హైదరాబాద్, పరిసర ప్రాంతాలు, ఉమ్మడి జిల్లా కేంద్రాలకే సీనియర్లంతా ఆప్షన్లు ఇవ్వడం వల్ల.. ఆయాచోట్ల పుట్టినవారు, విద్యాభ్యాసం, తల్లిదండ్రుల నివాసం వంటి స్థానికత ఉన్న జూనియర్లు ఇతర జిల్లాలకు వెళ్లాల్సి వస్తుంది. భవిష్యత్తులో తమ సొంత ప్రాంతానికి స్థానికేతరులుగా మారిపోయే అవకాశం ఉంటుందని జూనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఒక్క సీనియారిటీ ప్రాతిపదికనే ఆప్షన్లు స్వీకరిస్తే.. హైదరాబాద్ చుట్టుపక్కల, ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో అంతా సీనియర్లే ఉంటారని.. జూనియర్లు ఇతర జిల్లాలకు పరిమితమయ్యే అవకాశాలు ఎక్కువని ఉద్యోగులు స్పష్టం చేస్తున్నారు. దీనితో సీనియర్లు, జూనియర్ల సమతూకం దెబ్బతింటుందని పేర్కొంటున్నారు. ఇక జూనియర్లకు సర్వీసు ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. చాలాకాలం ఉద్యోగాల్లో ఉంటారని, ఆయా జిల్లాల్లో ఏళ్లకేళ్లపాటు ఉద్యోగ నియామకాలకు వీల్లేకుండా పోతుందని చెప్తున్నారు.
ఉపాధ్యాయ సంఘాలతో నేడు సబిత భేటీ
ఉద్యోగుల విభజనపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం మధ్యాహ్నం ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం కానున్నారు. ఈ భేటీలో అధికారులు కూడా పాల్గొంటారని, అన్ని అంశాలపైనా చర్చించే అవకాశం ఉందని మంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి.
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల మధ్య ఉద్యోగుల విభజనలో ‘సీనియారిటీ’అంశం విమర్శలకు దారితీస్తోంది. దీనిపై జూనియర్ ఉద్యోగులు, ఉపాధ్యాయుల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది. కేవలం సీనియారిటీనే ప్రాతిపదికగా తీసుకుంటే.. జూనియర్లకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, స్థానికతపైనే దెబ్బపడుతుందని అభిప్రాయం వినిపిస్తోంది. సీనియర్లంతా కీలక ప్రాంతాలను ఎంపిక చేసుకుంటే.. జూనియర్లు తమ ప్రాంతాలను వదిలి ఇతరచోట్ల వెళ్లాల్సి వస్తుందని ఉద్యోగులు, ఉపాధ్యాయులు చెప్తున్నారు. హెచ్‌ఆర్‌ఏ, పలు ఇతర అంశాల్లోనూ నష్టం జరుగుతుందని అంటున్నారు. అందువల్ల సీనియారిటీతోపాటు కొత్త జిల్లాల ప్రకారం స్థానికతనూ పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నారు.
ఉద్యోగులు లేవనెత్తుతున్న అంశాలివీ..
సీనియారిటీ ప్రాతిపదికగా ఉద్యోగుల విభజన చేపట్టడం వల్ల జూనియర్లు కోరుకున్న చోట పోస్టులు దక్కే అవకాశాలు అతి తక్కువ. చాలామంది వారి స్థానికేతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని ఉద్యోగులు వాపోతున్నారు. అదే సీనియారిటీ ఉన్నవారు తమకు స్థానికంకాకున్నా.. సౌకర్యంగా ఉండే, నచ్చిన ప్రాంతానికి వెళ్లేందుకు వీలుంటుందని అంటున్నారు. చాలామంది స్థానికేతరులు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పనిచేసేందుకు ఆప్షన్లు ఇస్తున్నారు. ఉదాహరణకు రాజధానికి సమీపంలోని రంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే 48శాతం నాన్‌లోకల్ ఉద్యోగులున్నారు. నిబంధనల ప్రకారం 20 శాతానికి మించి ఉండకూడదు. ఇప్పుడు కూడా ఇక్కడి స్థానికత లేని సీనియర్లు ఈ ప్రాంతాన్ని ఎంచుకునే అవకాశాలు ఎక్కువ.
► గ్రేటర్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇంటి అద్దె భత్యం (హెచ్‌ఆర్‌ఏ) ఎక్కువగా ఇస్తారు. మేడ్చల్ జిల్లాలో 80 శాతం ఎక్కువగా ఉండగా.. చుట్టుపక్కల జిల్లాల్లో తక్కువగా ఉంటుంది. దీనితో హెచ్‌ఆర్‌ఏ ఎక్కువగా ఉన్న ప్రాంతాలనే సీనియర్లు ఎంచుకుంటారు. దీనితో జూనియర్లు నష్టపోతారని ఉద్యోగులు వాపోతున్నారు.
► సాధారణంగానే సీనియర్లకు వేతనాలు ఎక్కువ. ఆ వేతనాల మీద ఎక్కువ హెచ్‌ఆర్‌ఏ ఇవ్వడం అంటే.. ప్రభుత్వంపై ఆర్థిక భారం కూడా పెరుగుతుందని కొందరు ఉద్యోగులు/ఉపాధ్యాయులు చెప్తున్నారు. ఆ జిల్లాల్లో జూనియర్లు అయిన స్థానికులకు కూడా అవకాశమిస్తే భారం కొంత తగ్గుతుందని అంటున్నారు.
► ఇక వేర్వేరు ప్రాంతాల్లో పనిచేస్తున్న భార్యాభర్తలు సీనియర్లు అయితే.. ఒక ప్రాంతానికి వెళ్లే వీలుంటుంది. కానీ జూనియర్లకు ఆ అవకాశం కష్టం. భార్యాభర్తలు వేర్వేరు జిల్లాలకు వెళ్లి పనిచేయాల్సి వస్తుంది.
ఆ జిల్లాల్లో జూనియర్లకు నష్టం
►ప్రస్తుత విభజన విధానంపై జూనియర్ ఉద్యోగుల్లో, అందులోనూ ఉపాధ్యాయుల్లో ఆందోళన ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పుడు జరిగే ఈ నష్టం చాలా ఏళ్లపాటు కొనసాగుతుందని వారు చెప్తున్నారు.
► ఉదాహరణకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాను ఐదు కొత్త జిల్లాలుగా విభజించారు. దాంతోపాటు కొన్ని మండలాలు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోనూ కలిశాయి. ఈ లెక్కన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా సీనియర్ ఉద్యోగి/ ఉపాధ్యాయులు ఏడు కొత్త జిల్లాలకు ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. ఈ లెక్కన సీనియర్లలో చాలా మంది రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలకు ప్రాధాన్యతనిస్తారు. అలా సీనియర్లతోనే ఈ రెండు జిల్లాల్లోని పోస్టులు నిండిపోతే.. అక్కడి స్థానికులు అయినా కూడా జూనియర్లు నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లాలకు వెళ్లాల్సి వస్తుంది. ఇప్పుడు చేస్తున్నవి శాశ్వత కేటాయింపులు కావడంతో.. సదరు ఉద్యోగి/ఉపాధ్యాయులు తన సొంత జిల్లాకు స్థానికేతరులుగా మారిపోతారు.
►పిల్లల చదువులు, వైద్య అవకాశాలు, ఎక్కువగా అందే ఇంటిఅద్దె భత్యం (హెచ్‌ఆర్‌ఏ)ను దృష్టిలో పెట్టుకుని.. సీనియర్లంతా ఉమ్మడి జిల్లాల కేంద్రాలకు ఆప్షన్ ఇచ్చే అవకాశముంది. అంటే.. ఉమ్మడి రంగారెడ్డి ఉద్యోగులు మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాలకు.. ఉమ్మడి నల్లగొండ ఉద్యోగులు యాదాద్రి భువనగిరి, నల్లగొండలకు.. ఉమ్మడి వరంగల్ ఉద్యోగులు హనుమకొండ, జనగామ, వరంగల్‌లకు.. ఉమ్మడి మెదక్ ఉద్యోగులు సంగారెడ్డి, సిద్దిపేటలకు.. ఉమ్మడి నిజామాబాద్ ఉద్యోగులు నిజామాబాద్‌కు.. ఉమ్మడి కరీంనగర్ ఉద్యోగులు కరీంనగర్, పెద్దపల్లిలకు.. ఉమ్మడి ఆదిలాబాద్ ఉద్యోగులు మంచిర్యాలకు ఎక్కువగా ఆప్షన్లు ఇస్తారు. సీనియర్లకే మొదట ఈ జిల్లాల్లో పోస్టులు కేటాయిస్తే.. అక్కడి స్థానికత ఉన్న జూనియర్లు నష్టపోయే అవకాశం ఉంటుంది.
