
సిరిసిల్ల: ముఖ్యమంత్రి కేసీఆర్‌తో తనకు 48 గంటల్లో అపాయింట్‌మెంట్ ఇప్పిస్తే బిచ్చమెత్తెనా వాళ్లకు రూ.కోటి ఇస్తానని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ప్రకటించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కందికట్కూరు శివారులోని కిష్టారావుపల్లిలో హత్యకు గురైన తండ్రి, కొడుకులు సావనపెల్లి ఎల్లయ్య, శేఖర్ కుటుంబాన్ని గురువారం పరామర్శించారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. సీఎంను కలిసేందుకు పదిసార్లు లేఖలు రాశానని, వందలసార్లు అప్పీలు చేశానని చెప్పారు. తెలంగాణ కోసం కేసీఆర్ ఆమరణ దీక్షకు దిగితే నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేసింది తానేనని గుర్తు చేశారు. సీఎంను కలిసే అర్హత తనకు లేదా? అని ప్రశ్నించారు. నాలుగేళ్లుగా సమీక్షలు లేక దళితులు అన్యాయాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment