
హైదరాబాద్: ఓయూ ప్రవేశ పరీక్షలను ఇకపై ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నట్లు పీజీ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ కిషన్ ఆదివారం తెలిపారు. ఓయూసెట్–2018 ఆన్‌లైన్ దరఖాస్తులు, కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపుతో పాటు ప్రవేశ పరీక్షలను కూడా ఆన్‌లైన్‌లో చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు.
ఓయూతో పాటు తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు విశ్వవిద్యాలయాల్లో వివిధ పీజీ కోర్సుల ప్రవేశాలు ఓయూసెట్ ద్వారా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఓయూసెట్‌లో 45 కోర్సులకు ఆన్‌లైన్ ప్రవేశ పరీక్షలకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఓయూసెట్ ప్రవేశ పరీక్షలు రాసే అభ్యర్థులు కంప్యూటర్ నేర్చుకుని ఉండాలన్నారు. మార్చిలో ఓయూసెట్ నోటిఫికేషన్ విడుదలకానున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment