సాక్షి, తిరుపతి: ముఖ్యమంత్రి అంటే ఆయన చుట్టూ అధికారులు, భారీ ఎత్తున బందోబస్తు ఉంటుంది. సీఎం ఎప్పుడైనా, ఎక్కడైనా పర్యటనకు వస్తే.. ముందు అనుమతి తీసుకున్నవారు మాత్రమే ఆయనను కలుస్తారు. సామాన్యులు కనీసం సీఎం దరిదాపులకు కూడా వెళ్లలేరు. అయితే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విషయంలో ఇవన్ని తారుమారవుతాయి. ఆయనకు అధికారం, హోదా కన్నా ప్రజలు, వారి సంక్షేమం ముఖ్యం. అందుకే వారితో అంతా బాగా కలిసి పోతారు. సీఎం జగన్ ఉదార హృదయాన్ని చాటే సంఘటన ఒకటి తిరుపతిలో చోటు చేసుకుంది. ఆ వివరాలు..
చిత్తూరు వరద ముంపు ప్రభావిత ప్రాంతాల్లో రెండవ రోజు పర్యటనలో భాగంగా తిరుపతి కార్పొరేషన్ పరిధిలోని సరస్వతి నగర్‌లో పర్యటిస్తున్నారు సీఎం జగన్. ఆ సమయంలో అక్కడకు ఓ యువతి వచ్చింది. ఆమె పేరు వైష్ణవి. నేరుగా సీఎం జగన్ దగ్గరకు వెళ్లి.. ‘‘అన్నా.. అమ్మ నిన్ను అమ్మ చూడాలని అంటోంది’’ అని చెప్పింది.
‘అన్నా’ అన్న పిలుపుకు కరిగిపోయిన సీఎం జగన్ వైష్ణవి ఆహ్వానం మేరకు ఆమె ఇంటికి వెళ్లి.. అనారోగ్యంతో ఉన్న ఆమె తల్లిని పరామర్శించారు. ఇంతకు వైష్ణవి తల్లికి ఏమైంది అంటే.. సరిగ్గా ఐదు రోజులు క్రితం మహిళ యునివర్సటీ వద్ద రోడ్డు ప్రమాదంలో విజయలక్ష్మి అనే మహిళ తీవ్రంగా గాయపడింది. ఆమె కుమార్తెనే వైష్ణవి.
వైష్ణవి ఆహ్వానం మేరకు విజయలక్ష్మి ఇంటికి వెళ్ళి ఆమెను పరామర్శించారు సీఎం జగన్. తిరుపతి స్విమ్స్‌లో హెడ్ నర్స్‌గా చేస్తున్న విజయలక్ష్మి ప్రమాదంలో గాయ పడటంతో కదలలేని స్థితిలో ఉన్నారు. ఈ క్రమంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారన్న విషయం తెలుసుకుని కూతురు వైష్ణవి ద్వారా ‘‘అమ్మా.. సీఎం జగన్ అన్నను చూడాలని ఉంది.. నా మాటగా చెప్పు తల్లి’’ అని కూతుర్ని ప్రాధేయ పడింది. తల్లి ఆశను సీఎం దృష్టికి తీసుకువెళ్ళింది వైష్ణవి.
‘అన్నా.. అమ్మ నిన్ను చూడాలని అంటుంది’ అని చెప్పడంతో సీఎం జగన్.. వారి ఇంటికి వెళ్లి విజయలక్ష్మిని పరామర్శించారు. ప్రమాదం ఎలా జరిగిందో అడిగి తెలుసుకున్నారు. సీఎం సహాయనిధి నుంచి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
చదవండి:
మహిళ ఆవేదన..చలించిపోయిన సీఎం జగన్
దేవుడిలా ఆదుకున్నావన్నా..
Comments
Please login to add a commentAdd a comment