జిల్లాకు నూతన ప్రధాన న్యాయమూర్తి | New Chief Judge Appointed For Vizianagaram | Sakshi
Sakshi News home page

జిల్లాకు నూతన ప్రధాన న్యాయమూర్తి

Published Thu, Jul 11 2019 8:38 AM | Last Updated on Thu, Jul 28 2022 1:57 PM

New Chief Judge Appointed For Vizianagaram - Sakshi

జిల్లాజడ్జిగా బాధ్యతలు స్వీకరించిన గోపీకి పుష్పగుచ్ఛం అందజేస్తున్న అదనపు జిల్లా న్యాయమూర్తులు వై.హేమలత, ఇ.భీమారావు  

సాక్షి, విజయనగరం : జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా గుట్టల గోపి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇన్‌చార్జి జిల్లా జడ్జి ఇ.భీమారావు నుంచి ఆయన చార్జి తీసుకున్నారు. ఇంతవరకు ఇక్కడ పనిచేసిన జిల్లా జడ్జి ఆలపాటి గిరిధర్‌ను కర్నూలు బదిలీ చేసిన విషయం తెలిసిందే. జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన గోపిని అదనపు జిల్లా న్యాయమూర్తులు వై.హేమలత, ఇ.భీమారావు, ఇతర న్యాయమూర్తులు రాంబాబు, లక్ష్మీరాజ్యం ఆయన ఛాంబర్‌లో కలిసి పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు టి.వి.శ్రీనివాసరావు, కార్యదర్శి టి.బ్రహ్మాజీ, సంయుక్త కార్యదర్శి వై.హరికృష్ణ, కోశాధికారి జి.రాంబాబు మర్యాదపూర్వకంగా ఆయనను కలిసి న్యాయవాదుల సంఘ భవనానికి రావాల్సిందిగా ఆహ్వానించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement