breaking news
iBOMMA
-
‘ఐ బొమ్మ’పై ఫైర్ అయిన నిర్మాత
సినిమా పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ( IBomma)పై సినీ నిర్మాత, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశాడు. సోషల్ మీడియాలో ఐబొమ్మ ఇచ్చిన అల్టిమేటం (2023లో చేసిన ఒక X పోస్ట్) గురించి ప్రస్తావిస్తూ – ‘సినీ తారల పారితోషికాలు, డైరెక్టర్స్ ఫీజులు, నిర్మాణ వ్యయాలపై మాట్లాడే హక్కు అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదించే పైరసీదారులకు లేదు. దొంగ పనులు చేసే వారు పరిశ్రమ భవిష్యత్తు గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ నేరంలో పాలు పంచుకున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఐబొమ్మ అనే వెబ్సైట్ ద్వారా తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో దాదాపు 500 చిత్రాలు పైరసీ చేయబడ్డాయి. ఈ నేరంలో పాలుపంచుకున్న వారిని తెలంగాణ పోలీసులు బీహార్, పూణే, తమిళనాడులో అదుపులోకి తీసుకోవడం పట్ల ధన్యవాదాలు తెలుపుతున్నాను. విచారణలో తెలిసిన వివరాలు సినీ రంగానికి షాక్ ఇచ్చాయి.కొన్ని సినిమాలను థియేటర్లలో కామ్‌కార్డర్ ద్వారా రికార్డు చేశారు. అంతేకాకుండా, డిజిటల్ ప్రొవైడర్స్ అయిన యూఎఫ్ఓ(UFO), క్యూబ్(Qube)ల సైట్లను హ్యాక్ చేసి, విడుదలకు ముందే దాదాపు 120 చిత్రాలను నేరుగా డౌన్లోడ్ చేసినట్లు బీహార్‌లోని గోపాలగంజ్కు చెందిన A1 నిందితుడు అశ్విన్ కుమార్ వాంగ్మూలంలో వెల్లడించాడు.నిర్మాతలు తమ సినిమాలను పూర్తి చేసిన తర్వాత కంటెంట్‌ను ఈ డిజిటల్ ప్రొవైడర్స్‌కి అందజేస్తారు. వీరు ఒకే కోడ్‌తో అన్ని థియేటర్లకు ప్రొజెక్షన్ కోసం అప్లోడ్ చేస్తారు. అయితే ఈ సైట్లను హ్యాక్ చేయడం వల్లే పెద్ద నష్టం జరిగింది. సాఫ్ట్వేర్ అప్డేట్స్ సకాలంలో చేయకపోవడం, భద్రతా చర్యలు పాటించకపోవడం వలన ప్రొడ్యూసర్లు నష్టపోయారు.అదే సమయంలో నిర్మాతల వద్ద నుండి పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేస్తున్న ఈ డిజిటల్ ప్రొవైడర్స్ నిర్లక్ష్యం పట్ల వారు సమాధానం ఇవ్వడమే కాకుండా, నష్టపరిహారం కూడా చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. పోలీసుల దగ్గర ఉన్న ఆధారాల ప్రకారం, పైరసీ వల్ల నష్టపోయిన నిర్మాతలకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలి. లేనిపక్షంలో నిర్మాతలు సంఘటితంగా పోరాటానికి సిద్ధమవుతారు అని ఆయన హెచ్చరించారు. -
'ఐబొమ్మ' వార్నింగ్.. స్పందించిన తెలంగాణ ప్రభుత్వం
