OU Set
-
ఓయూసెట్ ఫలితాలు విడుదల
హైదరాబాద్: పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఓయూసెట్– 2018 ఫలితాలను వీసీ ప్రొఫెసర్ రాంచంద్రం గురువారం విడుదల చేశారు. ఫలితాలను ఓయూ, పీజీ అడ్మిషన్స్ వెబ్సైట్లలో అందుబాటు లో ఉంచారు. 70,361 మంది ఓయూసెట్‌కు దరఖాస్తు చేసుకోగా 59,638 మంది ప్రవేశ పరీక్షలకు హాజరయ్యారని, వీరిలో 56,457 (94.67%) మంది అర్హత సాధించినట్లు వీసీ తెలిపారు. శుక్రవారం(జూలై 7) నుంచి 17 వర కు విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, 9 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ఓయూతోపాటు తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ వర్సిటీల్లోనూ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశా మన్నారు. ఈ నెల 21లోగా కౌన్సెలింగ్ పూర్తి చేసి.. 23 నుంచి తరగతులను, అదేరోజు నుంచి హాస్టల్ ప్రవేశాలనూ ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గోపాల్‌రెడ్డి, పీజీ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ కిషన్, పలు వర్సిటీల రిజిస్ట్రార్లు తదితరులు పాల్గొన్నారు. -
ఓయూసెట్‌కు 70 వేల దరఖాస్తులు
హైదరాబాద్: ఓయూసెట్–2018కి సంబంధించి 70 వేల దరఖాస్తులు అందినట్లు ఓయూ పీజీ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ కిషన్ తెలిపారు. జూన్ 4 నుంచి ప్రారంభమయ్యే ప్రవేశ పరీక్షల వివరాలను oucet.ouadmissions.com లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. తొలి సారి ప్రవేశపెట్టిన ఆన్లైన్ ప్రవేశపరీక్ష విధానం పై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందు కు వెబ్సైట్లో మాక్ టెస్ట్‌ను అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. రూ.1,000 అపరాధ రుసుము చెల్లించి జూన్ 1లోగా అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించవచ్చన్నారు. అదే రోజు సాయంత్రం నుంచి వెబ్సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. ‘జూన్ 30లోగా ఫీజు చెల్లించండి’ హైదరాబాద్: పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ దూరవిద్యా కోర్సుల్లో 2016–17 సంవత్సరంలో చేరిన విద్యార్థులు జూన్ 30 లోగా పరీక్ష ఫీజు చెల్లించాలని రిజిస్ట్రార్ ఆచార్య అలేఖ్య తెలిపా రు. ఫీజు దరఖాస్తులు ఆన్లైన్, వర్సిటీ ప్రధాన కార్యాలయంలో లభిస్తాయన్నారు. దరఖాస్తుల కు జతగా ఏదైనా జాతీయ బ్యాంకు నుంచి డీడీ సమర్పించాలన్నారు. వివరాలు www.telugu university.ac.in లో చూడవచ్చు. జూన్ 24న అంబేడ్కర్ వర్సిటీ ప్రవేశ పరీక్ష హైదరాబాద్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ ప్రవేశ పరీక్ష–2018 (రెండో విడత) నోటిఫికేషన్ సోమవారం విడుదలైంది. కనీస విద్యార్హత లేని అభ్యర్థులు డిగ్రీ కోర్సులో చేరాలంటే ఈ పరీక్షలో తప్పనిసరిగా అర్హత సాధించాలని వర్సిటీ తెలిపింది. 2018 జూలై 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారు పరీక్షకు అర్హులని పేర్కొంది. వచ్చే నెల 20లోగా నిర్ణీత ఫీజు చెల్లించి ఆన్లైన్లో పేరు నమోదు చేసుకోవాలని సూచించింది. జూన్ 24న తెలంగాణ, ఏపీల్లోని అధ్యయన కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. వివరాలను https://braou.ac.in తోపాటు అధ్యయన కేంద్రాల్లోనూ పొందవచ్చు. 31న ‘చైల్డ్’ పోస్టులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సాక్షి, హైదరాబాద్: స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ఆఫీసర్, అడిషనల్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ఆఫీసర్ పోస్టులకు ఈ నెల 31న నాంపల్లిలోని ఇందిరా ప్రియదర్శిని మహిళా డిగ్రీ కాలేజీలో టీఎస్పీఎస్సీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించనుంది. వివరాలకు www.tspsc.gov.in ను సంప్రదించవచ్చు. -
