iBOMMA Announce Their Services Shut Down Permanently in India From Sept 9th - Sakshi
Sakshi News home page

iBOMMA: సినీ ప్రియులకు ‘ఐబొమ్మ’ బిగ్‌ షాక్‌.. ఆ రోజు నుంచి శాశ్వతంగా సేవలు బంద్‌

Published Mon, Sep 5 2022 6:19 PM | Last Updated on Tue, Oct 4 2022 7:56 PM

iBOMMA Announce Their Services Shut Down Permanently in India From Sept 9th - Sakshi

ఐబొమ్మ.. సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. ఓటీటీకి వచ్చిన కొత్త సినిమాలను ఎలాంటి ఖర్చు లేకుండా హై క్వాలిటీతో ఫ్రీగా చూసేందుకు వెసులుబాటు కల్పిస్తూ వస్తుంది ఈ వెబ్‌సైట్‌.  తాజాగా బిగ్‌ షాకిచ్చింది ఐబొమ్మ. ఇప్పటికే డౌన్‌లోడ్‌ ఆప్షన్‌ తీసేసిన ఐబొమ్మ తాజాగా శాశ్వతంగా తమ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించి సినీ ప్రేమికులకు షాకిచ్చింది. సెప్టెంబర్‌ 9నుంచి తమ ఇండియాలో తమ సర్వీసులను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు తెలిపింది. అంతేకాదు భవిష్యత్తులో తిరిగి వచ్చే ఆలోచన కూడా లేదని, తమకు ఎవరు మెయిల్స్‌ చేయొద్దని యూజర్స్‌ను కోరింది. ఇంతకాలం తమపై చూపించిన ప్రేమకు అభినందలు చెప్పారు ఐబొమ్మ నిర్వహకులు. 

చదవండి: సినిమా హిట్‌.. కానీ ఆడియన్స్‌ని క్షమాపణలు కోరిన ‘కోబ్రా’ డైరెక్టర్‌

కాగా హై క్వాలిటీ హెచ్‌డీ ప్రింట్‌తో కొత్త సినిమాలను ఫ్రీగా అందుబాటులో ఉంచుతూ ఎంతో సినీ ప్రియులను ఆకట్టుకుంది ఐబొమ్మ. దీంతో ఇండియాలో ఈ వెబ్‌సైట్‌ను ఉపయోగించే యూజర్లు సంఖ్య ఎక్కువే అని చెప్పొచ్చు. ఎంతో యూజర్లను సంపాదించుకు ఐబొమ్మ గతంలో కూడా సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన నిర్వహకులు.. ఆ తర్వాత మళ్లీ తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. కొద్ది రోజుల క్రితం సినిమా డౌన్‌లోడ్‌ ఆప్షన్‌ తీసేసి ఆంక్షలు విధించింది. తాజాగా మరికొద్ది రోజుల్లో పూర్తిగా సేవలను నిలివేస్తున్నట్లు వెల్లడించడంతో యూజర్స్‌ ఒక్కసారిగా కంగుతిన్నారు. ఇది సినీ ప్రియులకు పెద్ద షాక్‌ అనే చెప్పాలి. మరి ఈ నిర్ణయాన్ని ఐబొమ్మ మళ్లీ వెనక్కి తీసుకుంటుందో లేదో చూడాలి. 

చదవండి:జూ.ఎన్టీఆర్‌-కొరటాల చిత్రంలో అలనాటి లేడీ సూపర్‌ స్టార్‌?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement