Manasi
-
70వ జాతీయ చలన చిత్ర పురస్కారాల ప్రకటన భావోద్వేగానికి పట్టం
70వ జాతీయ అవార్డులకు గాను దేశవ్యాప్తంగా 28 భాషలకు చెందిన 300 చిత్రాల వరకూ పోటీ పడ్డాయి. 2022 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 లోపు సెన్సార్ అయిన చిత్రాలకు పోటీలో అవకాశం ఉంటుంది. అవార్డుల కోసం వివిధ విభాగాలకు సంబంధించిన నామినేషన్లను 11 మందితో కూడిన జ్యూరీ పరిశీలించి విజేతలను వెల్లడించింది. ఈసారి భావోద్వేగానికి పట్టం కట్టినట్లుగా తెలుస్తోంది. ప్రధాన అవార్డులను పరిశీలిస్తే... ఎమోషనల్‌గా సాగే కథాంశాలకు, భావోద్వేగమైన నటనకు అవార్డులు దక్కినట్లుగా అనిపిస్తోంది. ఆ వివరాలు...ద్వాపర యుగంలోని శ్రీకృష్ణుడి కడియం కలియుగంలో అంతు చిక్కని సమ్యలకు ఎలా పరిష్కారం చూపించింది? అనే అంశంతో రూపొందిన డివోషనల్, ఎమోషనల్ తెలుగు మూవీ ‘కార్తికేయ 2’ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నిలిచింది. రిషబ్ శెట్టి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘కాంతార’. ఈ చిత్రంలో కనబర్చిన పవర్ఫుల్, ఎమోషనల్ నటనకుగాను రిషబ్ శెట్టి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు సాధించగా, సంపూర్ణ వినోదాన్ని అందించి, ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగానూ అవార్డు దక్కించుకుంది. ప్రేమ, ప్రేమలో విఫలం, కుటుంబ బంధాల నేపథ్యంలో మిత్రన్ జవహర్ దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘తిరుచిత్రాంబళమ్’లో కనబరిచిన గాఢమైన భావోద్వేగ నటనకు గాను నిత్యామీనన్‌ను జాతీయ ఉత్తమ నటి అవార్డు వరించింది.భర్త అక్రమ సంబంధం సాగిస్తున్నాడని తెలుసుకున్నాక ఓ భార్య ఏం చేసింది? అనే కథాంశంతో రూపొందిన గుజరాతీ చిత్రం ‘కచ్ ఎక్స్‌ప్రెస్’లో భార్య పాత్రలో కనబర్చిన భావోద్వేగానికి గాను ఉత్తమ నటిగా మానసీ పరేఖ్ అవార్డు అందుకోనున్నారు. ఓ నాటక రంగానికి సంబంధించిన ట్రూప్ నేపథ్యంలో ఆనంద్ ఇకర్షి దర్శకత్వంలో రూపొందిన మలయాళ చిత్రం ‘ఆట్టమ్’కి ఉత్తమ చిత్రం, స్క్రీన్‌ప్లే విభాగాల్లో రెండు అవార్డులు దక్కాయి. చనిపోయిన ఓ స్నేహితుడి చివరి కోరికను నెరవేర్చడానికి ముగ్గురు వృద్ధ స్నేహితులు ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కి ట్రెక్కి వెళ్లే కథాంశంతో తెరకెక్కిన హిందీ చిత్రం ‘ఊంచాయి’. ఈ ఎమోషనల్ రైడ్‌ని అద్భుతంగా ఆవిష్కరించిన సూరజ్ బర్జాత్యా జాతీయ ఉత్తమ దర్శకుడి అవార్డు సాధించారు. ఉత్తమ సంగీత దర్శకత్వం (పాటలు) అవార్డును హిందీ ‘బ్రహ్మాస్త్ర – పార్ట్ 1: శివ’కి సంగీత దర్శకుడు ప్రీతమ్, ఉత్తమ నేపథ్య సంగీతం అవార్డును తమిళ ‘΄పొన్నియిన్ సెల్వన్ పార్ట్–1’కు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ దక్కించు కున్నారు.ఇక గత ఏడాది పది అవార్డులు దక్కించుకున్న తెలుగు పరిశ్రమ ఈసారి ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డుతో సరిపెట్టుకుంది. ఇంకా పలు విభాగాల్లో అవార్డులను ప్రకటించారు.జాతీయ అవార్డులోని కొన్ని విభాగాలు.... ⇒ఉత్తమ నటుడు: రిషబ్ శెట్టి (కాంతార – కన్నడ) ⇒నటీమణులు: నిత్యా మీనన్ (తిరుచిత్రాంబళమ్ – తమిళ్), మానసీ పరేఖ్ (కచ్ ఎక్స్‌ప్రెస్ – గుజరాతీ) ⇒చిత్రం: ఆట్టమ్ (మలయాళం)⇒దర్శకుడు: సూరజ్ బర్జాత్యా (ఊంచాయి – హిందీ) ⇒దర్శకుడు (డెబ్యూ): ప్రమోద్ కుమార్ (ఫౌజా –హరియాన్వీ) సంగీత దర్శకత్వం (పాటలు): ప్రీతమ్ (బ్రహ్మాస్త్ర: శివ– హిందీ)⇒సంగీత దర్శకత్వం (నేపథ్య సంగీతం): ఏఆర్ రెహమాన్ (΄పొన్నియిన్ సెల్వన్ – 1, తమిళ్) నేపథ్య గాయకుడు: అర్జిత్ సింగ్ (బ్రహ్మాస్త్ర– పార్ట్ 1: శివ – హిందీ) ⇒నేపథ్య గాయని: బాంబే జయశ్రీ (సౌదీ వెల్లక్క సీసీ 225/2009 – మలయాళం) ⇒సహాయ నటి: నీనా గు΄్తా (ఊంచాయి– హిందీ) ⇒సహాయ నటుడు: పవర్ రాజ్ మల్హోత్రా (ఫౌజా – హరియాన్వి) ⇒బాల నటుడు: శ్రీపత్ (మాలికాపురమ్ – మలయాళం) ⇒సినిమాటోగ్రఫీ: రవి వర్మన్ (΄పొన్నియిన్ సెల్వన్ పార్ట్ – 1) ⇒కొరియోగ్రఫీ: జానీ మాస్టర్, సతీష్ కృష్ణన్ (తిరుచిత్రాంబళమ్ – తమిళ్) ⇒యాక్షన్ డైరెక్షన్: అన్బు–అరివు (కేజీఎఫ్ 2 – కన్నడ) ⇒విజువల్ ఎఫెక్ట్స్: బ్రహ్మాస్త్ర – పార్ట్ 1: శివ (హిందీ) ⇒మాటల రచయిత : అర్పితా ముఖర్జీ, రాహుల్ వి. చిట్టెల (గుల్మోహర్ – హిందీ) ⇒సౌండ్ డిజైన్: ఆనంద్ కృష్ణమూర్తి – ΄పొన్నియిన్ సెల్వన్ – 1 (తమిళం) ⇒స్క్రీన్‌ప్లే (ఒరిజినల్): ఆనంద్ ఏకార్షి (ఆట్టమ్ – మలయాళం) ⇒జాతీయ, సామాజిక, పర్యావరణ విలువలను ్రపోత్సహించే చిత్రం: కచ్ ఎక్స్‌ప్రెస్ (గుజరాతీ) ⇒సంపూర్ణ వినోదాన్ని అందించి, ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం: కాంతార (కన్నడ).ప్రాంతీయ ఉత్తమ చిత్రాలు⇒తెలుగు: కార్తికేయ–2 ⇒కన్నడ: కేజీఎఫ్ చాప్టర్–2 ⇒తమిళ్: ΄పొన్నియిన్ సెల్వన్ – 1 ⇒మలయాళం: సౌది వెళ్లక్క సీసీ 225/2009 ⇒హిందీ: గుల్మోహర్అవార్డు బాధ్యత పెంచింది – చందు మొండేటి‘‘మా సినిమాకి జాతీయ అవార్డు రావడం మా బాధ్యతని మరింత పెంచింది. ‘కార్తికేయ 2’ తర్వాత ‘కార్తికేయ 3’పై అంచనాలు ఎంతలా పెరిగాయో తెలుసు. ఆ అంచనాలకు తగ్గట్టుగా ‘కార్తికేయ 3’ ఉంటుంది’’ అని డైరెక్టర్ చందు మొండేటి అన్నారు. నిఖిల్ సిద్ధార్థ్, అనుపమా పరమేశ్వరన్ జోడీగా చందు మొండేటి దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన చిత్రం ‘కార్తికేయ 2’. ప్రాంతీయ విభాగంలో ఉత్తమ చిత్రం అవార్డును సాధించిన సందర్భంగా చిత్రబృందం సమావేశం నిర్వహించింది. టీజీ విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘ఈ నేషనల్ అవార్డు మా పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఓ మైల్స్టోన్ మూమెంట్. మా బ్యానర్‌కి తొలి జాతీయ అవార్డు ఇది’’ అన్నారు. ‘‘కృష్ణుడు నిజం అని ఈరోజు మరోసారి ప్రూవ్ అయ్యింది. ఈ అవార్డు కృష్ణుడే తీసుకొచ్చారని భావిస్తున్నాను’’ అని అభిషేక్ అగర్వాల్ చె΄్పారు.నిఖిల్ మాట్లాడుతూ – ‘‘కార్తికేయ 2’ విజయం సాధించడానికి, అవార్డు రావడానికి కారణం మా టీమ్. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ అందరూ చూసిన సినిమా ఇది. దేశవ్యాప్తంగా చాలా భాషల్లో రిలీజై, అద్భుతమైన విజయం సాధించింది. మా సినిమాని ఆదరించిన ప్రేక్షకులకు, అవార్డు ప్రకటించిన జ్యూరీకి థ్యాంక్స్’’ అన్నారు.కార్తికేయ కథేమిటంటే... ద్వాపర యుగంలో తనువు చాలించే ముందు శ్రీకృష్ణుడు తన కాలి కడియాన్ని ఉద్ధవునికి ఇచ్చి, ‘కలియుగంలో వచ్చే ఎన్నో అంతు చిక్కని సమస్యలకు ఈ కడియం పరిష్కారం చూపుతుంది’ అని చెబుతాడు. కలియుగంలో నాస్తికుడైన డాక్టర్ కార్తికేయ (నిఖిల్) తన తల్లి ఒత్తిడి మేరకు ఓ మొక్కు తీర్చుకోవడానికి ద్వారక నగరానికి వెళతాడు. అప్పటికే కడియానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించినప్రోఫెసర్ రంగనాథ రావ్‌ను హతమార్చడానికి ట్రై చేస్తుంటాడు సైంటిస్ట్ శాంతను. అతని మనుషుల చేతిలో హతమవ్వడానికి ముందు రంగనాథ రావ్ అనుకోకుండా కార్తికేయను చివరిసారి కలుస్తాడు. దాంతో శాంతను మనుషులతో పాటు శ్రీకృష్ణ భక్తులైన అధీరుల తెగకు చెందిన వ్యక్తులకు సైతం కార్తికేయ టార్గెట్ అవుతాడు. అయితే రంగనాథ రావ్ మనవరాలు ముగ్ధ (అనుపమ) సాయంతో వారందరి నుంచి డాక్టర్ కార్తికేయ ఎలా తప్పించుకున్నాడు? చంద్రశిల శిఖరంలోని శ్రీకృష్ణుడి కడియాన్ని ఎలా సొంతం చేసుకున్నాడు? అన్నదే కథ.