ఆన్లైన్లో ఓయూ ప్రవేశ పరీక్షలు
హైదరాబాద్: ఓయూ ప్రవేశ పరీక్షలను ఇకపై ఆన్లైన్లో నిర్వహించనున్నట్లు పీజీ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ కిషన్ ఆదివారం తెలిపారు. ఓయూసెట్–2018 ఆన్లైన్ దరఖాస్తులు, కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపుతో పాటు ప్రవేశ పరీక్షలను కూడా ఆన్లైన్లో చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఓయూతో పాటు తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు విశ్వవిద్యాలయాల్లో వివిధ పీజీ కోర్సుల ప్రవేశాలు ఓయూసెట్ ద్వారా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఓయూసెట్‌లో 45 కోర్సులకు ఆన్లైన్ ప్రవేశ పరీక్షలకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఓయూసెట్ ప్రవేశ పరీక్షలు రాసే అభ్యర్థులు కంప్యూటర్ నేర్చుకుని ఉండాలన్నారు. మార్చిలో ఓయూసెట్ నోటిఫికేషన్ విడుదలకానున్నట్లు చెప్పారు. -
వెబ్సైట్లో ఓయూసెట్ ప్రాథమిక కీ
సాక్షి,హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయం పలు పీజీ, పీజీడిప్లొమా, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాం కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఓయూసెట్-2016 ‘ప్రాథమిక కీ’ని బుధవారం వర్సిటీ అధికారుల విడుదల చేశారు. ఈ కీ ని www.ouadmissions.com, www.osmania.ac.in వెబ్సైట్లలో పొందుపరిచారు. విడుదల చేసిన కీ లో ఏమైనా అభ్యంతరాలుంటే వాటిని బలపరిచే మెటీరియల్‌ను జతపరిచి రాతపూర్వకంగా వర్సిటీ అడ్మిషన్స్ డెరైక్టర్‌కు ఈ నెల 17 వతేదీ సాయంత్రం 5 గంటల లోపు అందజేయాలని వర్సిటీ అధికారులు తెలిపారు. ఈనెల 6 నుంచి 14వ తేదీ వరకు ఓయూసెట్ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఎక్కువ ఆప్షన్లు ఇస్తేనే డిగ్రీలో సీటు సాక్షి, హైదరాబాద్: విద్యార్థులు ఎక్కువ ఆప్షన్లు ఇస్తేనే డిగ్రీలో సీటు వస్తుందని కళాశాల విద్యా కమిషనర్ వాణీప్రసాద్ తెలిపారు. 10 కంటే తక్కువ ఆప్షన్లు ఇచ్చిన వారికి సీట్లు రాకపోవచ్చని, ఈనెల 17వ తేదీ వరకు వీలైనన్ని ఎక్కువ ఆప్షన్లు ఇవ్వాలని సూచించారు. కొత్త కోర్సులు, కాలేజీలను వెబ్ కౌన్సెలింగ్‌లో చేర్చినందున, విద్యార్థులు తమ ఆప్షన్లు, వివరాలను అప్డేట్ చేసుకోవాలన్నారు. బుధవారం వరకు 1,65,174 మంది విద్యార్థులు ఫీజు చెల్లించగా, 1,56,419 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారని తెలిపారు. ఆలస్య రుసుంతో 16, 17 తేదీల్లోనూ విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకొని, ఆప్షన్లు ఇచ్చుకోవచ్చన్నారు. కాగా టెట్ ఫలితాల్ని వెంటనే విడుదల చేయాలంటూ 20న విద్యాశాఖ, టెట్ కార్యాలయాలను ముట్టడించనున్నట్లు రాష్ట్ర టెట్, డీఎస్సీ అభ్యర్థులు రామ్మోహన్‌రెడ్డి, రవి, మధుసూదన్ హెచ్చరించారు. -
ఓయూసెట్‌కు ఆధార్ తప్పనిసరి
♦ దరఖాస్తు విధానంలో సమూల మార్పులు ♦ నేటి నుంచి ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ♦ జూన్ మొదటి వారం నుంచి ప్రవేశ పరీక్షలు హైదరాబాద్: ఇకపై ఓయూ సెట్‌కు ఆధార్ నంబర్ తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నామని, ఆన్లైన్ దరఖాస్తులు నేటి నుంచి స్వీకరించనున్నట్లు పీజీ అడ్మిషన్స్ డెరైక్టర్ ప్రొ.గోపాల్‌రెడ్డి తెలిపారు. మంగళవారం క్యాంపస్‌లోని పీజీ అడ్మిషన్స్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డెరైక్టర్ ఓయూసెట్-2016 వివరాలను వెల్లడించారు. www.ouadmissions.com / www.osmania.ac.in అనే వెబ్సైట్ ద్వారా మే నెల 7 వరకు, రూ.500 అపరాధ రుసుముతో 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు అని వివరించారు. ఓయూతో పాటు తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయాలలోని పీజీ, పీజీ డిప్లొమా, ఐదేళ్ల పీజీ కోర్సుల్లో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. స్టాటిస్టిక్స్ కోర్సులో ప్రవేశానికి ఎమ్మెస్సీ మ్యాథ్స్ నుంచి విడిదీసి ప్రత్యేకంగా ప్రవేశ పరీక్షను చేపడుతున్నట్లు చెప్పారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఆన్లైన్ దరఖాస్తులో మార్పులు చేసినట్లు పేర్కొన్నారు. ప్రతి అభ్యర్థి దరఖాస్తు ఫారంలో ఆధార్ నంబర్ తప్పకుండా రాయాలన్నారు. ప్రవేశ పరీక్షలో అక్రమాలు అరికట్టేందుకు బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశ పెట్టినట్లు తెలిపారు. దరఖాస్తులో తాజా ఫొటో మాత్రమే వాడాలి ప్రతి విద్యార్థి తను తాజాగా తీసిన కలర్ పాస్‌ఫొటో మాత్రమే వాడాలన్నారు. ఓయూ సెట్ దరఖాస్తులో వినియోగించే ఫొటోను బహుళ ప్రయోజనాలకు ఉపయోగించనున్నారు. అడ్మిషన్స్ కౌన్సెలింగ్, గుర్తింపు కార్డు, లైబ్రరీ కార్డు, హాస్టల్ ప్రవేశాలు, ఉపకార వేతనాల దరఖాస్తులు, సెమిస్టర్ పరీక్షలకు, డిగ్రీ పట్టా సర్టిఫికెట్ల తదితర అవసరాలకు ఓయూ సెట్లో వాడిన ఫొటోను ఉపయోగించనున్నట్లు గోపాల్‌రెడ్డి చెప్పారు. ఆన్లైన్ దరఖాస్తుతో పాటు కులం, వికలాంగ సర్టిఫికెట్లను స్కాన్‌చేసి పంపించాలన్నారు. అభ్యర్థులు తమ సొంత సెల్‌ఫోన్ నంబర్, సొంత ఈ-మెయిల్ ఐడీని మాత్రమే దరఖాస్తులో వాడాలని సూచించారు. ప్రతి సమాచారాన్ని అభ్యర్థుల సెల్‌ఫోన్‌కు, ఈ-మెయిల్ ఐడీకి పంపించనున్నట్లు చెప్పారు. ఆన్లైన్లో దరఖాస్తు పంపిన తరువాత ప్రింట్‌ను భద్రపరుచుకోవాలన్నారు. ఒక్క దరఖాస్తు రిజిస్ట్రేషన్‌లో నాలుగు సబ్జెక్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు అన్నారు. జూన్ మొదటి వారంలో ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జాయింట్ డెరైక్టర్లు ప్రొ.కిషన్, ప్రొ.సంపత్‌కుమార్, ప్రొ.నిర్మల బాబూరావు తదితరులు పాల్గొన్నారు. -
ఓయూసెట్‌లో 93.98 శాతం ఉత్తీర్ణత
సాక్షి, హైదరాబాద్: పీజీ, పీజీడిప్లొమా, ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఓయూసెట్-2015 ఫలితాలు వెల్లడయ్యాయి. ఉస్మానియా వర్సిటీలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సురేష్ కుమార్ సోమవారం వీటిని విడుదల చేశారు. ఈ నెల 8 నుంచి 16 వరకు నిర్వహించిన ఓయూసెట్‌కు 88,417 మంది హాజరుకాగా.. ఇందులో 83,098 మంది (93.98 శాతం) అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. 52 సజ్టెక్టులకు గాను 44 సబ్జెక్టులకు మాత్రమే పరీక్ష నిర్వహించి ఫలితాలు వెల్లడించారు. కాగా ఎంపీఈడీ కోర్సు ఫలితాలు వెల్లడించాల్సి ఉంది. కన్నడ, పర్షియన్, తమిళ్, మరాఠి తదితర సబ్జెక్టుల్లో ఉన్న సీట్ల కంటే దరఖాస్తులు తక్కువ సంఖ్యలో రావడంతో పరీక్ష నిర్వహించలేదు. ఆ సబ్జెక్టులకు దరఖాస్తు చేసుకున్న అందరికీ నేరుగా అడ్మిషన్లు కల్పించనున్నట్లు అడ్మిషన్స్ డెరైక్టర్ ప్రొఫెసర్ సీహెచ్ గోపాల్ రెడ్డి తెలిపారు. కౌన్సెలింగ్‌లో భాగంగా వచ్చే నెల 8 లేదా 9 నుంచి అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించనున్నట్లు పేర్కొన్నారు. సర్టిఫికెట్ల వెరికేషన్‌కు హాజరయ్యే విద్యార్థులు విద్యార్హత పత్రాలతోపాటు తప్పనిసరిగా ర్యాంకు కార్డు తీసుకెళ్లాలని, లేకుంటే అనుమతించబోమని స్పష్టం చేశారు.