సినిమా పైరసీ రాకెట్‌ను ఛేదించిన హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులపై చాలామంది ప్రశంసలు కురిపించారు. ఈ మూఠాకు చెందిన ఐదుగురిని అరెస్టు చేసి, వారి వద్ద డెబిట్‌కార్డులు, హార్డ్‌డిస్క్‌లు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ వార్తలు వచ్చిన కొన్ని గంటల్లోనే సినిమా పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ పేరుతో తెలంగాణ పోలీసులకు హెచ్చరికలు అంటూ ఒక పోస్ట్ వైరల్ అయింది. తాజాగా వాటిని తెలంగాణ ప్రభుత్వం ఖండించింది. ఈ అంశంపై వచ్చిన బెదిరింపుల వార్తలు అవాస్తం అంటూ తెలంగాణ ప్రభుత్వ ఫ్యాక్ట్‌చెక్ (Fact Check) టీమ్ చెప్పింది.ఐ బొమ్మ గురించి తెలంగాణ ప్రభుత్వ ఫ్యాక్ట్‌చెక్ పేజీ తమ ‘ఎక్స్’లో ఓ పోస్టు పెట్టింది. 'కొన్ని మీడియా కథనాలు, సోషల్ మీడియా పోస్టుల ప్రకారం, సినిమా పైరసీ సైట్ ఐబొమ్మ (iBomma) తెలంగాణ పోలీసులకు హెచ్చరిక జారీ చేసి, గోప్యమైన ఫోన్ నంబర్లను లీక్ చేస్తామని బెదిరించిందని చెబుతున్నారు. అయితే, ప్రసారం అవుతున్న స్క్రీన్షాట్లు 2023 నాటివి. అవి కూడా పోలీసులకు కాకుండా తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించినవే. దీనిని స్పష్టం చేస్తూ, తెలంగాణ పోలీసులకు ఇలాంటి ఎటువంటి బెదిరింపు రాలేదని తెలియజేస్తున్నాం. ప్రజలు సోషల్ మీడియాలో పోస్టు చేసే, షేర్ చేసే విషయాల్లో జాగ్రత్త వహించాల్సిందిగా మనవి.' అని తెలిపింది.#అలర్ట్: కొన్ని మీడియా కథనాలు మరియు సోషల్ మీడియా పోస్టుల ప్రకారం, సినిమా పైరసీ సైట్ iBomma తెలంగాణ పోలీసులకు హెచ్చరిక జారీ చేసి, గోప్యమైన ఫోన్ నంబర్లను లీక్ చేస్తామని బెదిరించిందని చెబుతున్నారు. అయితే, ప్రసారం అవుతున్న స్క్రీన్షాట్లు 2023 నాటివి మరియు అవి పోలీసులకు కాకుండా… pic.twitter.com/gkcoqYtIqg— FactCheck_Telangana (@FactCheck_TG) October 3, 2025 -
'ఐ' బొమ్మ చూపిస్తాం! TFI, పోలీసులకు స్వీట్ వార్నింగ్..
-
మా జోలికొస్తే పోలీసులకు ఐ‘బొమ్మ’ చూపిస్తాం!
పైరేటెడ్ వెబ్సైట్ ఐ బొమ్మ వ్యవహారం(iBomma) ఇప్పుడు తీవ్రతరం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటివరకు సినీ నిర్మాతలను, హీరోలను బెదిరిస్తూ వచ్చిన ఈ సైట్ నిర్వాహకులు.. ఇప్పుడు ఏకంగా హైదరాబాద్ పోలీసులకే(Hyderabad Police) సవాల్ విసిరారు. తమపై దృష్టి సారిస్తే ప్రతిచర్య తప్పదంటూ ఓ నోట్ విడుదల చేసి మరీ హెచ్చరించడం సంచలనం సృష్టిస్తోంది.ఇటీవల ఐబొమ్మ సహా 65 పైరసీ వెబ్సైట్లపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన పోలీసులు, దర్యాప్తు చేపట్టి ఒక పైరసీ ముఠాను ఛేదించి ఐదుగురిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. ైరసీ కారణంగా కేవలం 2024లోనే తెలుగు చిత్ర పరిశ్రమకు సుమారు ₹3,700 కోట్ల భారీ నష్టం వాటిల్లిందన్నారు. ఐబొమ్మ వంటి సైట్లను ఎంతటి సాంకేతికత వాడినా వదిలిపెట్టేది లేదని, అంతర్జాతీయ సంస్థల సహకారంతో వారిని పట్టుకుంటామని గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో..ఐబొమ్మ పేరిట విడుదలై వైరల్ అవుతున్న నోట్ యధాతథంగా ఇలా ఉంది.. ‘‘ఐ బొమ్మ మీద మీరు ఫోకస్ చేస్తే మేము ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ చేస్తాం. డిస్ట్రిబ్యూటర్స్ కి ప్రింట్స్ అమ్మిన తరువాత మీరు ఎం పట్టనట్టు కెమెరా ప్రింట్స్ తీసిన వాళ్ళ మీద కాకుండా మీ OTT రెవిన్యూ కోసం ఆలోచిస్తూ మా మీద ఫోకస్ పెట్టారు.1) హీరో లకు అంత రెమ్యూనిరేషన్ అవసరమా? అది మీ కొడుకు అయినా ఎవరు అయినా...2) సినిమా ఇండస్ట్రీ లో చాలా మంది వున్నారు. వాళ్ళు ఎం అయిపోతారు అని కబుర్లు చెప్పకండి.. వాళ్ళకి మీరు ఇచ్చేఅమౌంట్ ఏ కూలి పని చేసిన వస్తాయి కానీ మీ హీరోకి హీరోయిన్ కి వస్తాయా.3) సినిమా బడ్జెట్ లో ఎక్కువ శాతం రెమ్యూరురేషన్స్ మరియు విదేశాలలో షూటింగ్ లకు మరియు ట్రిప్స్ కి ఖర్చుపెడుతున్నారు. ప్రొడక్షన్ బాయ్స్ నుంచి లైట్ బాయ్స్ వరకు ఎంత ఖర్చుపెడుతున్నారు ? ఇండియా లో షూటింగ్ చేస్తే బడ్జెట్ తగ్గుతుంది. కదా ? అక్కడ వాళ్ళకి ఉపాధి కలుగుతుంది కదా.4) అనవసర బడ్జెట్ పెట్టి ఆ బడ్జెట్ రికావెర్టీ కి దానిని మా మీద రుద్ది ఎక్కువకి అమ్ముతున్నారు, డిస్ట్రిబ్యూటర్స్ అండ్ థియేటర్ ఓనర్స్ ఆ అమౌంట్ ని కలెక్ట్ చేసుకోవటానికి టికెట్ అమౌంట్ పెంచుతున్నారు. చివరికి మధ్యతరగతివాడే బాధపడుతున్నాడు.మా వెబ్సైటు మీద ఫోకస్ చేయటం ఆపండి లేదంటే నేను మీ మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది.ఫస్ట్ వేరే కెమెరా ప్రింట్స్ రిలీజ్ చేసే వెబ్సైట్లు మీద మీ ద్రుష్టి పెట్టండి. ఇబొమ్మ అన్నది సిగేరేట్ నుంచి e -సిగిరెట్ కు యూజర్స్ ని మళ్లించే ప్రక్రియ. మీ యాక్షన్ కి నా రియాక్షన్ ఉంటుంది.ఈ మిడిల్ లో - వేరే ఏ హీరో కూడా (example: Vijay) టార్గెట్ అవ్వటం ఇష్టం లేదు, మేము స్వతహాగా వెబ్సైటు నుంచి తొలిగిస్తున్నాం, ఇప్పుడు ఇమ్మీడియేట్ డిలీట్ చేస్తే మీకు బయపడి లేదా మీరు తీయించినట్టు వుంటది అందుకే ఈ పోస్ట్ చేసిన కొన్ని గంటల తరువాత తీసివేయాలని అనుకుంటున్నాం..ఇబొమ్మ వాళ్ళు ఇండియా లో తీసివేసిన తరువాత వాళ్ళని రిక్వెస్ట్ చేసి టెక్నాలజీ షేర్ చేయాలని కోరము, దానికి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా షేర్ చేయటం లేదు. మేము ibomma.net వళ్ళంత అంత మంచివాళ్లం కాదు. బురదలో రాయి వేయకండి... అది కూడా పెంట మీద అసలు చేయకండి.మేము ఏ దేశం లో వున్నా భారత దేశం, అందులో తెలుగు వానికోసం ఆలోచిస్తాము.(చావుకు భయపడని వాడు దేనికి భయపడడు - There's nothing more dangerous than a man who has nothing to loose.).సీవీ ఆనంద్ స్థానంలో ఇప్పుడు వీసీ సజ్జనార్(VC Sajjnar) హైదరాబాద్ సీపీగా బాధ్యతలు స్వీకరించారు. వచ్చి రాగానే.. పైరసీ, సైబర్ నేరాలను ఉపేక్షించేంది లేదని హెచ్చరించారు. ఈ తరుణంలో ఏకంగా పోలీసులకే సవాల్ విసురుతున్న నేపథ్యంలో, ఈ వ్యవహారాన్ని ఆయన ఎంత సీరియస్‌గా తీసుకుని ముందుకు వెళ్తారో వేచి చూడాలి. -
టాలీవుడ్‌కు ఐ బొమ్మ వార్నింగ్.. సోషల్ మీడియాలో వైరల్!
