తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్‌ పర్యటన | CM YS Jagan Visit Flood Effected Areas In AP Live Updates | Sakshi
Sakshi News home page

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్‌ పర్యటన

Published Fri, Dec 8 2023 7:26 AM | Last Updated on Fri, Dec 8 2023 4:00 PM

CM YS Jagan Visit Flood Effected Areas In AP Live Updates - Sakshi

Updates..

3:44 PM, Dec 8, 2023
తుపాను వల్ల నష్టపోయిన వారిని అన్ని విధాల ఆదుకుంటాం: సీఎం జగన్‌

  • ఏ ఒక్కరికీ నష్టం జరగకుండా చూసుకుంటాం
  • బాధితులను గుర్తించి పారదర్శకంగా సాయం అందిస్తాం
  • రేషన్‌తో పాటు రూ.25,00 ప్రతి ఇంటికి అందిస్తున్నాం
  • గత టీడీపీ ప్రభుత్వంలో కరువు వచ్చినా, వరద వచ్చినా పట్టించుకోలేదు
  • సంక్రాంతిలోపు ఇన్‌ఫుట్‌ సబ్సిడీ అందిస్తాం
  • రైతు భరోసాతో పాటు కరీఫ్‌ ఇన్సూరెన్స్‌ డబ్బులు ఇస్తున్నాం
  • అపోహలను ప్రచారం చేస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి చదవకండి
  • ఈటీవీ, ఏబీఎన్‌, టీవీ5 ఛానళ్ల ప్రసారాలను చూడకండి
  • ఎల్లో మీడియా అసత్య కథనాలతో ప్రజలను తప్పుతోవ పట్టిస్తున్నారు

బాపట్ల జిల్లా మరుప్రోలువారిపాలెంలో పర్యటించిన సీఎం జగన్‌

  • తుపాను వల్ల దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించిన సీఎం
  • తుపాను బాధితులు, రైతులతో సీఎం జగన్‌ సంభాషణ
  • బాపట్ల జిల్లా పాతనందాయపాలెంలో సీఎం జగన్‌ పర్యటన

2:51 PM, Dec 8, 2023

  • మరుప్రోలువారి పాలెంలో దెబ్బతిన్న పంటల ఫోటో ఎగ్జిబిషన్‌ను  పరిశీలించిన సీఎం జగన్‌

2:45PM, Dec 8, 2023

  • బాపట్ల జిల్లా మరుప్రోలు వారి పాలెంలో సీఎం జగన్‌ పర్యటన
  • కర్లపాలెం మండలం పాతనందాయ పాలెం, బుద్ధాం గ్రామాల్లో సీఎం జగన్‌ పర్యటన
  • తుపాను వల్ల దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడనున్న సీఎం జగన్‌

12:00PM, Dec 8, 2023

బాలిరెడ్డిపాలెం(తిరుపతి జిల్లా): 

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సందర్భంగా బాధితులతో సీఎం వైఎస్‌ జగన్ ముఖాముఖి.. 