‘స్థానికత’తోనూ తిప్పలు..
ఒక్క స్థానికతనే ప్రామాణికంగా తీసుకున్నా కూడా కొన్ని సమస్యలు తప్పవని ఉద్యోగులు స్పష్టం చేస్తున్నారు. చదువు, నివాసాన్ని స్థానికతకు ఆధారంగా తీసుకుంటే.. ప్రస్తుతం వేర్వేరు ప్రాంతాల్లో పనిచేస్తున్న సదరు జిల్లాల ఉద్యోగులంతా ఒక్కచోటికి చేరుతారు. దీనితో కొన్ని జిల్లాల్లో ఉద్యోగుల సంఖ్య ఎక్కువై, పోస్టులు తక్కువగా ఉండే అవకాశం ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. చాలా వరకు ఉద్యోగులు ఉమ్మడి జిల్లా దాటి వెళ్లాల్సిన పరిస్థితి లేదని సీనియర్ ఉద్యోగులు అంటున్నారు. అలాంటప్పుడు స్థానికతకు ప్రాధాన్యం ఏముందని వరంగల్‌కు చెందిన ఓ సీనియర్ ఉపాధ్యాయుడు అభిప్రాయపడ్డారు.
ఈ హడావుడితో జూనియర్లకు అన్యాయం
ఉద్యోగుల విభజనకు సీనియారిటీ ప్రాతిపదిక అనేదే లోపభూయిష్టంగా ఉంది. దీనిపై ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి ఉండాల్సింది. స్థానికత, ఖాళీల దామాషానూ పరిగణనలోకి తీసుకుని కొత్త జిల్లాలకు ఉపాధ్యాయులను కేటాయించాలి. టీచర్లకు ఫైనల్ సీనియార్టీ లిస్టును తయారుచేయాలి. ముసాయిదా రూపొందించి ఉపాధ్యాయుల నుంచి అభ్యంతరాలు స్వీకరించాలి. ఆ తర్వాత తుది జాబితా ప్రకటించి విభజన చేపట్టాలి. హడావుడిగా ఆప్షన్లు ఇచ్చి కేటాయింపులు చేస్తే జూనియర్ టీచర్లకు అన్యాయం జరుగుతుంది. - చావ రవి, టీఎస్‌యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి
స్థానికతకు ప్రాధాన్యమివ్వాలి
మొదట స్థానికతకు ప్రాధాన్యమివ్వాలి. ఖాళీలు లేనప్పుడు ప్రత్యామ్నాయంగా సీనియారిటీ చూడాలి. అంతే తప్ప సీనియారిటీకే ప్రాధాన్యమివ్వడం, స్థానికతను పక్కనబెట్టడం ఆందోళన రేపుతోంది. దీనివల్ల జూనియర్లకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. సీనియారిటీ దెబ్బతినకుండా స్థానికత ఆధారంగా విభజన ప్రక్రియ ఉండాలి. - జి.సదానందంగౌడ్, ఎస్టీయూటీఎస్ అధ్యక్షుడు
ఉపాధ్యాయ సంఘాలతో నేడు సబిత భేటీ
ఉద్యోగుల విభజనపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం మధ్యాహ్నం ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం కానున్నారు. ఈ భేటీలో అధికారులు కూడా పాల్గొంటారని, అన్ని అంశాలపైనా చర్చించే అవకాశం ఉందని మంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment