Services shutdown
-
సినీ ప్రియులకు ‘ఐబొమ్మ’ బిగ్ షాక్.. ఆ రోజు నుంచి శాశ్వతంగా సేవలు బంద్
ఐబొమ్మ.. సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. ఓటీటీకి వచ్చిన కొత్త సినిమాలను ఎలాంటి ఖర్చు లేకుండా హై క్వాలిటీతో ఫ్రీగా చూసేందుకు వెసులుబాటు కల్పిస్తూ వస్తుంది ఈ వెబ్సైట్. తాజాగా బిగ్ షాకిచ్చింది ఐబొమ్మ. ఇప్పటికే డౌన్లోడ్ ఆప్షన్ తీసేసిన ఐబొమ్మ తాజాగా శాశ్వతంగా తమ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించి సినీ ప్రేమికులకు షాకిచ్చింది. సెప్టెంబర్ 9నుంచి తమ ఇండియాలో తమ సర్వీసులను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు తెలిపింది. అంతేకాదు భవిష్యత్తులో తిరిగి వచ్చే ఆలోచన కూడా లేదని, తమకు ఎవరు మెయిల్స్ చేయొద్దని యూజర్స్‌ను కోరింది. ఇంతకాలం తమపై చూపించిన ప్రేమకు అభినందలు చెప్పారు ఐబొమ్మ నిర్వహకులు. చదవండి: సినిమా హిట్.. కానీ ఆడియన్స్‌ని క్షమాపణలు కోరిన ‘కోబ్రా’ డైరెక్టర్ కాగా హై క్వాలిటీ హెచ్డీ ప్రింట్‌తో కొత్త సినిమాలను ఫ్రీగా అందుబాటులో ఉంచుతూ ఎంతో సినీ ప్రియులను ఆకట్టుకుంది ఐబొమ్మ. దీంతో ఇండియాలో ఈ వెబ్‌సైట్‌ను ఉపయోగించే యూజర్లు సంఖ్య ఎక్కువే అని చెప్పొచ్చు. ఎంతో యూజర్లను సంపాదించుకు ఐబొమ్మ గతంలో కూడా సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన నిర్వహకులు.. ఆ తర్వాత మళ్లీ తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. కొద్ది రోజుల క్రితం సినిమా డౌన్లోడ్ ఆప్షన్ తీసేసి ఆంక్షలు విధించింది. తాజాగా మరికొద్ది రోజుల్లో పూర్తిగా సేవలను నిలివేస్తున్నట్లు వెల్లడించడంతో యూజర్స్ ఒక్కసారిగా కంగుతిన్నారు. ఇది సినీ ప్రియులకు పెద్ద షాక్ అనే చెప్పాలి. మరి ఈ నిర్ణయాన్ని ఐబొమ్మ మళ్లీ వెనక్కి తీసుకుంటుందో లేదో చూడాలి. చదవండి:జూ.ఎన్టీఆర్-కొరటాల చిత్రంలో అలనాటి లేడీ సూపర్ స్టార్? -
సేవల అంతరాయంపై స్పందించిన ఫేస్బుక్
సాక్షి, న్యూఢిల్లీ : ఫేస్బుక్, వాట్సాప్, ఇన్‌స్ట్రాగాం సేవలు తిరిగి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. తమ సేవలను వంద శాతం పునరుద్ధరించామని ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజ సంస్థలు ప్రకటించాయి. సేవలకు అంతరాయం కలిగినందుకు యూజర్లకు క్షమపణలు తెలియజేశాయి. నేటి నుంచి యధాతథంగా పూర్తి స్థాయి సేవలు అందుబాటులోకి తెచ్చామని ప్రకటించాయి . ఫేస్బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌ల సేవలకు బుధవారం అంతరాయం ఏర్పడిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఎక్కువగా ఈ సమస్యను ఎదుర్కొన్నారు. వాట్సాప్‌లో చాట్ మెసేజెస్ వరకు వెళ్లాయి కానీ ఆడియో లేదా వీడియో ఫైల్స్‌ను ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అవి డౌన్లోడ్ కాలేదు. ప్రధానంగా దక్షిణ అమెరికా, యూరప్ ఖండాల్లోని ప్రజలు సమస్యను ఎదుర్కొన్నారు. గురువారం నుంచి మళ్లీ వాట్సాప్, ఫేస్బుక్ సేవలు యధాతథంగా అందుబాటులోకి వచ్చాయి. ఈ సమస్యపై ఫేస్బుక్ యాజమాన్యం స్పందింస్తూ.. సమస్యను గుర్తించి పరిష్కరించామని, ఇకపై తమ సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపింది. ‘నిన్న ఫేస్బుక్ సేవలకు అంతరాయం కలిగినందుకు చింతిస్తున్నాం. సర్వర్లలో తలెత్తిన సమస్య కారణంగా ఫేస్బుక్ సరిగ్గా పనిచేయలేదు. రొటీన్‌గా నిర్వహించే మెయిన్టెన్స్ సమయంలో కొందరు యూజర్లకు అప్లోడ్ సమస్య ఎదురైంది. సమస్యను గుర్తించి పరిష్కరించాం. ఇకపై 100 శాతం సేవలు మీకు అందుబాటులో ఉంటాయి. అంతరాయం ఏర్పడినందుకు క్షమపణలు కోరుతున్నాం’ అని ఫేస్బుక్ యాజమాన్యం ఒక ప్రకటనలో పేర్కొంది. -
స్తంభించిన వాట్సాప్, ఫేస్బుక్
న్యూఢిల్లీ : వాట్సాప్‌లో మీడియా ఫైళ్లు డౌన్లోడ్ కావడం లేదంటూ బుధవారం రాత్రి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగాంలు కూడా సరిగ్గా పనిచేయడం లేదని అనేకమంది నెటిజన్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇండియాలో ఈ సమస్య ఏమంత పెద్దగా కనిపించలేదు. ప్రధానంగా దక్షిణ అమెరికా, యూరప్ ఖండాల్లోని ప్రజలు సమస్యను ఎదుర్కొన్నారు. ఫేస్బుక్ సర్వర్లలో తలెత్తిన సమస్య కారణంగానే వాట్సాప్, ఇన్‌స్ట్రాగాంలు కూడా సరిగ్గా పనిచేయలేదని తెలుస్తోంది. అయితే ఈ సమస్యపై మూడింటిలో ఏ సంస్థా అధికారిక ప్రకటన చేయలేదు. ఈ ఏడాది మార్చిలోనూ ఇలాంటి సమస్యే తలెత్తింది. -
సేవలు బంద్
నేటి నుంచి మూడు రోజుల పాటు సబ్‌రిజిస్ట్రార్,రవాణా శాఖల్లో నిలిచిపోనున్న సేవలు రాష్ట్ర విభజన నేపథ్యంలో సర్వర్ల మార్పే కారణం వాహనాల రిజిస్ట్రేషన్ కోడ్ ఏపీ 27 యథాత థం ఒంగోలు టౌన్ రాష్ట్ర విభజన నేపథ్యంలో వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో మూడు రోజుల పాటు సేవలు నిలిచిపోనున్నాయి. రిజిస్ట్రేషన్ శాఖతో పాటు, రవాణా శాఖలో నేటి నుంచి జూన్ 2వ తేదీ వరకు లావాదేవీలు జరగవని ఆయా శాఖల అధికారులు జిల్లా రిజిస్ట్రార్ అబ్రహం, రవాణాశాఖ అధికారి కృష్ణమోహన్ తెలిపారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఒక్కో రాష్ట్రానికి విడివిడిగా కంప్యూటర్లలో సర్వర్లు మార్పు చేస్తుండటం వల్ల ఈ అంతరాయం ఏర్పడిందన్నారు. కంప్యూటర్లకి సంబంధించి ఆన్లైన్లో సాంకేతిక పరమైన ఏర్పాట్లు చేయడానికి ఈ మూడు రోజుల వ్యవధి అధికారులు తీసుకుంటున్నారు. జిల్లాలోని 18 సబ్‌రిజిస్ట్రార్ కార్యాల యాల్లో ఎలాంటి లావాదేవీలు జరగవు. ఈసేవా, మీసేవా కేంద్రాల్లో కూడా ఎలాంటి ఈసీలు, నకళ్లతో పాటు అన్ని రకాల సేవలు అందుబాటులో ఉండవు. జిల్లా రిజిస్ట్రేషన్ సీరియల్ కోడ్ యథాతథం: ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పటికీ జిల్లాకు సంబంధించిన రిజిస్ట్రేషన్ సీరియల్ కోడ్ ఏపీ 27 యథాతథంగా ఉంటుందని జిల్లా రవాణాశాఖ అధికారి కృష్ణమోహన్ తెలిపారు. రాష్ట్రం విడిపోవడంతో ఎనిమిది చెక్‌పోస్టులు అదనంగా వచ్చాయన్నారు. నాగార్జునసాగర్ వద్ద ఒకటి, మాచర్ల వద్ద మరో చెక్‌పోస్టు మనకు దగ్గరలో రానున్నాయన్నారు. మొత్తం మీద కొత్త రాష్ట్రానికి గుంటూరు, పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాలు, కృష్ణా, కర్నూలు, ప్రకాశం జిల్లాలు తెలంగాణ జిల్లాలతో కలిసే చోట చెక్‌పోస్ట్‌లు కొత్తగా ఏర్పాటు చేయనున్నారని ఆయన పేర్కొన్నారు.