New Chief Justice
-
ఆరు హైకోర్టులకు సీజేల నియామకం
న్యూఢిల్లీ: ఆరు హైకోర్టులకు నూతన ప్రధాన న్యాయమూర్తులను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్లూ రాజస్థాన్ హైకోర్టుకు యాక్టింగ్ చీఫ్ జస్టిస్‌గా ఉన్న మనీంద్ర మోహన్ శ్రీవాస్తవను అదే కోర్టులో చీఫ్ జస్టిస్(సీజే)గా నియమించారు. పంజాబ్, హరియాణా హైకోర్టు యాక్టింగ్ సీజే జస్టిస్ రీతూ బహ్రీని ఉత్తరాఖండ్ హైకోర్టు సీజేగా నియమించారు. పట్నా హైకోర్టు జడ్జి జస్టిస్ చక్రధారి శరణ్ సింగ్‌ను ఒడిశా హైకోర్టు సీజేగా నియమించారు. రాజస్తాన్ హైకోర్టు జడ్జి జస్టిస్ విజయ్ బిష్ణోయ్‌ను గౌహతీ హైకోర్టు సీజేగా నియమించారు. రాజస్తాన్ హైకోర్టులో జడ్జి జస్టిస్ అరుణ్ భన్సాలీని అలహాబాద్ హైకోర్టు సీజేగా నియమించారు. మద్రాస్ హైకోర్టులో జడ్జి జస్టిస్ ఎస్. వైద్యనాథన్‌ను మేఘాలయ హైకోర్టుకు సీజేగా నియమించారు. -
ఏపీ కొత్త సీజేగా జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా?
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా నియమితులు కానున్నట్లు సమాచారం. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం ఈ మేరకు కేంద్రానికి సిఫార్సు చేసినట్లు తెలిసింది. కొలీజియం ఇటీవల సమావేశమై పలు హైకోర్టుల సీజేలు, న్యాయమూర్తుల బదిలీపై ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీజే జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి ఛత్తీస్‌గఢ్ హైకోర్టుకు, ఛత్తీస్‌గఢ్ హైకోర్టు తాత్కాలిక సీజే జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా ఏపీ హైకోర్టుకు బదిలీ కానున్నట్లు భోగట్టా. అలాగే, ఎనిమిది మంది న్యాయమూర్తులకు ప్రధాన న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పిస్తూ.. ఐదుగురు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తులు, 28 మంది న్యాయమూర్తులను బదిలీ చేయాలని కేంద్రానికి కొలిజియం సిఫార్సు చేసినట్లు తెలిసింది. ఏపీకి మరో ఇద్దరు న్యాయమూర్తులు రానున్నట్లు సమాచారం. కొలిజియం సిఫార్సులను అధికారికంగా వెబ్సైట్లో పొందుపరచాల్సి ఉంది. జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా గురించి.. జస్టిస్ మిశ్రా ఆగస్టు 29, 1964న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాయగఢ్‌లో జన్మించారు. బిలాస్‌పూర్‌లోని గురు ఘాసిదాస్ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ, ఎల్ఎల్బీ పట్టాలు పొందారు. 1987 సెప్టెంబరు 4న న్యాయవాదిగా పేరు నమోదు చేయించుకుని రాయ్‌గఢ్‌లోని జిల్లా కోర్టు, జబల్పూర్లోని మధ్యప్రదేశ్ హైకోర్టు, బిలాస్‌పూర్‌లోని ఛత్తీస్‌గఢ్ హైకోర్టుల్లో ప్రాక్టీసు చేశారు. సివిల్, క్రిమినల్ కేసుల్లో పేరుగాంచారు. ఛత్తీస్‌గఢ్ బార్ కౌన్సిల్‌కు చైర్మన్‌గా పనిచేశారు. 2004 జూన్ 26 నుంచి 2007 ఆగస్టు 31 వరకు ఆ రాష్ట్ర అదనపు అడ్వొకేట్ జనరల్‌గా పనిచేశారు. అనంతరం సెపె్టంబరు 1, 2007 నుంచి న్యాయమూర్తి అయ్యే వరకూ అడ్వొకేట్ జనరల్‌గా కొనసాగారు. డిసెంబరు 10, 2009న ఛత్తీస్‌గఢ్ న్యాయమూర్తిగా నియమితులయ్యారు. -
జిల్లాకు నూతన ప్రధాన న్యాయమూర్తి
సాక్షి, విజయనగరం : జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా గుట్టల గోపి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇన్చార్జి జిల్లా జడ్జి ఇ.భీమారావు నుంచి ఆయన చార్జి తీసుకున్నారు. ఇంతవరకు ఇక్కడ పనిచేసిన జిల్లా జడ్జి ఆలపాటి గిరిధర్‌ను కర్నూలు బదిలీ చేసిన విషయం తెలిసిందే. జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన గోపిని అదనపు జిల్లా న్యాయమూర్తులు వై.హేమలత, ఇ.భీమారావు, ఇతర న్యాయమూర్తులు రాంబాబు, లక్ష్మీరాజ్యం ఆయన ఛాంబర్లో కలిసి పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు టి.వి.శ్రీనివాసరావు, కార్యదర్శి టి.బ్రహ్మాజీ, సంయుక్త కార్యదర్శి వై.హరికృష్ణ, కోశాధికారి జి.రాంబాబు మర్యాదపూర్వకంగా ఆయనను కలిసి న్యాయవాదుల సంఘ భవనానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. -
నేడు జస్టిస్ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం
-
సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన ఖేహర్
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్ జగదీష్‌సింగ్ ఖేహర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రపతి భవన్లో ప్రణబ్ ముఖర్జీ ఈ రోజు ఉదయం ఖేహర్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో జస్టిస్ ఖేహర్ 44వ సీజేఐగా బాధ్యతలు స్వీకరించారు. దాదాపు 8 నెలలపాటు.. ఆగస్టు 27 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పలువురు మంత్రులు హాజరయ్యారు. దేశ చరిత్రలో సిక్కువర్గానికి చెందిన వ్యక్తి సీజేఐగా బాధ్యతలు చేపట్టనుండటం ఇదే తొలిసారి. టీఎస్ ఠాకూర్ పదవీకాలం ఈ నెల 3వ తేదీ (మంగళవారం)తో ముగిసిన విషయం తెలిసిందే. కాగా జస్టిస్ ఖేహర్ సుప్రీంకోర్టులో పలు ధర్మాసనాలకు నేతృత్వం వహించారు. పలు కీలక తీర్పుల్లో భాగస్వామ్యం పంచుకున్నారు. ఎన్‌జేఏసీ కేసును విచారించిన ధర్మాసనానికి నేతృత్వం వహించడంతోపాటు గత జనవరిలో అరుణాచల్‌ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలనను రద్దుచేసిన ధర్మాసనానికి కూడా ఆయనే నేతృత్వం వహించడం గమనార్హం. అలాగే సహారా చీఫ్ సుబ్రతారాయ్‌ను జైలుకు పంపిన కేసును విచారించిన ధర్మాసనంలోనూ ఆయన పాలుపంచుకున్నారు. ఇటీవల ఒకేరకమైన పనికి ఒకే వేతనం ఉండాలంటూ కాంట్రాక్టు ఉద్యోగుల కేసులో కీలక తీర్పిచ్చిన ధర్మాసనానికీ ఆయన నేతృత్వం వ్యవహరించారు. -
నేపాల్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా కల్యాణ్
కాట్మండ్: నేపాల్ సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ కల్యాణ్ శ్రేష్ఠ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. అధ్యక్ష భవనంలో కల్యాణ్ శ్రేష్ఠ చేత ఆ దేశాధ్యక్షుడు రామ్ బరన్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కల్యాణ్ నూతన ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. దేశ అత్యున్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తిగా కల్యాణ్ శ్రేష్ఠ పేరును దేశాధ్యక్షుడు రామ్ బరన్ యాదవ్‌కు కాస్టిట్యూషన్ కౌన్సిల్ నివేదించింది. ఈ నివేదిక ఆధారంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కల్యాణ్ నియామకానికి రామ్ బరన్ యాదవ్ ఆమోద ముద్ర వేశారు.