ఆనంద్ ఇకర్షి దర్శకత్వం వహించిన ‘ఆట్టమ్’ కథేంటంటే.. ఓ నాటక బృందంలో 12 మంది నటులు, ఒక నటీమణి ఉంటారు. నటులుగా వినయ్ పాత్రలో వినయ్ ఫోర్ట్, అంజలిగా జరీన్ షిబాబ్, కళాభవన్ షాజాన్ హరి కీలక పాత్రలు పోషించారు. వీళ్ల నాటక ప్రదర్శన ఓ విదేశీ జంటకి నచ్చడంతో తమ రిసార్ట్‌లో వాళ్లకి ఆతిథ్యమిస్తారు. పార్టీ అనంతరం ఎవరి గదుల్లోకి వాళ్లు వెళ్లి నిద్రపోతారు. అయితే తన గదిలో కిటికీ పక్కన నిద్రపోతున్న అంజలితో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తిస్తాడు. ఆ వ్యక్తి నాటక బృందంలోని 12 మందిలో ఒకరా? లేకుంటే బయటి వ్యక్తా? అనే విషయాన్ని అంజలి ఎలా బయటపెట్టింది? అన్నది ‘ఆట్టమ్’ కథ. హాలీవుడ్ మూవీ ‘12 యాంగ్రీమెన్’ (1954) ఆధారంగా ‘ఆట్టమ్’ రూపొందింది.కెరాడి టు పాన్ ఇండియాకర్ణాటకలోని కెరాడి అనే గ్రామంలో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు రిషబ్ శెట్టి. చిత్ర పరిశ్రమలోకి రాకముందు పలు ఉద్యోగాలు చేశారు రిషబ్. డిగ్రీ చదివేటప్పుడు సినిమాలు చూసేందుకు డబ్బుల కోసం కూలి పనులు చేశారు. 2004 నుంచి 2014 వరకు (తొలి సారి డైరెక్షన్ చేసేవరకు) వాటర్ క్యా¯Œ లు అమ్మారు. రియల్ ఎస్టేట్ సంస్థలో, హోటల్స్‌లో పని చేశారు. క్లాప్ బాయ్‌గా ఇండస్ట్రీలో జర్నీ ్రపారంభించిన రిషబ్ అసిస్టెంట్ డైరెక్టర్‌గానూ చేశారు.‘తుగ్లక్’ అనే చిత్రంలో తన మొదటి పాత్రను పోషించారు. రక్షిత్ శెట్టి హీరోగా రిషబ్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘రికీ’ (2016). ఆ తర్వాతి సినిమా ‘కిరిక్ పార్టీ’తో దర్శకుడిగా రిషబ్ పేరు కన్నడనాట మార్మోగింది. హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ‘కాంతార’తో రిషబ్ పాన్ ఇండియా స్టార్ అయ్యారు. -
టయోటా కిర్లోస్కర్ వైస్ చైర్‌పర్సన్‌గా మానసి టాటా.. ఎవరీ మానసి?
సాక్షి,ముంబై: టయోటా కిర్లోస్కర్ మోటార్ వైస్ చైర్‌పర్సన్‌గా విక్రమ్ కిర్లోస్కర్ కుమార్తె మానసి టాటా నియమితు లయ్యారు. ఆమె తండ్రి విక్రమ్ కిర్లోస్కర్ అకాలమరణం తరువాత, కంపెనీ JV కంపెనీల బోర్డులో డైరెక్టర్ అయిన మానసి టాటాను టయోటా కిర్లోస్కర్ ఆటో విడిభాగాల (TKAP) వైస్ చైర్‌పర్సన్‌గా నియమించింది. తక్షణమే వైస్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నట్లు టయోటా కిర్లోస్కర్ మోటార్ గురువారం ప్రకటించింది. మానసి టాటా ఇప్పటికే టయోటా కిర్లోస్కర్ మోటార్లో డైరెక్టర్ల బోర్డులో సభ్యురాలిగా ఉన్నారు. అలాగే కంపెనీ కార్పొరేట్ నిర్ణయాలు ,వ్యూహాత్మక కార్యకలాపాలలో కీలకంగా ఉన్నారని కంపెనీ ఒకప్రకటనలో తెలిపింది. ఇంక్లూజివ్ థినింగ్ , పీపుల్ సెంట్రిక్ ఔట్లుక్"ని తీసుకొచ్చి, భారతీయ ఆటో పరిశ్రమపై ఆమెకున్న పదునైన అవగాహనతో పాటు, 'అందరికీ మాస్ హ్యాపీనెస్' అందించడంలో కంపెనీ నిబద్ధతను ఆమె నియామకం మరింత బలోపేతం చేస్తుందని టొయోటా కిర్లోస్కర్ మోటార్ సీఎండీ మసకాజు యోషిమురా అన్నారు" మానసి టాటా అమెరికాలోని రోడ్ ఐలాండ్ స్కూల్ ఆఫ్ డిజైన్ నుండి గ్రాడ్యుయేట్ అయ్యారు. కేరింగ్ విత్ కలర్ అనే ఎన్జీవో ద్వారా కర్ణాటకలోని మూడు జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలలపై పనిచేస్తున్నారు ఆమె 2019లో నోయెల్ టాటా (రతన్ టాటా సవతి సోదరుడు)కుమారుడు నెవిల్లే టాటాను వివాహం చేసుకున్నారు. కిర్లోస్కర్ సామ్రాజ్యం ఐదోతరం ప్రతినిధిగా తండ్రి వారసత్వాన్ని నిలబెట్టాలని బిజినెస్ వర్గాలు భావిస్తున్నాయి. కాగా మానసి తండ్రి విక్రమ్ కిర్లోస్కర్ గతేడాది నవంబర్‌లో గుండెపోటుతో కన్నుమూశారు. డిసెంబరులో, కిర్లోస్కర్ సిస్టమ్స్ కంపెనీ యొక్క JV కంపెనీలైన టయోటా ఇండస్ట్రీస్ ఇంజిన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, కిర్లోస్కర్ టయోటా టెక్స్టైల్ మెషినరీ ప్రైవేట్ లిమిటెడ్ (KTTM), టయోటా మెటీరియల్ హ్యాండ్లింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (TMHIN), DNKI బోర్డులో మానసి టాటాను డైరెక్టర్‌గా నియమించింది. -
Hyderabad: ‘పింక్ లీగల్’.. మహిళలకు న్యాయ సమాచారం.. ఏ డౌట్ వచ్చినా..
దేశం ఎంత అప్డేట్ అవుతున్నప్పటికీ.. ఆడవాళ్లపై భౌతిక దాడులు, అత్యాచారాలు, అవమానాలు మాత్రం ఆగడం లేదు. వంటింట్లో మొదలు ఆఫీస్, స్కూల్, కాలేజీ, రోడ్డు మీద... ఇలా ప్రతిరోజూ మహిళ అవమానాలను ఎదుర్కొంటూనే ఉంది. మహిళల కోసం ఉన్న చట్టాలు ఏంటి... ఆ చట్టాలు ఎలా పనిచేస్తున్నాయి, ఎవరైనా ఏదైనా ఇబ్బందిలో ఉంటే ఆ ఇబ్బందికి పరిష్కార మార్గం ఏ సెక్షన్ ద్వారా దొరుకుతుంది, పోలీసు స్టేషన్లో, కోర్టులో, ఆఫీస్‌లో, బయట అవమానాలు ఎదుర్కొన్న మహిళ ఏయే సెక్షన్ల గురించి తెలుసుకోవడం అవసరం... వంటి వివరాలతో ‘పింక్ లీగల్’ అనే వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చారు హైదరాబాద్‌కు చెందిన మానసి చౌదరి. ఢిల్లీలోని జిందల్ గ్లోబల్ లా స్కూల్లో మానసి న్యాయశాస్త్రంలో పట్టా పొంది, రాష్ట్రహైకోర్టులో రెండేళ్లపాటు ప్రాక్టీస్ చేశారు. సుప్రీంకోర్టు జస్టిస్ డీవై చంద్రచూడ్ వద్ద అసిస్టెంట్‌గా చేశారు. ఆ సమయంలోనే సెక్షన్ 377పై తీర్పు, శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల స్త్రీలు ప్రవేశించ వచ్చనే తీర్పు రావడం జరిగింది. సుదీర్ఘ అనుభవం కలిగిన మానసి తనకు వ్యక్తిగతంగా ఎదురైన ఓ పరిణామాన్ని జీర్ణించుకోలేక ఇండియన్ పీనల్ కోడ్(ఐపీసీ)లో మహిళల హక్కులు తెలిపే సెక్షన్లు ఎన్ని ఉన్నాయి, ఏయే సెక్షన్ల కింద ఏయే హక్కులు మహిళలకు ఉన్నాయనే సమాచారాన్ని సంక్షిప్తంగా అందించేందుకు చేసిన కృషి నేడు ఎందరో స్త్రీలకు ఆసరాగా నిలుస్తోంది. ఫలించిన మూడేళ్ల పోరాటం ఐదేళ్ల క్రితం ఓ రోజు రాత్రి ఆఫీసు పని ముగించుకుని ఇంటికి వెళుతున్న సమయంలో నలుగురు యువకులు తప్పు తమదే అయినా మానసిపై భౌతిక దాడి చేసేందుకు సిద్ధపడ్డారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన మానసి తన వద్ద ఉన్న సాక్ష్యాలను పోలీసులకు ఇచ్చి ఆ యువకులకు శిక్షపడేలా చేశారు. న్యాయవాదిని కాబట్టి నాకు రూల్స్ తెలుసు. ‘హక్కులు తెలియని మహిళల పరిస్థితి ఏంటి?’ అని ఆలోచించిన మానసి ఆ రోజు నుంచి మూడేళ్లపాటు మహిళలకు న్యాయసమాచారాన్ని అందించేందుకు కసరత్తు చేసింది. ఓ పక్క ఉద్యోగం చేస్తూ.. ఇంకోపక్క సీనియర్ న్యాయవాది వద్ద ప్రాక్టీస్ చేస్తూనే రాత్రివేళల్లో వెబ్సైట్ పనుల్లో నిమగ్నమయ్యేవారు. హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో ఉన్న లా బుక్స్ తిరగేశారు. రాజ్యాంగంలో మహిళలకు ఉన్న హక్కుల గురించి తెలుసుకున్నారు. 2018లో తొలుత ‘లైంగిక వేధింపులు, మహిళల ఆస్తిహక్కులు’ అనే అంశాలపై పైలట్ ప్రాజెక్ట్‌గా వెబ్సైట్ ద్వారా సమాచారాన్ని అందించారు. దీనికి మంచి ఆదరణ, స్పందన వచ్చినప్పటికీ, మహిళకు దక్కాల్సిన న్యాయం, హక్కుల గురించి మరింత లోతుగా తెలుసుకోవాలనే సంకల్పంతో మరో అడుగు ముందుకేశారు. ఇందుకోసం సుప్రీం, హైకోర్టులకు చెందిన సీనియర్ క్రిమినల్ లాయర్లను సంప్రదించారు, సుమారు పదిమంది లా విద్యార్థుల సాయం తీసుకున్నారు. మూడేళ్లపాటు రాత్రింబవళ్లు కష్టపడి చివరికి మహిళలకు ధైర్యం చేకూర్చేలా, వారి హక్కులు తెలుసుకునేలా ‘లైంగిక వేధింపులు, గృహహింస, వివాహం, విడాకులు, ఆస్తిహక్కులు, బాలల హక్కులు, సైబర్ బెదిరింపులు..’ వంటి వాటిపై అవగాహన కలిగించేలా ఓ వెబ్సైట్ ను రూపొందించారు. తన టీమ్‌తో మానసి చౌదరి లక్షమంది ముందడుగు 2020 మార్చి 8న వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకురావడంతోపాటు దానికి సోషల్ మీడియా వేదికగా ప్రచారాన్ని నిర్వహించారు. ‘పింక్ లీగల్’ కాన్సెప్ట్ నచ్చి ఆమెతో కలసి మహిళలకు అండగా నిలిచేందుకు, న్యాయసలహాలు అందించేందుకు లా స్టూడెంట్స్ కొందరు జత కలిశారు. దేశవ్యాప్తంగా పలు యూనివర్సిటీల్లో చదువుతున్న సుమారు 30 మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మహిళల హక్కులు, న్యాయ సలహాలను గుర్తుచేస్తున్నారు. దీనిలోనే‘ఫ్రీ హెల్ప్‌లైన్’ ను ప్రారంభించారు. బాధితులు ఎవరైనా అప్లికేషన్‌ను పూర్తి చేసి దానిలో ఫోన్ నంబర్ రాసి, సబ్మిట్ చేస్తే వాలంటీర్ సదరు మహిళకు ఫోన్ చేసి న్యాయ సలహా అందిస్తారు. అంతేకాదు, ఆ సమస్య పరిష్కారం అయ్యే వరకు వెన్నంటి ఉంటారు. సాంకేతికంగా ఎటువంటి పరిజ్ఞానం లేని వారిని దృష్టిలో పెట్టుకున్న మానసి గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛంద సంస్థలతో ఒప్పందమయ్యారు. ఆయాప్రాంతాల్లో మహిళలకు ఏదైనా ఇబ్బంది కలిగితే ‘పింక్లీగల్’ గురించి చెప్పి, వారికి ఏయే సెక్షన్లు ఎలా ఉపయోగపడతాయనే దానిపై అవగాహన కల్పిస్తున్నారు. ఏదైనా అంశంపై వికీపీడియా ఎలా అయితే పూర్తి సమాచారాన్ని అందిస్తుందో.. మహిళలకు చట్టాలు, హక్కులపై ‘పింక్ లీగల్’ అలా ఒక ఎన్‌సైక్లోపిడియాలా పని చేస్తుందంటున్నారు మానసి. పింక్ లీగల్ కాన్సెప్ట్ నచ్చి మానసితో కలసి మహిళలకు అండగా నిలిచేందుకు, న్యాయసలహాలు అందించేందుకు లా విద్యార్థులు జత కలిశారు. దేశవ్యాప్తంగా పలు యూనివర్సిటీల్లో చదువుతున్న సుమారు 30 మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మహిళల హక్కులు, న్యాయ సలహాలను గుర్తుచేస్తున్నారు. – చైతన్య వంపుగాని చదవండి: Miss Universe: చారిత్రక మార్పు! ఇకపై వాళ్లు కూడా పాల్గొనవచ్చు! అయితే.. -
ఎనిమిదేళ్ల చిన్నవాడిని పెళ్లాడిన నటి
ముంబై: బాక్సర్ ప్రదీప్ ఖరేరా(25) మరాఠి నటి మానసి నాయక్‌ను వివాహమాడాడు. పుణెలో అత్యంత సన్నిహితుల మధ్య మహరాష్ట్రీయుల సంప్రదాయం ప్రకారం వీరి పెళ్లి జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను కొత్తజంట సోషల్ మీడియాలో షేర్ చేసింది. గులాబీ రంగు లెహంగాలో వధువు మానసి చూడముచ్చటగా కనిపించగా.. వరుడు ప్రదీప్ బంగారు వర్ణపు షేర్వాణీ ధరించి హుందాగా కనిపించాడు. పెళ్లి వేడుక అనంతరం కొత్తజంట వరుడి స్వస్థలం హర్యానాకు తిరిగి వచ్చింది. కుటుంబ సభ్యులతో కలిసి వివాహానంతర కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు వెల్లడించింది.(చదవండి: దయచేసి నన్ను ఫాలో కావొద్దు) కాగా గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న తాము త్వరలోనే పెళ్లి చేసుకోనున్నట్లు మానసి- ప్రదీప్ ఇటీవలే సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. మంగళవారం వివాహ బంధంతో ఒక్కటైనట్లు తెలిపారు. ప్రొఫెషనల్ బాక్సర్‌గా గుర్తింపు పొందిన ప్రదీప్ ఖారారే.. వరల్డ్ బాక్సింగ్ కౌన్సిలింగ్ ఏషియన్ టైటిల్ సాధించి సత్తాచాటాడు. ఇక మానసి.. జబర్దస్త్, తూక్యా తుక్విలా నగ్యా నచ్విలా వంటి సినిమాలతో పాటు పలు టీవీ సీరియల్స్‌లో నటించారు. బాగ్తోయి రిక్షావాలా అనే డాన్స్ నంబర్‌తో ఆమె పాపులర్ అయ్యారు. ఇక తన పెళ్లి అనంతరం మానసి మాట్లాడుతూ.. ఎట్టకేలకు మిసెస్ ఖరేరా అయినందుకు సంతోషంగా ఉందని, ఈ ఆనందాన్ని మాటల్లో వర్ణించేలేనంటూ హర్షం వ్యక్తం చేశారు. తన సోల్‌మేట్‌తో పాటు అతడి కుటుంబం కూడా ఎంతో ఆప్యాయంగా తనను అక్కున చేర్చుకుందని చెప్పుకొచ్చారు. కాగా ప్రదీప్- మానసి కంటే ఎనిమిదేళ్లు చిన్నవాడు. -
వావ్.. వాటే బ్యూటీ.. ఐష్ జిరాక్సే
ఐశ్వర్యరాయ్.. అందానికి కేరాఫ్ అడ్రస్. అందం అంటే ఆమెదే. కుర్రకారు మొదలుకుని సినీ నిర్మాతల వరకూ ఆమె అందానికి ఆకర్షితులే. ప్రతి ఒక్కరు అందాన్ని ఆమెతో పోల్చి చెబుతారు. అలాంటి అందమైన స్త్రీ భూమ్మీద మరొకరు ఉండరని అంటుంటారు. కానీ ఉన్నారు. ఆమే మారాఠీ నటి మనసి నాయక్. ఐశ్యర్యరాయ్ లాంటి కళ్లు, అందం గల మనసి నాయక్.. ఇటీవల సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యారు. ఆమె చేసిన టిక్‌టాక్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆమె ఫోటోలు, వీడియోలు చూసిన ప్రతి ఒక్కరు అచ్చం ఐశ్యర్యరాయ్ లాగే ఉన్నారని పొగిడేస్తున్నారు. ఇక తనను ఐశ్యర్యరాయ్‌తో పోల్చడంతో తెగ సంబరపడిపోతుంది మనసి నాయక్. ఐశ్వర్యరాయ్ సినిమాలోని పాటలకు టిక్‌టాక్ వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఆమె వీడియోలు చూసిన ప్రతి ఒక్కరు అచ్చం ఐశ్యర్యరాయ్లా ఉన్నారని కామెంట్ చేస్తున్నారు. ‘ఐశ్యర్యరాయ్ డూబ్లికేట్’, , ‘ఐశ్యరాయ్ జిరాక్స్’, , ‘యంగ్ ఐశ్యర్యరాయ్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మనసి నాయక్ ప్రముఖ మరాఠి నటి. ‘బాగ్తోయి రిక్షావాలా’ అనే ఐటమ్ సాంగ్‌లో నటించి ఫేమస్ అయ్యారు. తర్వాత జబర్దాస్త్, టార్గెట్, కుటుంబ్, టీన్ బేకా ఫాజిటి ఐకా తదితర మరాఠి చిత్రాలలో నటించారు. 