
అహ్మదాబాద్: నగరంలో ఓ అపార్ట్‌మెంట్‌లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం స్థానికంగా పెద్ద అలజడి రేపింది. అహ్మదాబాద్‌లోని కోక్రా సర్రిల్‌లోని పరిస్కార్ 1 అప్టార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ అపార్ట్‌మెంట్ ఆరో అంతస్తులోని ఒక ఫ్లాట్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్రి ప్రమాదం జరిగి అది తీవ్ర రూపం దాల్చింది. మొత్తం బిల్డింగ్ అంతా దావానంలా వ్యాపించింది.
అయితే దీనిపై సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది హుటాహుటీనా అక్కడకు వచ్చి మంటల్ని అదుపు చేశారు. వారు తీవ్రంగా శ్రమించిన తర్వాత ఎట్టకేలకు మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. వీరితో పాటు పోలీసులు అక్కడకు వచ్చి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.
మంటల్ని అదుపు చేసే క్రమంలో పలువురు బాల్కనీ నుంని కింద ఉంచిన సేప్టీ నెట్‌లోకి దూకేశారు. అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత ఫైర్ సిబ్బంది, పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో ఎటువంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. ప్రధానంగా అపార్ట్‌మెంట్ పై నుంచి మహిళలు, పిల్లలు దూకిన దృశ్యాలు వైరల్‌గా మారాయి.
A major fire has erupted in a building in Ahmedabad’s Khokhra area. Sending strength to those affected and hoping for a timely rescue operation.#FireIncident #ViralVideo #Ahmedabad pic.twitter.com/67NkYOKhJj
— Parimal Nathwani (@mpparimal) April 11, 2025