నేపాల్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా కల్యాణ్ | Nepal gets new chief justice | Sakshi
Sakshi News home page

నేపాల్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా కల్యాణ్

Published Wed, Jul 8 2015 1:59 PM | Last Updated on Sun, Sep 3 2017 5:08 AM

Nepal gets new chief justice

కాట్మండ్: నేపాల్ సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ కల్యాణ్ శ్రేష్ఠ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. అధ్యక్ష భవనంలో కల్యాణ్ శ్రేష్ఠ చేత ఆ దేశాధ్యక్షుడు రామ్ బరన్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కల్యాణ్ నూతన ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు.

దేశ అత్యున్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తిగా కల్యాణ్ శ్రేష్ఠ పేరును దేశాధ్యక్షుడు రామ్ బరన్ యాదవ్కు కాస్టిట్యూషన్ కౌన్సిల్ నివేదించింది. ఈ నివేదిక ఆధారంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కల్యాణ్ నియామకానికి రామ్ బరన్ యాదవ్ ఆమోద ముద్ర వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement