ప్రజాస్వామ్యం..అపహాస్యం | - | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్యం..అపహాస్యం

Published Tue, Apr 29 2025 7:06 AM | Last Updated on Tue, Apr 29 2025 7:06 AM

ప్రజా

ప్రజాస్వామ్యం..అపహాస్యం

డబ్బు, పదవులకు లొంగని వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు
● అడ్డదారిలో కుప్పం చైర్మన్‌గిరి టీడీపీ కై వశం ● ఎదురొడ్డి నిలిచిన తొమ్మిది మంది సభ్యులు ● కొనియాడుతున్న కుప్పం జనం ● నైతిక విజయం వైఎస్సార్‌ సీపీదే

కుప్పంరూరల్‌: హ్యాట్సాప్‌ వైఎస్సార్‌ సీపీ కౌన్సిలర్లు అని కుప్పం జనం మెచ్చుకుంటున్నారు. ఎందుకంటే ప్రలోభాలు, బెదిరింపులు, దాడులకు వెరవకుండా మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ ప క్షాన నిలిచిన కౌన్సిలర్లకు వందనం..శత వందనం.. మీరే నిజమైన మా నాయకులు అని కుప్పం జనం కొనియాడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎలాగైనా కుప్పం మున్సిపల్‌ చైర్మన్‌ గిరిని దక్కించుకోవాలని అధికార పార్టీ మదిలో పడింది. ఇందుకు అనుగుణంగానే ప్రణాళికలు సిద్ధం చేసింది. కుప్పం కౌన్సిల్‌లో ఉన్న సభ్యులకు బెదిరింపులు, వేధింపులు మొదలు పెట్టింది. మొదటగా నలుగురు కౌన్సిలర్లు టీడీపీకి సరెండర్‌ అయ్యారు. తరువాత 2024 నవంబర్‌లో డాక్టర్‌ సుధీర్‌ చైర్మన్‌, కౌన్సిలర్‌ పదవులకు రాజీనామా చేశారు. అప్పటివరకు ఉన్న కౌన్సిల్‌ల్లో మార్పులు వచ్చాయి. చైర్మన్‌ రాజీనామా చేసి వెళ్లిపోగా, సభ్యుల సంఖ్య 24కు చేరింది. నలుగురు టీడీపీ వైపు వెళ్లిపోవడంతో వైఎస్సార్‌ సీపీకి ఉన్న బలం 19 నుంచి 14కు చేరింది. ఈ క్రమంలో రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికకు 28న ఎన్నికలు ఖరారు చేసింది. ఖరారు చేసినప్పటి నుంచి అధికార పార్టీ వైఎస్సార్‌ సీపీ వారిని రకరకాలుగా ప్రలోభాలకు గురిచేసింది. ఒక్కొక్కరికి రూ.50 లక్షలు ఆశ చూపింది. మరి కొంత మందికి ఉద్యోగం, మరొకరికి ఏకంగా చైర్మన్‌ పదవే ఆశ చూపారు. వీరి ప్రలోభాలకు నలుగురు ఆకర్షితులు కాగా, మరో ఇద్దరు ఓటింగ్‌కు దూరమయ్యారు. కానీ ఎమ్మెల్సీ భరత్‌ పాటు 9 మంది సభ్యులు మాత్రం రూ.లక్షల డబ్బు, ఉద్యోగాలు, పదవులు దేన్నీ లెక్క చేయక వైఎస్సార్‌ సీపీ తరఫున ఎన్నికల్లో పాల్గొన్నారు. ఓటమి దరిదాపుల్లోకి వచ్చినా ఎక్కడా వెరవక తమను ఎన్నుకున్న ప్రజలు, పార్టీ తరుఫున నిలబడి ఎన్నికల్లో పాల్గొన్నారు. వైఎస్సార్‌ సీపీ దొడ్డిదారి కొంత మంది కౌన్సిలర్లను కొని చైర్మన్‌ గిరి దక్కించుకోగా, వైఎస్సార్‌ సీపీ సభ్యులు మాత్రం నైతిక విజయం మాదే అంటు వెనుతిరిగి, కుప్పం జనం మనస్సు గెలుచుకున్నారు.

మున్సిపల్‌ చైర్మన్‌గా సెల్వరాజ్‌

కుప్పం: మున్సిపల్‌ చైర్మన్‌గా టీడీపీ అభ్యర్థి సెల్వరాజ్‌ ఎన్నికయ్యారు. సోమవారం మండల పరిషత్‌ కార్యాలయంలో ఎన్నికల అధికారి కుప్పం ఆర్డీఓ శ్రీని వాసులరాజు ఆధ్వర్యంలో మున్సిపల్‌ చైర్మన్‌ ఎ న్నిక నిర్వహించారు. మున్సిపాలిటీలో 24 మంది కౌన్సిలర్లు ఉండగా చైర్మన్‌ ఎన్నికల ఓటింగ్‌లో 22 మంది కౌన్సిల్‌ సభ్యులు పాల్గొన్నారు. వీరిలో అధికార పార్టీ చైర్మన్‌ అభ్యర్థిగా సెల్వరాజ్‌ను ప్రతిపాదించగా ఆయనకు 19 వార్డు కౌన్సిలర్‌ దాము, 20 వ వార్డు కౌన్సిలర్‌ సోములు సహకరించారు. వైఎస్సార్‌సీపీ చైర్మన్‌ అభ్యర్థిగా హఫీజ్‌ పార్టీ ప్రకటించగా ఆయనకు 2వ వార్డు సభ్యులు మునిరాజ్‌, 11వ వార్డు సభ్యురాలు మాధవి ప్రతిపాదించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారుడు సెల్వరాజ్‌కు 14 మంది చేతులెత్తి తమ మద్దతును పలికారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి హఫీజ్‌కు 9 మంది వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు మద్దతు పలికారు. మెజారిటీ టీడీపీకే ఉండడంతో కుప్పం మున్సిపల్‌ చైర్మన్‌గా 5వ వార్డు కౌన్సిలర్‌ సెల్వరాజ్‌ ఎన్నికయ్యారు.

సోమవారం ప్రజాస్వామ్యంలో బ్లాక్‌ డే

మండల సచివాలయం వద్ద చైర్మన్‌ ఎన్నిక సందర్భంగా బందోబస్తు

సోమవారం జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ దౌర్జన్యాలు, అడ్డదారుల్లో మున్సిపల్‌ చైర్మన్‌ పదవి దక్కించుకోవడాన్ని కుప్పం ప్రజలు జీర్ణించుకోవడం లేదు. సోమవారం ఒక ప్రజాస్వామ్యంలో ఒక బ్లాక్‌ డేగా అభివర్ణిస్తున్నారు. 18 మంది కౌన్సిలర్ల బలం స్పష్టంగా ఉన్నా ఓడి పోవడం ఏమిటని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని మరికొంత మంది అంటున్నారు. దమ్ముంటే తమవైపునకు తిప్పుకున్న కౌన్సిలర్లను రాజీనామాలు చేయించి, ఉప ఎన్నికల్లో గెలిపించుకుని చైర్మన్‌ ఎన్నికలకు వెళ్లాల్సిందని ఘాటుగా విమర్శిస్తున్నారు. అధికారాన్ని, వ్యవస్థలను అడ్డం పెట్టుకుని గెలుచుకునే బదులు ఎన్నిక లేకుండా వారే చైర్మన్‌ను ప్రకటించుకుంటే సరిపోయేదంటున్నారు. ఏది ఏమైనప్పటికీ మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికలు ప్రజాస్వామ్య బద్ధంగా జరగలేదని, నియంతల పాలనలో జరిగినట్లు ఉందని విశ్లేషిస్తున్నారు.

కుప్పంలో 144 సెక్షన్‌తో బోసిపోయిన రోడ్లు

వీళ్లే మా నేతలు అంటున్న జనం

ఎలాంటి ప్రలోభాలకు లొంగక చివరి వరకు పోరాడిన వీరే తమ నాయకులని ఆయా వార్డు జనం అంటున్నారు. తమ విలువైన ఓటు వేసి గెలిపించినందుకు తమకు ఇప్పుడు గర్వంగా ఉందన్నారు. ఇతరుల మాదిరిగా వ్యక్తిగత ప్రయోజనాలకు పోకుండా ప్రజాక్షేమమే ధ్యేయంగా నడుచుకున్న వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ల వెంటనే తాము ఉంటామని జనం అంటున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ఫ్యాను గుర్తుకే ఓటు వేసి వీరిని నాయకులుగా ఎన్నుకుంటామని దీమా వ్యక్తం చేస్తున్నారు.

కుప్పం మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక దుర్మార్గం ధ్వజమెత్తిన వైఎస్సార్‌సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి

తిరుపతి మంగళం: వైఎస్సార్‌సీపీని బలహీనపరచాలన్న దురాలోచనతో స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు అపహాస్యం చేస్తు న్నారని వైఎస్సార్‌సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పం మున్సిపల్‌ చైర్మన్‌ ఉపఎన్నికపై సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పం మున్సిపాలిటీలో టీడీపీకి బలం లేకపోయినా దుర్మార్గంగా వ్యవహరించిందన్నారు. ఆరుగురు కౌన్సలర్లతో కు ప్పం మున్సిపాలిటీని ఎలా కై వసం చేసుకోగలదని ప్రశ్నించారు. తన సొంత నియోజకవర్గంలో ఓటమి పాలవుతారన్న భయంతో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు ఒక్కొక్కరిని రూ.50లక్షలతో కొనుగోలు చేసినట్టు ఆరోపించారు. కేవలం పది నెలల పదవీ కాలం మాత్రమే ఉన్న కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో చంద్రబాబు ఇంతటి అరాచకాలు సృష్టించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ నాయకులు ఎవరైనా కూటమి ప్రభుత్వంలో చేరడానికి వస్తే చేర్చుకునే ప్రసక్తేలేదని చంద్రబాబు నీతులు ఒలకబోశారని గుర్తుచేశారు. గత రెండు నెలలుగా రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు అన్నీఇన్నీ కావన్నారు. తమ నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాడిపత్రి మున్సిపాలిటీలో టీడీపీ నుంచి ఇద్దరు కౌన్సిలర్లను వైఎస్సార్‌సీపీ వైపు తిప్పుకుని ఉంటే తమ పార్టీనే చైర్మన్‌ పదవి చేపట్టి ఉండేదని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడా టీడీపీకి మెజారిటీ లేకపోయినా స్థానిక సంస్థల ఎన్నికల్లో కౌన్సిలర్లను, కార్పొరేటర్లను కొనేసి గెలుచుకున్నామంటూ గొప్పలు చెప్పు కోవడం చంద్రబాబు నీచ రాజకీయాలకు నిదర్శనమన్నారు. చంద్రబాబు అరాచకాలను రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారని, తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

ప్రజాస్వామ్యం..అపహాస్యం1
1/4

ప్రజాస్వామ్యం..అపహాస్యం

ప్రజాస్వామ్యం..అపహాస్యం2
2/4

ప్రజాస్వామ్యం..అపహాస్యం

ప్రజాస్వామ్యం..అపహాస్యం3
3/4

ప్రజాస్వామ్యం..అపహాస్యం

ప్రజాస్వామ్యం..అపహాస్యం4
4/4

ప్రజాస్వామ్యం..అపహాస్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement