టీ పీసీసీ అధికార ప్రతినిధిగా జగ్గారెడ్డి | Jagga Reddyas official representative of TPCC | Sakshi
Sakshi News home page

టీ పీసీసీ అధికార ప్రతినిధిగా జగ్గారెడ్డి

Published Wed, Jul 6 2016 2:55 AM | Last Updated on Mon, Sep 4 2017 4:11 AM

టీ పీసీసీ అధికార ప్రతినిధిగా జగ్గారెడ్డి

టీ పీసీసీ అధికార ప్రతినిధిగా జగ్గారెడ్డి

సంగారెడ్డి మున్సిపాలిటీ: మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. సంగారెడ్డి పట్టణానికి చెందిన జగ్గారెడ్డి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్‌గా బాధ్యతలు నిర్వహించారు. మున్సిపల్ కౌన్సిలర్‌గా రాజకీయ అరంగ్రేటం చేసి అంచెలంచెలుగా ఎదిగారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సైతం కాంగ్రెస్ పార్టీకి అనుగుణంగా పనిచేశారు.

ఇటీవల పార్టీ చేపడుతున్న కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడమే కాకుండా పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారు.  ఈ నేపథ్యంలో జగ్గారెడ్డిని రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ తన పై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తూ పార్టీ బలోపేతం కోసం పనిచేయడమే కాకుండా టీఆర్‌ఎస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతామని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement