలితాల్లో బాలుర కంటే బాలికలు 11.9 శాతం ఎక్కువ ఉత్తీర్ణతను కై వసం చేసుకున్నారు.
దిగజారిన జిల్లా స్థానం.
సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు స్థానం పదో తరగతి ఫలితాల్లో దిగజారింది. గత విద్యాసంవత్సరంలో చిత్తూరు జిల్లా స్థానం రాష్ట్రంలో 6వ స్థానం సాధించగా ఈ విద్యాసంవత్సరం 24వ స్థానానికి పడిపోయింది. రాష్ట్రంలో చిత్తూరు జిల్లా స్థానం 67.06 శాతం నమోదైంది. గత విద్యాసంవత్సరం కంటే ఫలితాలు తగ్గడంపై క్షేత్రస్థాయిలో విమర్శలు వెలువెత్తుతున్నాయి.
6,850 మంది ఫెయిల్
జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో 6,850 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. గత విద్యాసంవత్సరం 1826 మంది విద్యార్థులు పరీక్షలు తప్పారు. ఈ విద్యా సంవత్సరం అంత కంటే ఎక్కువగా పరీక్షల్లో ఫెయిల్ కావడం విమర్శలకు తావిస్తోంది. ఈ విద్యాసంవత్సరం జిల్లాలో 20,796 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 13,946 మంది ఉత్తీర్ణత చెందగా 6,850 మంది పరీక్షల్లో ఫెయిల్ అయ్యారు.
సందేహం ఉంటే ..
2025
ఉత్తమ ఫలితాల్లోనూ అథమ స్థానమే..
జిల్లా వ్యాప్తంగా ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల్లో మొదటి డివిజన్‌లో 10,096 మంది ఉత్తమ ఫలితాలు సాధించారు. ఈ పరీక్షల్లో 13,946 మంది ఉత్తీర్ణత సాధించగా అందులో మొదటి డివిజన్‌లో 10,096, రెండో డివిజన్‌లో 2,562, మూడో డివిజన్‌లో 1,288 మంది ఉత్తీర్ణత పొంది ఉత్తమ ఫలితాలు సాధించారు. ఈ మూడు డివిజన్‌ల ఉత్తమ ఫలితాల సాధనలో చిత్తూరు జిల్లా రాష్ట్రంలో 20వ స్థానంలో నిలిచింది.
జిల్లా ఫలితాల సమాచారం
పరీక్షలు రాసిన బాలురు 10,723
ఉత్తీర్ణత చెందిన బాలురు
6,573
ఉత్తీర్ణత శాతం
61.30
శాతం
పరీక్షలు రాసిన బాలికలు 10,073
ఉత్తీర్ణత చెందిన బాలికలు
7,373
ఉత్తీర్ణత శాతం
73.20
శాతం
ఫెయిల్ అయిన విద్యార్థులు
6,850
పదో తరగతి పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చినా.. బాగా రాసి ఫెయిల్ అయినా.. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. రీ కౌంటింగ్‌కు ఒక్కో సబ్జెక్టుకు రూ.500, రీ వెరిఫికేషన్ కు సబ్జెక్టుకు రూ.1000 చొప్పున మే1వ తేదీ రాత్రి 11 గంటల లోపు చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా ఫెయిల్ అయిన విద్యార్థులకు మే 19వ తేదీ నుంచి మే 28వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు మే 30 వ తేదీ లోపు అపరాధ రుసుం లేకుండా, రూ.50 అపరాధ రుసుంతో మే 1 నుంచి 18 వ తేదీ లోపు పరీక్ష ఫీజును చెల్లించాల్సి ఉంటుందని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.

బాలికలదే హవా