  • ఈ ప్రాంతంలో కురిసిన వర్షాలు, జిల్లాలో మొత్తం యావరేజ్‌తో పోల్చుకుంటే కూడా అందులో సగం ఈ నాలుగైదు రోజుల్లోనే కురిశాయి.
  • దాదాపు 40-60 సెంటీమీటర్ల వర్షం వచ్చిన పరిస్థితులు. 
  • మనందరికీ జరిగిన నష్టం, వచ్చిన కష్టం ఎవరైనా చెప్పడానికి కూడా సాధ్యపడనంత బాధ కలిగించే అంశాలే. 
  • దాదాపు ఈ ప్రాంతంలో 92 రిలీఫ్ క్యాంపులను పెట్టాం. 8,364 మందిని రిలీఫ్ క్యాంపులకు షిప్ట్ చేయడం జరిగింది. 
  • దాదాపు 60 వేల మందికి పైచిలుకు, వారికి రేషన్ బియ్యం 25 కేజీలు, కందిపప్పు, పామాయిల్ లీటరు, కేజీ ఆనియన్లు, బంగాళాదుంపలు.. ఇవన్నీ ఇవ్వడం జరిగింది. 
  • ఏ రాష్ట్రంలో లేని వ్యవస్థ మన రాష్ట్రంలో ఒకటి ఉంది. అది వాలంటీర్ వ్యవస్థ, సచివాలయం వ్యవస్థ. 
  • ఈ వ్యవస్థ వల్ల ఎవరికి ఎక్కడ ఏ నష్టం జరిగినా ఎవరూ కంగారు పడాల్సిన పని లేదు. 
  • అన్ని రకాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని ప్రతి ఒక్కరికీ భరోసా ఇస్తూ చెబుతున్నా.
  • ఏ ఒక్కరికీ నష్టం జరగదు. నాకు నష్టం జరిగినా ఎదుటివాడికి వచ్చింది, నాకు రాలేదని అనుకోవాల్సిన పని లేదు. 
  • ప్రతి ఒక్కరికీ మంచి జరిగించే కార్యక్రమం జరుగుతుంది. 
  • డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
  • 62 వేల కుటుంబాలకు రేషన్ డిస్ట్రిబ్యూషన్ కిట్లు పంపిణీ చేస్తున్నాం. ప్రతి ఇంటికీ రూ.2,500 డబ్బులు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. 
  • దాని వల్ల మీ ఇళ్లలో నీళ్లు వచ్చిన వారికి, సామాన్లకు నష్టం జరిగిన వారికి, ఇబ్బందులు పడిన పరిస్థితుల్లో ఈ డబ్బుతో కాస్తో కూస్తో ఉపశమనం కలుగుతుంది. 
  • ఈరోజు మొదలు పెడితే మరో నాలుగు రోజుల్లో ప్రతి ఇంటికీ వాలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బంది వచ్చి ప్రతి ఇంట్లోనూ రూ.2,500 డబ్బులిచ్చే కార్యక్రమాలు చేసుకుంటూ పోతారు. 
  • పంట నష్టపోయిన పరిస్థితుల్లో ఏ ఒక్కరు ఉన్నా భయపడాల్సిన, బాధపడాల్సిన అవసరం లేదు. 
  • ఈ జిల్లాల్లో స్టాండింగ్ క్రాప్ లేదు కాబట్టి కాస్తో కూస్తో ఉపశమనం.
  • ఎవరెవరు పంట వేశారో, నష్టపోయారో 80 శాతం సబ్సిడీతో సీడ్ ఇచ్చే కార్యక్రమం చేస్తాం. 
  • నాలుగైదు రోజుల్లో అన్నీ దగ్గరుండి కలెక్టర్లు పూర్తి చేశారు. 
  • ఈరోజు నుంచి వారం పట్టొచ్చు. ప్రతి ఒక్కరికీ జరగాల్సినమంచి జరుగుతుంది.
  • కరెంటు చాలా ఫాస్ట్‌గా రీస్టోర్ చేశారు. యంత్రాంగం అంతా ఇక్కడే పని చేస్తున్నారు. రెట్టించిన వేగంతో పని చేస్తున్నారు. టీమ్స్ ను మొబిలైజ్ చేస్తున్నారు. చాలా ప్రాంతాల్లో కరెంటు రీస్టోర్ అయ్యింది.

  • కొన్ని కాలనీల్లో రీస్టోర్ కాని పరిస్థితి ఉంటే అవన్నీ డీటెయిల్స్ తీసుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
  • కలెక్టర్లు వాలంటీర్ల ద్వారా రీస్టోర్ అయ్యిందా అనే డీటెయిల్స్ తీసుకొని ప్రతి ఒక్కరికీ ఆ సమస్య లేకుండా చేస్తారు. 
  • అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం మీకు తోడుగా ఉంటుందని మరోసారి మీకు తెలియజేస్తున్నా. 
  • ఇక్కడికి రాకముందు స్వర్ణముఖిలో జరిగిన బ్రీచ్ కారణంగా ఎలాంటి నష్టం జరిగిందో చూశాను. 
  • దానికి పర్మినెంట్ సొల్యూషన్ వెతకాలని చెప్పాను.
  • హైలెవల్ బ్రిడ్జి కడితే బాగుంటుందని చెప్పారు. దాని కోసం రూ.30 కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. 
  • హైలెవల్ బ్రిడ్జిని శాంక్షన్ చేస్తున్నా
  • జిల్లాలో 110 ట్యాంకులు ఉంటే కొన్ని చోట్ల బ్రీట్చ్ అయ్యాయి. 
  • రోడ్లు రిపేర్ చేసే కార్యక్రమాలు, టెంపరరీ పనులన్నీ మొదలు పెట్టి పునరుద్ధరణకు శ్రీకారం చుడతాం.
  • రోడ్లు, ఆర్‌డబ్ల్యూఎస్, ఆర్‌అండ్‌బీ రోడ్లు, చిన్న చిన్న ట్యాంకుల రిపేరీ కోసం రూ.32 కోట్ల ప్రపోజల్స్ వచ్చాయి. 
  • యుద్ధ ప్రాతిపదికన మొదలు పెట్టించే కార్యక్రమాలు జరుగుతాయి. 
  • ఈ ప్రభుత్వం మీది అన్నది గుర్తు పెట్టుకోండి. ఈ ప్రభుత్వంలో ఏ ఒక్కరికైనా మంచే జరుగుతుంది తప్ప.. చెడు అనేది ఎప్పుడూ జరగదు. 
  • ఏ చిన్న సమస్య అయినా, వాళ్లకు రావాల్సింది రాని పరిస్థితి ఎక్కడైనా ఎవరికైనా ఉందంటే జగనన్నకు చెబుదాం 1902కు ఫోన్ కొట్టండి.. నా ఆఫీస్‌కే ఫోన్ వస్తుంది. 
  • అందరికీ అందించే కార్యక్రమం కలెక్టర్ బాధ్యతలు తీసుకుంటారు. ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది. 
  • నాలుగైదు రోజుల్లో అన్నీ పూర్తి చేసి కలెక్టర్ దగ్గర నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటా. 
  • మీ అందరికీ మంచి జరగాలని మనసారా కోరుకుంటూ మిగిలిన ప్రాంతాలకు వెళ్లే కార్యక్రమం చేస్తాను.

  • ఫోటో ఎగ్జిబిషన్‌ను సందర్బించిన సీఎం జగన్‌

►తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్‌ పర్యటన. 

►తిరుపతి జిల్లా వాకాడు మండలం విద్యానగర్‌ చేరుకున్న సీఎం జగన్‌

►తిరుపతి, బాపట్ల జిల్లాల్లో ముఖ్యమంత్రి జగన్‌ క్షేత్రస్థాయి పర్యటన

►బాధితులు, రైతులను కలిసి వారితో మాట్లాడనున్న సీఎం జగన్‌

►స్వర్ణముఖి నదికట్ట తెగి నష్టపోయిన ప్రాంతాల్లో పరిశీలన

► తిరుపతి, బాపట్ల జిల్లాల పర్యటనకు బయలుదేరిన సీఎం వైఎస్ జగన్

►ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నేడు (శుక్రవారం) తిరుపతి, బాపట్ల జిల్లాల్లో పర్యటించనున్నారు. మిఛాంగ్‌ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటించనున్నారు. తొలుత తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డి పాలెం వెళ్లనున్న సీఎం జగన్‌. అక్కడ స్వర్ణముఖి నది కట్ట తెగి నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించనున్నారు.

► అనంతరం బాపట్ల జిల్లా మరుప్రోలువారిపాలెం వెళ్లి  బాధితులతో మాట్లాడనున్నారు.

► తర్వాత కర్లపాలెం మండలం పాతనందాయపాలెం చేరుకుని బాధిత రైతును పరామర్శించనున్నారు. తర్వాత బుద్దాంలో దెబ్బతిన్న వరి పంటను పరిశీలించి రైతులతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమావేశం కానున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement