గుజరాత్‌లోని జామ్‌నగర్ జిల్లా, బేద్ గ్రామం వద్ద శనివారం వాయుసేనకు చెందిన మిగ్-21 యుద్ధవిమానం కూలిపోయింది.
జామ్‌నగర్: గుజరాత్‌లోని జామ్‌నగర్ జిల్లా, బేద్ గ్రామం వద్ద శనివారం వాయుసేనకు చెందిన మిగ్-21 యుద్ధవిమానం కూలిపోయింది. ఈ ప్రమాదం నుంచి పైలట్ పారాచూట్ సాయంతో సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాద స్థలికి సమీపంలో సముద్రతీరంలో దిగిన పైలట్‌కు స్వల్ప గాయాలయ్యాయని, ఆయనను వాయుసేన సిబ్బంది వెంటనే హెలికాప్టర్‌లో వచ్చి తరలించారని స్థానిక పోలీసులు తెలిపారు. కాగా, 2012లో రెండు వాయుసేన హెలికాప్టర్లు ఢీకొన్న ఘటన కూడా ఇదే ప్రాంతంలో జరగగా, ఆ సంఘటనలో 9 మంది మరణించారు. గత మంగళవారం రాజస్థాన్‌లో ఓ మిగ్-27 విమానం కూలింది.