4 మిలియన్ల మంది ఆమె టిక్‌టాక్ వీడియోలను ఫాలో అవుతున్నారు. ఇన్‌స్ట్రాగ్రామ్‌లో 9,43,537 మంది ఫాలోవర్స్ ఉన్నారు. View this post on Instagram I love sharing My tiktok videos For My fans 🤗💋❤ And yes I love to Be Desi🇮🇳 because I have it naturally in me...😉 Good morning Instagram Family ☕👸 #ManasiNaik #BeingMe #Inspire #Motivate #IndianBeauty #smile #Eyes #Actor #performer #Love #PardeepManasi #couplegoals #DesiGirl🇮🇳 #Sunshine #Indian #Traditional A post shared by Manasi Naik (@manasinaik0302) on Feb 24, 2020 at 8:19pm PST -
మానసిక విజయం
సుప్రీంకోర్ట్‌లో చంద్రచూడ్గారికి అసిస్టెంట్గాపనిచేయడమంటే ప్రాక్టికల్ నాలెడ్జ్‌ను గడించడమే.ముఖ్యంగా ఆ మూడు తీర్పులప్పుడు చేసినపరిశోధనతో చాలా నేర్చుకున్నాను. ఆ చారిత్రాత్మకతీర్పులకు నేను ప్రత్యక్ష సాక్షిని. ఇంతకు మించినఆనందం ఏం ఉంటుంది? ఆ మూడు సందర్భాల్లోకోర్టు హాలులో వినిపించిన చప్పట్లు.. కోర్ట్ బయట మీడియాతో సహా సామాన్య జనం జరుపుకున్నసంబరాలు ఎప్పటికీ మరిచిపోలేను. – మానసి హైదరాబాద్.. 2017 సంవత్సరం.. ఒకరోజు రాత్రి పదిగంటల సమయం.. పని ముగించుకొని ఆఫీస్ నుంచి ఇంటికి బయలుదేరారు అడ్వకేట్ మానసి చౌదరి. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 దగ్గర సిగ్నల్స్ దగ్గర తన కారును ఎవరో ఢీ కొట్టినట్టని పించింది ఆమెకు. పరిస్థితి అర్థమయ్యేలోపే ఇద్దరబ్బాయిలు కారు దిగి ఆమె కారు దగ్గరకు వచ్చి.. కారు అద్దాలను పగలకొట్టారు విండోస్, రేర్ వ్యూ మిర్రర్స్ సహా. ఈ బీభత్సాన్ని చూసి గట్టిగా అరిచారు మానసి. దాంతో ఆమెకు మిడిల్ ఫింగర్ చూపిస్తూ వెళ్లిపోయారు ఆ ఇద్దరూ. వాళ్ల కారు నంబర్ ప్లేట్‌ను ఫొటో తీసుకొని షీ టీమ్స్‌కి సమాచారమందించి, దగ్గర్లోని పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ ఇచ్చారామె. తెల్లవారి.. ఆ కుర్రాళ్లిద్దరినీ పట్టుకొని పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు పోలీసులు. ఆ అబ్బాయిలిద్దరి నుంచి బేషరతుగా క్షమాపణ రాయించుకున్నారు మానసి. ‘నిజానికి వాళ్ల మీద కంప్లయింట్ చేయాలనేమీ అనుకోలేదు. కాని అలాగే వదిలేస్తే.. ఏం చేసినా ఆడవాళ్లు నోరు మెదపరు, ఏం చేసినా చెల్లుతుంది అనే రాంగ్ మెసేజ్ పోతుంది. అందుకే కంప్లయింట్ ఇచ్చా’ అని జరిగిన సంఘటనను ఒకసారి గుర్తు చేసుకున్నారు ఆమె. అసలు ఈ ప్రస్తావన ఇప్పడు ఎందుకు? రాజ్యాంగం మహిళలకు ఇచ్చిన హక్కులు, కల్పించిన సమస్త చట్టాలన్నిటినీ ఒక దగ్గర చేర్చి‘పింక్ లీగల్’ అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించారు మానసి, మొన్న ఎనిమిదో తారీఖు.. అంతర్జాతీయ మహిళాదినోత్సవం రోజున (8 మార్చి, 2020). ఈ సందర్భమే పైన ప్రస్తావనకు కారణం. ముందు ఆమెను పరిచయం చేసుకుందాం. ఆమె ముంబైలో పుట్టారు.హైదరాబాద్‌లో పెరిగారు. ఢిల్లీలోని జిందాల్ గ్లోబల్ లా కాలేజ్‌లో గ్రాడ్యుయేషన్ చేశారు. తర్వాత హైదరాబాద్ వచ్చేసి హైకోర్ట్ లాయర్‌గా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. యేడాది తర్వాత అంటే 2018లో మళ్లీ ఢిల్లీ వెళ్లారు సుప్రీంకోర్ట్ లాయర్‌గా అనుభవం గడించడానికి. జస్టీస్ చంద్రచూడ్ అసిస్టెంట్లలో ఒకరిగా చేరారు. ఎల్జీబీటీ సంబంధాలు (ఐపీసీ 377పై సడలింపు) నేరం కాదని, అడల్ట్రీ నేరం కాదని (ఐపీసీ 497), శబరిమల ఆలయంలోకి మహిళలకూ ప్రవేశం ఉండాలని వచ్చిన సుప్రీంకోర్టు తీర్పుల్లో జస్టీస్ చంద్రచూడ్ కృషి ఉంది. అందులో మానసికీ భాగస్వామ్యం ఉంది. 2019లో మళ్లీ హైదరాబాద్ హైకోర్ట్‌కి వచ్చేశారు ఆమె. పింక్ లీగల్ ఆలోచన.. ‘లా చదువుతున్నప్పుడే అనుకున్నాను.. మహిళలకు సంబంధించిన అన్ని విషయాలను ఒక్కచోటకు చేర్చే ప్రయత్నమేదో చేయాలని. ఆ ఆలోచన హైదరాబాద్ వచ్చాక కూడా కొనసాగింది. అందుకే 2017లో నల్సార్ లా కాలేజ్ స్టూడెంట్స్‌తో కలిసి ఆన్ లైన్ సర్వే ఒకటి చేశాను. తమకున్న హక్కులేంటి? తమకోసం ఎన్ని రకాల చట్టాలున్నాయి? అని ఎంతమంది ఆడవాళ్లు తెలుసు అనే విషయం మీద. 80 శాతం మందికి తెలియదని తేలింది సర్వేలో. ఆశ్చర్యం ఏంటంటే వాళ్లలో చాలామంది చదువుకున్న, పట్టణాలు, నగరాల్లో ఉంటున్న మహిళలే! అప్పుడు అనిపించింది నా ఆలోచనను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆచరణలో పెట్టాలని. అయితే ఇతర బాధ్యతల్లో పడి ఆలస్యమై.. ఇప్పటికి సాధ్యమైంది’ అంటూ పింగ్ లీగల్ నేపథ్యం చెప్పుకొచ్చారు ఆమె. ప్రాంతీయ భాషల్లో కూడా.. ప్రస్తుతం పింక్ లీగల్ ఇంగ్లిష్‌లో ఉంది. త్వరలోనే దేశంలోని ప్రాంతీయ భాషలన్నిటిలోకి అనువదించనున్నారు. ఈ వారం, పదిరోజుల్లోనే రెండువేల మందికి పైగా సబ్‌స్క్రైబ్ చేశారట. వీళ్లలో అబ్బాయిలూ ఉన్నారు. ముఖ్యంగా విద్యార్థులు అంటారామె. ‘చదువురాని, గ్రామీణ ప్రాంతం వాళ్లకూ తేలికగా అర్థమయ్యేలా ఈ హక్కులు, చట్టాలను వివరిస్తూ యూ ట్యూబ్ చానెలూ పెట్టాలనుకుంటున్నాను. నా ఈ ప్రాజెక్ట్‌కు లా స్టూడెంట్స్ సహకారం చాలా ఉంది. మహిళల హక్కులు, చట్టాల మీద మహిళలకే కాదు పురుషులకూ అవగాహన అవసరం. అది హైస్కూల్ స్థాయి నుంచే ఆరంభిస్తే మరీ మంచిది. దీనిని పాఠ్యాంశాల్లో చేర్చాలి’ అంటున్నారు మానసి.– సరస్వతి రమ -
మరో బంగారం; ‘అదొక అద్భుతమైన రోజు’!
భారత బ్యాడ్మింటన్ కీర్తిని ప్రపంచవ్యాప్తం చేసిన తెలుగు తేజం పీవీ సింధు పేరు మారుమ్రోగిపోతోంది. భారత్‌కు ఒలంపిక్ పతకం సాధించిపెట్టడంతో పాటుగా ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌గా నిలిచిన ఆమెకు భారతావని నీరాజనాలు పలుకుతోంది. నాలుగు దశాబ్దాల కలగా ఉన్న స్వర్ణాన్ని సాధించిన సింధు ‘మా బంగారం’ అంటూ మురిసిపోతోంది. ఆటలో అసాధారణ ప్రతిభ కనబరిచిన సింధు బ్రాండ్ వ్యాల్యూ కూడా అమాంతం పెరిగిపోయింది. స్విట్జర్లాండ్‌లో మువ్వన్నెల జెండాను రెపరెపలాడించిన సింధుకు స్వదేశంలో అపూర్వ స్వాగతంతో పాటుగా పలు నజరానాలు లభించాయి. ఆమె గురువు బ్యాడ్మింటన్ దిగ్గజం పుల్లెల గోపీచంద్ కూడా ఈ విజయం ఎంతో ప్రత్యేకమైనదంటూ సింధుపై ప్రశంసలు కురిపించారు. ఇలా దేశమంతా సింధు విజయాన్ని ఆస్వాదిస్తూ తన్మయత్వంతో మునిగిపోయిన వేళ.. ఆదివారం నాడు స్విట్జర్లాండ్‌లో మరో భారత క్రీడాకారిణి కూడా స్వర్ణం సాధించారు. తన పేరు మానసి జోషి. పారా బ్యాడ్మింటన్‌లో స్వర్ణం సాధించిన 30 ఏళ్ల క్రీడాకారిణి ఆమె. తన ప్రత్యర్థి, ప్రపంచ నెంబర్ 1 పారుల్ పామర్ను మట్టికరిపించి తొలిసారి పారా వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. అన్నట్లు ఇంకో విషయం ఈ ‘బంగారు’ తల్లి కూడా గోపీచంద్ అకాడమీలోనే శిక్షణ తీసుకోవడం విశేషం. విషాదం నుంచి తేరుకుని చాంపియన్‌గా.. ముంబైలో 2011లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మానసి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో ఆమె ఎడమ కాలు తెగిపడింది. ఎముకలు విరిగిపోవడంతో పాటు శరీరంలోని పలు కీలక భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన దాదాపు మూడు గంటల పాటు ఘటనాస్థలిలోనే పడి ఉన్నారు. దాదాపు పది గంటల తర్వాత ఆస్పత్రికి చేరిన ఆమెకు వైద్యులు చికిత్స అందించి ప్రాణాలు నిలిపారు. అయితే ఆమె కాలు మాత్రం తిరిగి అతికించే అవకాశం లేదని చెప్పారు. గ్యాంగ్రీన్ సోకిన కారణంగా దానిని తొలగించామనే చేదు నిజాన్ని మానసికి చెప్పారు. అయితే ఆ విషాదం నుంచి తేరుకున్న మానసి నాలుగు గోడలకే పరిమితం కావాలనుకోలేదు. ఈ క్రమంలో దాదాపు ఏడాది తర్వాత కృత్రిమ కాలుతో నడవడం ప్రారంభించిన మానసి బ్యాడ్మింటన్‌పై ఆసక్తితో ఆట సాధన చేశారు. అదేవిధంగా స్కూబా డైవింగ్‌లో కూడా మెళకువలు నేర్చుకున్నారు. పారా ఏషియన్ గేమ్స్‌లో ఎంపిక కాకపోయినా పట్టుదల వదలక అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటారు. ఇలా తనకు ఇష్టమైన బ్యాడ్మింటన్‌లో రాణిస్తూ.. దృఢ సంకల్పం ముందు వైకల్యం కూడా చిన్నబోతుందని నిరూపించారు. శరీరంలో ఒక భాగం కోల్పోయినంత మాత్రాన జీవితంలో ఇక ఏమీ సాధించలేమనే భావనను దరిదాపుల్లోకి కూడా రానివ్వకుండా చాంపియన్‌గా నిలిచి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. 2014లో అంతర్జాతీయ క్రీడల్లో ప్రవేశించిన మానసి ప్రస్తుతం ‘పసిడి’ దక్కించుకుని తానేంటో ప్రపంచానికి చాటిచెప్పారు. మానసికంగా సన్నద్ధమయ్యా.. తన గెలుపు గురించి మానసి మాట్లాడుతూ...‘ ప్రపంచ చాంపియన్ అనిపించుకోవడం ఎంతో గర్వంగా ఉంటుంది. అయితే ఈ విజయం నాకు అలవోకగా దక్కలేదు. ఎన్నో సవాళ్లను అధిగమించి పసిడి కైవసం చేసుకున్నాను. ఎంతో మంది క్రీడాకారులు ఇలాంటి క్షణం కోసం నాలాగే ఎంతగానో ఎదురుచూస్తూ ఉంటారు. కెనడియన్ ఓపెన్‌లో నేను పారుల్(ఇండియా) చేతిలో ఓటమి చవిచూశా. అందుకే ఈ పోటీలకు మానసికంగా సన్నద్ధమయ్యా. ఫిట్నెస్తో పాటు ఆట తీరుపై మరింత దృష్టి పెట్టాను. ఎంతో మంది గొప్ప క్రీడాకారులు అసాధారణ విజయాలు సాధించిన ఇదే వేదికపై నేను కూడా నా కలను సాకారం చేసుకోవడం నిజంగా ఎంతో ఆనందంగా ఉంది’ అని హర్షం వ్యక్తం చేశారు. క్లియర్ స్ట్రోక్స్ సంధిస్తూ కేవలం ఆటపై మాత్రమే దృష్టి సారించాలనే గోపీ సర్ మాటలను ఈ సందర్భంగా ఆమె గుర్తుచేసుకున్నారు. ఈ పోటీకి రెండు నెలల ముందు అకాడమీలో జాయిన్ అయిన ఆమె గోపీచంద్‌కు కృతఙ్ఞతలు తెలిపారు. ‘ఇప్పటికైనా ఓ క్రీడాకారిణిగా నా జీవితం మారుతుందనుకుంటున్నా. ఈ పతకం సాధించడం కోసం నేను పడిన కఠోర శ్రమకు తగిన గుర్తింపు, సహాయం లభిస్తుందని ఆశిస్తున్నా. వచ్చే ఏడాది జరుగనున్న పారా ఒలంపిక్స్‌పైనే ప్రస్తుతం దృష్టి సారించాను’ అని తన భవిష్యత్ ప్రణాళికను వెల్లడించారు. అదే విధంగా తన సంతోషాన్ని సోషల్ మీడియాలో పంచుకున్న మానసి...‘టోక్యో పారా ఒలంపిక్స్‌కు ఓ ఏడాది ముందుగానే స్వర్ణం సాధించాను. ప్రపంచ బ్యాడ్మింటన్‌షిప్‌లో అద్భుతమైన రోజు అది. పీవీ సింధు నువ్వు చాలా గ్రేట్. శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశారు. ఈ క్రమంలో మానసికి ట్విటర్ వేదికగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మానసిపై ప్రశంసలు కురిపించారు. ‘ పారా బ్యాడ్మింటన్‌లో భారత్‌కు స్వర్ణ పతకం సాధించిన మానసి జోషికి అభినందనలు. ఈ విజయంతో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన నీకు శుభాకాంక్షలు’ అని ఆయన ట్వీట్ చేశారు. ఇక మనం కూడా మానసి కోరుకున్నట్లుగా కాస్త ఆలస్యంగానైనా సరే ఆమె విజయానికి తగిన గుర్తింపు దక్కాలని ఆశిద్దాం. Many congratulations to #MansiJoshi on winning gold for India 🇮🇳 at the Para-Badminton World Championship 👏👏 Kudos to your spirit & achievement 👍 pic.twitter.com/qGU34X6IBN — KTR (@KTRTRS) August 28, 2019 -
మనసి చిత్ర గీతాలావిష్కరణ
మానసి చిత్ర గీతాలావిష్కరణ కార్యక్రమం బుధవారం సాయంత్రం స్థానిక టీ.నగర్‌లోని ఎంఎం థియేటర్లో జరిగింది. మూవీ మోషన్స్, ఎంజే.ఫిలింస్ అధినేతలు ఏ.పాహిమ్ ముహ్మదు, మాథ్యూజోసెఫ్లు నిర్మిస్తున్న చిత్రం మనసి. నవ జంట నరేశ్‌కుమార్, హారిస హీరోహీరోయిన్లుగా నటిస్తునారు. నటి హారిస ఇప్పటికే మలయాళంలో రెండు మూడు చిత్రాలలో నటించింది. తమిళంలో ఈ చిత్రం ద్వారా పరిచయం అవుతోంది. ఇందులో ఇతర ముఖ్య పాత్రల్లో తవసి, లనూప్సతీషన్, సల్మాన్, పృథ్వీ, కేశవ్, ఆశిక్ తదితరులు నటిస్తున్నారు. ప్రముఖ మలయాళ దర్శకులు కమల్, ఫాజిల్‌ల వద్ద సహాయ దర్శకుడిగా పనిచేసిన నవాజ్సులేమాన్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శివరామ్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ ఇది ఒక గొర్రెల కాపరి ఇతివృత్తంతో తెరకెక్కిస్తున్న కథా చిత్రం అని చెప్పారు. ఆ యువకుడు గొర్రెలను తన ఆత్మబంధువులుగా భావిస్తాడన్నారు. ఎవరికీ చెడు తలపెట్టని మూగ జీవులంటే అతనికి అంత ప్రేమ అన్నారు. అలాంటిది అందులో ఒక గొర్రె కనిపించకుండా పోయి ఆ యువకుడిని బాధకు గురి చేస్తుందన్నారు. అసలు ఆ గొర్రె ఏమయ్యింది, మళ్లీ తిరిగి వచ్చిందా? అన్న అంశాలను కమర్షియల్ రీతిలో చిత్రంగా మలచినట్లు తెలిపారు. చిత్రాన్ని తేని, కంభం, ఉత్తమపాళైయం, బోడి, ఉత్తుక్కాడు, కొంభై తదితర ప్రాంతాలలో చిత్రీకరించినట్లు దర్శకుడు వెల్లడించారు.