హైదరాబాద్: ఓయూసెట్–2018కి సంబంధించి 70 వేల దరఖాస్తులు అందినట్లు ఓయూ పీజీ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ కిషన్ తెలిపారు. జూన్ 4 నుంచి ప్రారంభమయ్యే ప్రవేశ పరీక్షల వివరాలను oucet.ouadmissions.com లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.
తొలి సారి ప్రవేశపెట్టిన ఆన్‌లైన్ ప్రవేశపరీక్ష విధానం పై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందు కు వెబ్‌సైట్‌లో మాక్ టెస్ట్‌ను అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. రూ.1,000 అపరాధ రుసుము చెల్లించి జూన్ 1లోగా అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించవచ్చన్నారు. అదే రోజు సాయంత్రం నుంచి వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు.
‘జూన్ 30లోగా ఫీజు చెల్లించండి’
హైదరాబాద్: పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ దూరవిద్యా కోర్సుల్లో 2016–17 సంవత్సరంలో చేరిన విద్యార్థులు జూన్ 30 లోగా పరీక్ష ఫీజు చెల్లించాలని రిజిస్ట్రార్ ఆచార్య అలేఖ్య తెలిపా రు. ఫీజు దరఖాస్తులు ఆన్‌లైన్, వర్సిటీ ప్రధాన కార్యాలయంలో లభిస్తాయన్నారు. దరఖాస్తుల కు జతగా ఏదైనా జాతీయ బ్యాంకు నుంచి డీడీ సమర్పించాలన్నారు. వివరాలు www.telugu university.ac.in లో చూడవచ్చు.
జూన్ 24న అంబేడ్కర్ వర్సిటీ ప్రవేశ పరీక్ష
హైదరాబాద్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ ప్రవేశ పరీక్ష–2018 (రెండో విడత) నోటిఫికేషన్ సోమవారం విడుదలైంది. కనీస విద్యార్హత లేని అభ్యర్థులు డిగ్రీ కోర్సులో చేరాలంటే ఈ పరీక్షలో తప్పనిసరిగా అర్హత సాధించాలని వర్సిటీ తెలిపింది. 2018 జూలై 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారు పరీక్షకు అర్హులని పేర్కొంది. వచ్చే నెల 20లోగా నిర్ణీత ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌లో పేరు నమోదు చేసుకోవాలని సూచించింది. జూన్ 24న తెలంగాణ, ఏపీల్లోని అధ్యయన కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. వివరాలను https://braou.ac.in తోపాటు అధ్యయన కేంద్రాల్లోనూ పొందవచ్చు.
31న ‘చైల్డ్’ పోస్టులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు ఆఫీసర్, అడిషనల్ చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు ఆఫీసర్ పోస్టులకు ఈ నెల 31న నాంపల్లిలోని ఇందిరా ప్రియదర్శిని మహిళా డిగ్రీ కాలేజీలో టీఎస్‌పీఎస్సీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించనుంది. వివరాలకు www.tspsc.gov.in ను సంప్రదించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment