వాలంటీర్ల ద్వారా రూ.2500 సాయం : సీఎం జగన్‌ | CM YS Jagan Visit Flood Effect Area At Tirupati | Sakshi
Sakshi News home page

వాలంటీర్ల ద్వారా రూ.2500 సాయం : సీఎం జగన్‌

Published Fri, Dec 8 2023 12:38 PM | Last Updated on Fri, Dec 8 2023 2:15 PM

CM YS Jagan Visit Flood Effect Area At Tirupati - Sakshi

సాక్షి, తిరుపతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తిరుపతి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్‌ పర్యటించి రైతులతో మాట్లాడారు. వాకాడు మండలంలోని స్వర్ణముఖి నదికట్ట తెగి నష్టపోయిన ప్రాంతాలను సీఎం జగన్‌ పరిశీలించారు.  ఈ క్రమంలో నష్టపోయిన ప్రతీ రైతును ఆదుకుంటామని ముఖ్యమంత్రి జగన్‌ హామీ ఇచ్చారు. 

కాగా, సీఎం జగన్‌ ఈ సందర్బంగా మాట్లాడుతూ.. ‘ఈ నాలుగైదు రోజుల్లో భారీ వర్షం కురిసింది. మనకు వచ్చిన కష్టం.. మనకు వచ్చిన నష్టం వర్ణణాతీతమే. వరుసగా వర్షాలు పడటంతో రైతులు నష్టపోయారు. సాయం కోసం 92 రిలీఫ్‌ కేంద్రాలను పెట్టడం జరిగింది. 60 వేల మంది బాధితులకు 25 కేజీల రేషన్‌ బియ్యంతో పాటు నిత్యావసరాలను పంపిణీ చేయడం జరిగింది. ప్రతీ ఇంటికి రూ. 2,500 ఇచ్చాము. ఏ ఒక్కరికీ నష్టం జరగనివ్వం.

ఏ రాష్ట్రంలో లేని విధంగా వాలంటీర్‌ వ్యవస్థ మన దగ్గరే ఉంది. ప్రతీ ఇంటికి వాలంటీర్‌ వచ్చి రూ. 2,500 ఇస్తారు. పంట నష్టంపై కూడా ఏ ఒక్కరూ బాధపడనవసరం లేదు. స్వర్ణముఖిపై హైలెవల్‌ బ్రిడ్జి నిర్మాణం చేపడతాం. వారంలో అందరికీ సాయం చేస్తాను. నష్టపోయిన ప్రతీ రైతును ఆందుకుంటాం. ఏ ఒక్కరికీ నష్టం జరగనివ్వం. నష్టపోయిన రైతులకు 80 శాతం సబ్సిడీతో విత్తనాలు అందిస్తాం. రోడ్లను పునరుద్ధరించే కార్యక్రమాలు చేపడతాం. తుపాను బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటాం’ అని అన్నారు. 

సీఎం జగన్‌ కామెంట్స్‌..

  • ఈ ప్రాంతంలో కురిసిన వర్షాలు, జిల్లాలో మొత్తం యావరేజ్‌తో పోల్చుకుంటే కూడా అందులో సగం ఈ నాలుగైదు రోజుల్లోనే కురిశాయి.
  • దాదాపు 40-60 సెంటీమీటర్ల వర్షం వచ్చిన పరిస్థితులు.
  • మనందరికీ జరిగిన నష్టం, వచ్చిన కష్టం ఎవరైనా చెప్పడానికి కూడా సాధ్యపడనంత బాధ కలిగించే అంశాలే.
  • దాదాపు ఈ ప్రాంతంలో 92 రిలీఫ్ క్యాంపులను పెట్టాం. 8,364 మందిని రిలీఫ్ క్యాంపులకు షిప్ట్ చేయడం జరిగింది.
  • దాదాపు 60 వేల మందికి పైచిలుకు, వారికి రేషన్ బియ్యం 25 కేజీలు, కందిపప్పు, పామాయిల్ లీటరు, కేజీ ఆనియన్లు, బంగాళాదుంపలు.. ఇవన్నీ ఇవ్వడం జరిగింది.
  • ఏ రాష్ట్రంలో లేని వ్యవస్థ మన రాష్ట్రంలో ఒకటి ఉంది. అది వాలంటీర్ వ్యవస్థ, సచివాలయం వ్యవస్థ.
  • ఈ వ్యవస్థ వల్ల ఎవరికి ఎక్కడ ఏ నష్టం జరిగినా ఎవరూ కంగారు పడాల్సిన పని లేదు.
  • అన్ని రకాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని ప్రతి ఒక్కరికీ భరోసా ఇస్తూ చెబుతున్నా.
  • ఏ ఒక్కరికీ నష్టం జరగదు. నాకు నష్టం జరిగినా ఎదుటివాడికి వచ్చింది, నాకు రాలేదని అనుకోవాల్సిన పని లేదు.
  • ప్రతి ఒక్కరికీ మంచి జరిగించే కార్యక్రమం జరుగుతుంది.
  • డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
  • 62 వేల కుటుంబాలకు రేషన్ డిస్ట్రిబ్యూషన్ కిట్లు పంపిణీ చేస్తున్నాం. ప్రతి ఇంటికీ రూ.2,500 డబ్బులు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది.
  • దాని వల్ల మీ ఇళ్లలో నీళ్లు వచ్చిన వారికి, సామాన్లకు నష్టం జరిగిన వారికి, ఇబ్బందులు పడిన పరిస్థితుల్లో ఈ డబ్బుతో కాస్తో కూస్తో ఉపశమనం కలుగుతుంది.
  • ఈరోజు మొదలు పెడితే మరో నాలుగు రోజుల్లో ప్రతి ఇంటికీ వాలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బంది వచ్చి ప్రతి ఇంట్లోనూ రూ.2,500 డబ్బులిచ్చే కార్యక్రమాలు చేసుకుంటూ పోతారు. 
  • పంట నష్టపోయిన పరిస్థితుల్లో ఏ ఒక్కరు ఉన్నా భయపడాల్సిన, బాధపడాల్సిన అవసరం లేదు.
  • ఈ జిల్లాల్లో స్టాండింగ్ క్రాప్ లేదు కాబట్టి కాస్తో కూస్తో ఉపశమనం.
  • ఎవరెవరు పంట వేశారో, నష్టపోయారో 80 శాతం సబ్సిడీతో సీడ్ ఇచ్చే కార్యక్రమం చేస్తాం.
  • నాలుగైదు రోజుల్లో అన్నీ దగ్గరుండి కలెక్టర్లు పూర్తి చేశారు.
  • ఈరోజు నుంచి వారం పట్టొచ్చు. ప్రతి ఒక్కరికీ జరగాల్సినమంచి జరుగుతుంది.
  • కరెంటు చాలా ఫాస్ట్‌గా రీస్టోర్ చేశారు. యంత్రాంగం అంతా ఇక్కడే పని చేస్తున్నారు.
    రెట్టించిన వేగంతో పని చేస్తున్నారు. టీమ్స్ ను మొబిలైజ్ చేస్తున్నారు. చాలా ప్రాంతాల్లో కరెంటు రీస్టోర్ అయ్యింది.
  • కొన్ని కాలనీల్లో రీస్టోర్ కాని పరిస్థితి ఉంటే అవన్నీ డీటెయిల్స్ తీసుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
  • కలెక్టర్లు వాలంటీర్ల ద్వారా రీస్టోర్ అయ్యిందా అనే డీటెయిల్స్ తీసుకొని ప్రతి ఒక్కరికీ ఆ సమస్య లేకుండా చేస్తారు.
  • అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం మీకు తోడుగా ఉంటుందని మరోసారి మీకు తెలియజేస్తున్నా.
  • ఇక్కడికి రాకముందు స్వర్ణముఖిలో జరిగిన బ్రీచ్ కారణంగా ఎలాంటి నష్టం జరిగిందో చూశాను.
  • దానికి పర్మినెంట్ సొల్యూషన్ వెతకాలని చెప్పాను.
  • హైలెవల్ బ్రిడ్జి కడితే బాగుంటుందని చెప్పారు. దాని కోసం రూ.30 కోట్లు ఖర్చవుతుందని చెప్పారు.
  • హైలెవల్ బ్రిడ్జిని శాంక్షన్ చేస్తున్నా.
  • జిల్లాలో 110 ట్యాంకులు ఉంటే కొన్ని చోట్ల బ్రీట్చ్ అయ్యాయి.
  • రోడ్లు రిపేర్ చేసే కార్యక్రమాలు, టెంపరరీ పనులన్నీ మొదలు పెట్టి పునరుద్ధరణకు శ్రీకారం చుడతాం.
  • రోడ్లు, ఆర్‌డబ్ల్యూఎస్, ఆర్‌అండ్‌బీ రోడ్లు, చిన్న చిన్న ట్యాంకుల రిపేరీ కోసం రూ.32 కోట్ల ప్రపోజల్స్ వచ్చాయి.
  • యుద్ధ ప్రాతిపదికన మొదలు పెట్టించే కార్యక్రమాలు జరుగుతాయి.
  • ఈ ప్రభుత్వం మీది అన్నది గుర్తు పెట్టుకోండి. ఈ ప్రభుత్వంలో ఏ ఒక్కరికైనా మంచే జరుగుతుంది తప్ప.. చెడు అనేది ఎప్పుడూ జరగదు.
  • ఏ చిన్న సమస్య అయినా, వాళ్లకు రావాల్సింది రాని పరిస్థితి ఎక్కడైనా ఎవరికైనా ఉందంటే జగనన్నకు చెబుదాం 1902కు ఫోన్ కొట్టండి.. నా ఆఫీస్‌కే ఫోన్ వస్తుంది.
  • అందరికీ అందించే కార్యక్రమం కలెక్టర్ బాధ్యతలు తీసుకుంటారు. ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది.
  • నాలుగైదు రోజుల్లో అన్నీ పూర్తి చేసి కలెక్టర్ దగ్గర నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటా.
  • మీ అందరికీ మంచి జరగాలని మనసారా కోరుకుంటూ మిగిలిన ప్రాంతాలకు వెళ్లే కార్యక్రమం చేస్తాను.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement