క్రీడా కార్యదర్శి నియామకమెప్పుడో? | Sports Secretary Appointment in khammam district | Sakshi
Sakshi News home page

క్రీడా కార్యదర్శి నియామకమెప్పుడో?

Jul 16 2016 6:51 PM | Updated on Jul 11 2019 5:01 PM

జిల్లా పాఠశాలల క్రీడా కార్యదర్శి నియామకం లోపభూయిష్టంగా మారింది. రెండేళ్లకోసారి జరిగే నియామకం విషయంలో తాత్సారం జరుగుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఖమ్మం స్పోర్ట్స్ : జిల్లా పాఠశాలల క్రీడా కార్యదర్శి నియామకం లోపభూయిష్టంగా మారింది. రెండేళ్లకోసారి జరిగే నియామకం విషయంలో తాత్సారం జరుగుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాజా నిబంధనల ప్రకారం జిల్లాలోని స్కూల్ అసిస్టెంట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్(పీడీ)లు మాత్రమే జిల్లా పాఠశాలల క్రీడా కార్యదర్శులుగా నియమించాలనే నిబంధనను తెచ్చింది. ఈ విషయంలో జిల్లా విద్యాశాఖ ఒక నిర్ణయానికి రాకపోవడంతో సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. కార్యదర్శిని ఈనెల 15వ తేదీలోపు నియమించాలని డెరైక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి గత నెల 30వ తేదీన ఆదేశాలు వచ్చినా దాని గురించి పట్టించుకునేవారు కరువయ్యారు.
 
సీనియర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్‌కు మాత్రమే ఈ పదవిని ఇవ్వాలని నిబంధనలు సూచిస్తున్నాయి. సీనియర్లుగా భావిస్తున్న కొందరు పీడీలు ఈ పదవి వద్దనుకుంటే.. సర్వీసు ఉన్నంత కాలం తిరిగి ఈ పోస్టులో కొనసాగలేరు. జిల్లాలో 65 మంది మాత్రమే ఫిజికల్ ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంట్(పీడీ)లు ఉన్నారు. పీఈటీలు 220 మంది ఉన్నారు. ఇప్పటివరకు జిల్లా కేంద్రం పరిసర ప్రాంతాల్లో పనిచేసే వారిని మాత్రమే నియమించేవారు. కానీ.. తాజాగా జిల్లావ్యాప్తంగా సీని యర్ పీడీనే నియమించాలనే నిబంధన ఉండటంతో.. ఐదుగురు సీనియర్ పీడీలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో పోస్టుకు ఆసక్తి కనబరుస్తున్న వారు ఒక్కరు మాత్రమే ఉన్నట్లు సమాచారం. పదోన్నతి కల్పిస్తే తాము కూడా అర్హుల జాబితాలో ఉండే వారమని కొందరు పీఈటీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, కార్యదర్శి పోస్టును ఎన్నిక ద్వారా నియమిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
 
కార్యదర్శి పోస్టులో నియామకమయ్యే వారు కోటరీకి లోబడే ఏ నిర్ణయమైన తీసుకోవాల్సి ఉంటుంది. జిల్లాలో ఉన్న పీఈటీ వర్గాల్లో ఏదో ఒక వర్గాన్ని ఎంపిక చేసుకుని.. పని చేసుకోవాల్సి ఉంటుంది. తమకు అనుకూలంగా ఉండని కార్యదర్శికి నిర్వహణ బాధ్యతలు చేపట్టడం కష్టంగా మారుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జాయింట్ కలెక్టర్ నేరుగా పాఠశాలల క్రీడా నిర్వహణలో పాలుపంచుకుంటే.. అన్ని వర్గాలు సక్రమంగా పని చేస్తాయనే వాదన వినిపిస్తోంది. ప్రతి ఏటా జిల్లాస్థాయి పాఠశాలల క్రీడలు జరిగే సమయాల్లో జిల్లా విద్యాశాఖ అధికారులు కనీసం ఇటువైపు కూడా చూడరనే విమర్శలున్నాయి. ఈసారి జేసీ చైర్మన్ గా వ్యవహరించడంతో క్రీడలు విజయవంతంగా జరుగుతాయని జిల్లాలోని సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు అంటున్నారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement