సాక్షి, అమరావతి: శాసన మండలి రద్దుపై ఫిర్యాదు చేసేందుకు టీడీపీ ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు తలపెట్టిన ఢిల్లీ పర్యటన రద్దయినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ముందుగా అనుకున్న ప్రకారం ఎమ్మెల్సీలు మంగళవారం ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులను కలిసి మండలి రద్దుపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా, ఇతర కేంద్ర మంత్రుల అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నించారు. అయితే, వారికి ఢిల్లీలో ఎవరి అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని సమాచారం. ఈ కారణంగా పర్యటనను రద్దు చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ నెల 19వ తేదీ నుంచి చేపట్టాలనుకున్న ప్రజాచైతన్య యాత్రలపైనా తర్జనభర్జన పడుతున్నారు. తమ పార్టీకి చెందిన వారిపై ఐటీ దాడులు జరగటం, రూ.రెండు వేల కోట్ల అక్రమ లావాదేవీలు జరిగినట్లు వెల్లడికావడంతో ఆందోళనలో ఉన్న టీడీపీ నేతలు యాత్ర నిర్వహించాలా వద్దా అనే దానిపై ఒక నిర్ణయానికి రాలేకపోతున్నట్లు తెలిసింది. ఒకవేళ యాత్ర చేసినా నియోజకవర్గాల్లో తూతూమంత్రంగా చేయాలని సూచించినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment