హైదరాబాద్: పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఓయూసెట్– 2018 ఫలితాలను వీసీ ప్రొఫెసర్ రాంచంద్రం గురువారం విడుదల చేశారు. ఫలితాలను ఓయూ, పీజీ అడ్మిషన్స్ వెబ్‌సైట్లలో అందుబాటు లో ఉంచారు. 70,361 మంది ఓయూసెట్‌కు దరఖాస్తు చేసుకోగా 59,638 మంది ప్రవేశ పరీక్షలకు హాజరయ్యారని, వీరిలో 56,457 (94.67%) మంది అర్హత సాధించినట్లు వీసీ తెలిపారు.
శుక్రవారం(జూలై 7) నుంచి 17 వర కు విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, 9 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ఓయూతోపాటు తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ వర్సిటీల్లోనూ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశా మన్నారు. ఈ నెల 21లోగా కౌన్సెలింగ్ పూర్తి చేసి.. 23 నుంచి తరగతులను, అదేరోజు నుంచి హాస్టల్ ప్రవేశాలనూ ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గోపాల్‌రెడ్డి, పీజీ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ కిషన్, పలు వర్సిటీల రిజిస్ట్రార్లు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment