సాక్షి,హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయం పలు పీజీ, పీజీడిప్లొమా, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాం కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఓయూసెట్-2016 ‘ప్రాథమిక కీ’ని బుధవారం వర్సిటీ అధికారుల విడుదల చేశారు. ఈ కీ ని www.ouadmissions.com,
www.osmania.ac.in వెబ్‌సైట్‌లలో పొందుపరిచారు. విడుదల చేసిన కీ లో ఏమైనా అభ్యంతరాలుంటే వాటిని బలపరిచే మెటీరియల్‌ను జతపరిచి రాతపూర్వకంగా వర్సిటీ అడ్మిషన్స్ డెరైక్టర్‌కు ఈ నెల 17 వతేదీ సాయంత్రం 5 గంటల లోపు అందజేయాలని వర్సిటీ అధికారులు తెలిపారు. ఈనెల 6 నుంచి 14వ తేదీ వరకు ఓయూసెట్ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.
ఎక్కువ ఆప్షన్లు ఇస్తేనే డిగ్రీలో సీటు
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులు ఎక్కువ ఆప్షన్లు ఇస్తేనే డిగ్రీలో సీటు వస్తుందని కళాశాల విద్యా కమిషనర్ వాణీప్రసాద్ తెలిపారు. 10 కంటే తక్కువ ఆప్షన్లు ఇచ్చిన వారికి సీట్లు రాకపోవచ్చని, ఈనెల 17వ తేదీ వరకు వీలైనన్ని ఎక్కువ ఆప్షన్లు ఇవ్వాలని సూచించారు. కొత్త కోర్సులు, కాలేజీలను వెబ్ కౌన్సెలింగ్‌లో చేర్చినందున, విద్యార్థులు తమ ఆప్షన్లు, వివరాలను అప్‌డేట్ చేసుకోవాలన్నారు. బుధవారం వరకు 1,65,174 మంది విద్యార్థులు ఫీజు చెల్లించగా, 1,56,419 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారని తెలిపారు. ఆలస్య రుసుంతో 16, 17 తేదీల్లోనూ విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకొని, ఆప్షన్లు ఇచ్చుకోవచ్చన్నారు. కాగా టెట్ ఫలితాల్ని వెంటనే విడుదల చేయాలంటూ 20న విద్యాశాఖ, టెట్ కార్యాలయాలను ముట్టడించనున్నట్లు రాష్ట్ర టెట్, డీఎస్సీ అభ్యర్థులు రామ్మోహన్‌రెడ్డి, రవి, మధుసూదన్ హెచ్చరించారు.