టాలీవుడ్ ప్రేక్షకులకు ఐ బొమ్మ గురించి పరిచయం చేయాల్సిన పనిలేదు. ఎందుకంటే ఓటీటీలో రిలీజైన సినిమాలను ఎలాంటి ఖర్చు లేకుండా అభిమానులకు అందుబాటులోకి తీసుకొచ్చే వెబ్సైట్ ఇదే. సినీ ప్రియులకు రూపాయి ఖర్చు లేకుండా వినోదాన్ని అందిస్తోంది. అంతలా ఆదరణ దక్కించుకున్న ఐ బొమ్మపై ఇప్పటివరకు చాలాసార్లు రూమర్స్ వచ్చాయి. గతంలో ఈ వెబ్సైట్ పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. కానీ అలాంటిదేం జరగలేదు. అయితే తాజాగా ఐ బొమ్మకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. (ఇది చదవండి: బాహుబలి తర్వాత అందుకే చేయలేదు: అనుష్క శెట్టి ఆసక్తికర కామెంట్స్!) తాజాగా ఐ బొమ్మ చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. టాలీవుడ్ నిర్మాతలకు వార్నింగ్ ఇస్తూ నోట్ విడుదల చేసింది. మా మీద మీరు ఫోకస్ పెడితే.. మేం ఎక్కడ ఏం చేయాలో అక్కడ చేస్తామంటూ హెచ్చరిక చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికైనా మా వెబ్సైటు మీద ఫోకస్ చేయడం ఆపండి.. లేదంటే మేము మీ మీద ఫోకస్ చేయాల్సింవస్తుందంటూ వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుత ఈ పోస్ట్ టాలీవుడ్లో తీవ్ర దుమారం రేపుతోంది. అయితే దీనిపై ఇప్పటివరకు సినీ ప్రముఖులు ఎవరూ కూడా స్పందించలేదు. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ నోట్ టాలీవుడ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. మరీ ఈ నోట్‌ను నిజంగానే ఆ సంస్థ విడుదల చేసిందా లేక కావాలని ఎవరైనా ఆ పేరుతో ఇలా అసత్యం ప్రచారం చేస్తున్నారా? అన్న అనుమానాలు అభిమానుల్లో వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు ఓ పైరసీ సైట్ ఇలా నిర్మాతలకు వార్నింగ్ ఇవ్వడమేంటని చర్చించుకుంటున్నారు. (ఇది చదవండి: మాజీ భార్యతో జతకట్టిన అమిర్ ఖాన్.. దాదాపు 12 ఏళ్ల తర్వాత!) iBOMMA warning to Telugu Film industry 😲🤯 pic.twitter.com/1utGXhlwPt — 𝙐𝙨𝙩𝙝𝙖𝙖𝙙🔥ᵖˢᵖᵏ𝙘𝙪𝙡𝙩🦅 (@USTHAAD_PK_CULT) September 6, 2023 -
iBOMMAలో సినిమా చూసే వాళ్ళ పై ఆలీ సీరియస్ కామెంట్స్
-
సినీ ప్రియులకు ‘ఐబొమ్మ’ బిగ్ షాక్.. ఆ రోజు నుంచి శాశ్వతంగా సేవలు బంద్
ఐబొమ్మ.. సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. ఓటీటీకి వచ్చిన కొత్త సినిమాలను ఎలాంటి ఖర్చు లేకుండా హై క్వాలిటీతో ఫ్రీగా చూసేందుకు వెసులుబాటు కల్పిస్తూ వస్తుంది ఈ వెబ్సైట్. తాజాగా బిగ్ షాకిచ్చింది ఐబొమ్మ. ఇప్పటికే డౌన్లోడ్ ఆప్షన్ తీసేసిన ఐబొమ్మ తాజాగా శాశ్వతంగా తమ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించి సినీ ప్రేమికులకు షాకిచ్చింది. సెప్టెంబర్ 9నుంచి తమ ఇండియాలో తమ సర్వీసులను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు తెలిపింది. అంతేకాదు భవిష్యత్తులో తిరిగి వచ్చే ఆలోచన కూడా లేదని, తమకు ఎవరు మెయిల్స్ చేయొద్దని యూజర్స్‌ను కోరింది. ఇంతకాలం తమపై చూపించిన ప్రేమకు అభినందలు చెప్పారు ఐబొమ్మ నిర్వహకులు. చదవండి: సినిమా హిట్.. కానీ ఆడియన్స్‌ని క్షమాపణలు కోరిన ‘కోబ్రా’ డైరెక్టర్ కాగా హై క్వాలిటీ హెచ్డీ ప్రింట్‌తో కొత్త సినిమాలను ఫ్రీగా అందుబాటులో ఉంచుతూ ఎంతో సినీ ప్రియులను ఆకట్టుకుంది ఐబొమ్మ. దీంతో ఇండియాలో ఈ వెబ్‌సైట్‌ను ఉపయోగించే యూజర్లు సంఖ్య ఎక్కువే అని చెప్పొచ్చు. ఎంతో యూజర్లను సంపాదించుకు ఐబొమ్మ గతంలో కూడా సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన నిర్వహకులు.. ఆ తర్వాత మళ్లీ తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. కొద్ది రోజుల క్రితం సినిమా డౌన్లోడ్ ఆప్షన్ తీసేసి ఆంక్షలు విధించింది. తాజాగా మరికొద్ది రోజుల్లో పూర్తిగా సేవలను నిలివేస్తున్నట్లు వెల్లడించడంతో యూజర్స్ ఒక్కసారిగా కంగుతిన్నారు. ఇది సినీ ప్రియులకు పెద్ద షాక్ అనే చెప్పాలి. మరి ఈ నిర్ణయాన్ని ఐబొమ్మ మళ్లీ వెనక్కి తీసుకుంటుందో లేదో చూడాలి. చదవండి:జూ.ఎన్టీఆర్-కొరటాల చిత్రంలో అలనాటి లేడీ సూపర్ స్టార్?