Toyota Kirloskar Motor Appointed Manasi Tata As Vice Chairperson, Details Inside - Sakshi
Sakshi News home page

Who Is Manasi Tata:టయోటా కిర్లోస్కర్ వైస్ చైర్‌పర్సన్‌గా మానసి టాటా.. ఎవరీ మానసి?

Published Thu, Jan 19 2023 6:11 PM | Last Updated on Thu, Jan 19 2023 7:09 PM

Toyota Kirloskar Motor appointed Manasi Tata as Vice Chairperson - Sakshi

సాక్షి,ముంబై: టయోటా కిర్లోస్కర్ మోటార్ వైస్ చైర్‌పర్సన్‌గా విక్రమ్ కిర్లోస్కర్ కుమార్తె మానసి టాటా నియమితు లయ్యారు. ఆమె తండ్రి విక్రమ్ కిర్లోస్కర్ అకాలమరణం తరువాత, కంపెనీ JV కంపెనీల బోర్డులో డైరెక్టర్‌ అయిన మానసి టాటాను టయోటా కిర్లోస్కర్ ఆటో విడిభాగాల (TKAP) వైస్ చైర్‌పర్సన్‌గా నియమించింది. తక్షణమే వైస్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నట్లు టయోటా కిర్లోస్కర్ మోటార్ గురువారం ప్రకటించింది. 

మానసి టాటా ఇప్పటికే టయోటా కిర్లోస్కర్ మోటార్‌లో డైరెక్టర్ల బోర్డులో సభ్యురాలిగా ఉన్నారు. అలాగే  కంపెనీ కార్పొరేట్ నిర్ణయాలు ,వ్యూహాత్మక కార్యకలాపాలలో కీలకంగా ఉన్నారని కంపెనీ ఒకప్రకటనలో  తెలిపింది. ఇంక్లూజివ్ థినింగ్ , పీపుల్ సెంట్రిక్ ఔట్‌లుక్"ని తీసుకొచ్చి, భారతీయ ఆటో పరిశ్రమపై ఆమెకున్న పదునైన అవగాహనతో పాటు, 'అందరికీ మాస్ హ్యాపీనెస్' అందించడంలో కంపెనీ నిబద్ధతను ఆమె నియామకం మరింత బలోపేతం చేస్తుందని  టొయోటా కిర్లోస్కర్ మోటార్  సీఎండీ  మసకాజు యోషిమురా  అన్నారు"

మానసి టాటా అమెరికాలోని  రోడ్ ఐలాండ్ స్కూల్ ఆఫ్ డిజైన్ నుండి గ్రాడ్యుయేట్  అయ్యారు. కేరింగ్ విత్ కలర్ అనే ఎన్జీవో   ద్వారా కర్ణాటకలోని మూడు జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలలపై పనిచేస్తున్నారు ఆమె 2019లో  నోయెల్ టాటా  (రతన్ టాటా సవతి సోదరుడు)కుమారుడు నెవిల్లే టాటాను వివాహం చేసుకున్నారు. కిర్లోస్కర్ సామ్రాజ్యం ఐదోతరం ప్రతినిధిగా తండ్రి వారసత్వాన్ని నిలబెట్టాలని  బిజినెస్‌ వర్గాలు భావిస్తున్నాయి. 

కాగా మానసి తండ్రి విక్రమ్ కిర్లోస్కర్ గతేడాది నవంబర్‌లో గుండెపోటుతో కన్నుమూశారు. డిసెంబరులో, కిర్లోస్కర్ సిస్టమ్స్ కంపెనీ యొక్క JV కంపెనీలైన టయోటా ఇండస్ట్రీస్ ఇంజిన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, కిర్లోస్కర్ టయోటా టెక్స్‌టైల్ మెషినరీ ప్రైవేట్ లిమిటెడ్ (KTTM), టయోటా మెటీరియల్ హ్యాండ్లింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (TMHIN), DNKI బోర్డులో మానసి టాటాను డైరెక్టర్‌గా నియమించింది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement