హైదరాబాద్: రాష్ట్రంలో ఆరుగురు పార్లమెంటరీ సెక్రటరీలను నియమిస్తూ కేసీఆర్ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. పార్లమెంట్ సెక్రటరీలుగా వి. సతీష్ కుమార్ (విద్యాశాఖ), జీ కిషోర్ కుమార్ (వైద్యశాఖ), శ్రీనివాస్గౌడ్ (రెవెన్యూ శాఖ), కోవా లక్ష్మీ (వ్యవసాయ శాఖ), జలగం వెంకట్రావ్, వినయ్ భాస్కర్లకు సీఎం కార్యాలయ శాఖలు కేటాయించినట్లు ఉత్తర్వుల్లో తెలిపింది. వీరంతా ఆయా శాఖల మంత్రులకు అనుబంధంగా పని చేస్తారని ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలలో పేర్కొంది.